Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కబ్జాలో ఆక్వా రంగం

– జే గ్యాంగ్ రూ.5 వేల కోట్ల అక్రమ వసూళ్ల కోసం ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు
– ఎంపీ బీద మస్తాన్ రావు, మీటింగ్ పెట్టి ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నారు
– మొత్తం కప్పం వసూలు చేసేది ఈ అసోసియేషనే
– సీడ్, ఫీడ్ కంపెనీల మెడపై ఎక్స్ పోర్టర్లు కత్తిపెట్టి వసూళ్లు చేస్తున్నారు
– ఆక్వా ఫీడ్ ధర గతంలో కంటే 60శాతం పెరిగింది.
– జగన్ రెడ్డిది ఐరెన్ లెగ్
– జే-ట్యాక్స్ తో అన్ని వ్యవస్థలు విధ్వంసం
-పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు

రాష్ట్రంలో జగన్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతికి అంతులేకుండ పోయింది. ఆక్వారంగం జగన్ రెడ్డి కబంధహస్తాలలోకి వెళ్లిపోయింది. సీడ్, ఫీడ్, ఎక్స్ పోర్టు కంపెనీల మెడపై కత్తి పెట్టి రూ.5 వేల కోట్లు ఏడాదికి జే-టాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసి వంద కౌంటు రూ.270 గా నిర్ణయించారు. తర్వాత వీళ్లే దాన్ని మరింత తగ్గించి రూ.210 కి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎక్స్ పోర్టర్స్ తో ప్రభుత్వం కుమ్మక్కై వంద కౌంట్ రూ.170 పడిపోయేలా చేశారు.

కేజీకి రూ.300 పెట్టుబడిపెట్టిన రైతు నేడు రూ.170 అమ్ముకోవాల్సిన దయనీయ స్థితికి కారణం జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తే. రాష్ట్రంలో ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఆక్వా రైతుల మేలు కోసం కమిటీ వేశామని చెబుతూ రైతులను నిలువున దోచుకుంటున్నారు. సాధికారకమిటీతో రైతులకు ఏం మేలు జరిగిందో మంత్రులు చెప్పాలి? తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో ఆక్వారంగం రూ.66 వేల కోట్ల ఎగుమతులు జరిగితే జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆక్వారంగం కుదేలైపోయింది.

రూ.66 వేల కోట్ల ఎగుమతులు చేయడం అంటే ఆసియా ఖండంలోనే ఇండియాను, ఇండియాలో ఏపీని నెంబంర్ 1 గా నిలబిట్టింది. నేడు వైసీపీ నేతల అవినీతికి, జే-టాక్సులకి ఆక్వారంగం కుదేలైపోయింది. ఆక్వా ఎక్స్ పోర్టు అసోసియేషన్ పేరుతో వైసీపీ ఎంపీతో మాట్లాడిస్తున్నారు. దీనిపై జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. వైసీపీ నాయకులు, ఫీడ్, సీడ్, ఎగుమతిదారులు అందరూ బాగానే ఉన్నారు. కానీ, ఆరుగాలం కష్టించి రొయ్యలు పెంచుతున్న రైతులు నిలువున మునిగిపోయారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐరన్ లెగ్ లా అన్ని రంగాలను నాశనం చేశారు.

జగన్ రెడ్డికి సంబంధం లేని సినిమా రంగంలోని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లను బెదిరించి సినిమా ధియేటర్లు మూసుకునే తీసుకొచ్చారు. ప్రభుత్వంకు చేతనైతే వారిని ప్రోత్సహించాలి. కానీ. జగన్ రెడ్డి డబ్బు పిచ్చితో వారిని దోచుకుని దివాలాతీయిస్తున్నారు. ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లు ప్రతీ రంగాన్ని దోచుకుంటున్నారు. రూ.10 వేల కోట్ల ఎయిడెడ్ర కాలేజీల ఆస్తులను కొట్టేయడానికి ప్రయత్నించాడు. లయోలా కాలేజీ ఆస్తులను, విశాఖపట్నంలో చర్చి ఆస్తులను కొట్టేయడానికి ప్రయత్నించాడు. అవినీతి ప్రధాన ఆయుధంగా చేసుకుని వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు.

రూ.66 వేల కోట్ల ఎగుమతులు చేసే ఆక్వా రంగం కరోనా సమయంలో ఇబ్బందులు పడుతుంటే వారికి జగన్ రెడ్డి ఒక్క రూపాయి మేలు చేసే ప్రయత్నం చేయలేదు. ఆక్వా రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాధిమంది ఉపాధిపై దెబ్బకొట్టాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ ఫార్మర్లు ఫ్రీగా ఇస్తే నేడు రైతుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. ఏరియేటర్లు రూ.12 వేలకు సబ్సిడీ కింద ఇచ్చి ప్రోత్సహించాం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క శీతలగిడ్డంగి గానీ, ఒక్క సీడ్ పరిశ్రమ గానీ కట్టలేదు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క వాగ్దానమైన నెరవేర్చాడో జగన్ రెడ్డి చెప్పాలి. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ పెట్టి ఒక్క ప్రాసెసింగ్ ప్లాంటు గానీ, ఒక్క గోదాము గానీ కట్టలేదు. ఇక్కడే జగన్ రెడ్డి డొల్లతనం బయటపడుతోంది. వైసీపీ ప్రభుత్వంకు తెలిసిందల్లా ఏ రంగం బాగుంటే ఆరంగం పీకలపై కత్తిపెట్టి జే-టాక్స్ వసూలు చేసుకోవడమే. రాష్ట్రంలో ఏ వ్యాపారం బాగుంటే దానిపై పడి జే-ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. విశాఖలో రూ.40వేల కోట్ల భూములు లాక్కున్నారు. ఆక్వాలో సిండికేట్ గా ఏర్పడి రైతులకు మద్దతు ధర దక్కనీయడం లేదు. ఆక్వా ఫీడ్ ధర గతంలో కంటే 60శాతం పెరిగింది. దీనిని భరించలేక రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారు.

ఫీడ్ ప్రొడ్యూస్ చేసే వైకాపా ఎంపీ బీద మస్తాన్ రావు, మీటింగ్ పెట్టి ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నారు. మొత్తం కప్పం వసూలు చేసేది ఈ అసోసియేషనే. మీకేం సంబంధం? జగన్ ది ఐరెన్ లెగ్ ప్రభుత్వం. అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. భవిష్యత్ లో ఆక్వా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, బాపట్ల, చీరాలలో ఉద్యమిస్తాం. ప్రభుత్వమే రాయితీపై ఫీడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కైతే సబ్సీడీతో ఫీడ్ అందించాలి. యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇవ్వాలి. ఇవాళ రూ.5.50 వరకు వసూలు చేస్తున్నారు. ఆక్వా రంగానికి టీడీపీ అండగా ఉంటుంది.

LEAVE A RESPONSE