• వైసీపీ నేతలు కొట్టేసినభూముల చట్టబద్ధతకోసమే జగన్ రెడ్డి భూరక్ష, భూసర్వేపథకం భూహక్కుదారులు, హద్దుదారులు లేకుండా సర్వేలా?
• ప్రభుత్వ సర్వే తర్వాత సమస్యల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ కు వెళ్లాలనడం జగన్ సర్కారు అసమర్థతే
• పట్టాదారు పాస్ పుస్తకాలు, హద్దురాళ్లపై తనబొమ్మలు ఉండాలనడం జగన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట. బొమ్మలముద్రణపై రైతులపక్షాన న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం
– తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
అధికారంలోకి వచ్చినప్పటినుంచీ తాను, తనపరివారం కొట్టేసినభూముల్ని చట్టబద్ధం చేయడానికి, విశాఖకేంద్రంగా విజయసాయి, అతనికూతురుఅల్లుడు, బంధువులు కాజేసిన భూముల్ని వారికికట్టబెట్టడానికే జగన్ రెడ్డి భూరక్ష, భూసర్వే పథకానికి తెరలేపాడని, భూ ముల హక్కుదారులు, హద్దుదారులు లేకుండా నిర్వహించే సర్వేవల్ల ఎవరికి ఉపయోగమే ప్రభుత్వం చెప్పాలని తెలుగురైతు విభాగం రాష్ట్రఅధ్యక్షులు, టీడీపీనేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే.. “జగన్ రెడ్డి ప్రపంచంలోనే వింతపోకడలు పోతున్నాడు. రాష్ట్రంలోని విలువైన, వివాదంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్ని స్వాహాచేయడానికే భూహక్కు, భూరక్ష పేరుతో సర్వేలకు తెరలేపాడు. అలానే విశాఖలో విజయసాయిరెడ్డి, ఆయనఅల్లుడుకూతులు, బంధువులు కొట్టేసినభూముల్ని కూడా చట్టపరం చేయడం ఈ పథకం వెనకున్న ప్రధానోద్దేశం. ప్రభుత్వభూముల్ని తనతాబేదారులు, బినామీలకుకట్టబెట్టడానికే జగన్ రెడ్డి భూసర్వే నిర్వహిస్తున్నాడు తప్ప, రైతులకు మేలుచేయడానికి కాదు. భూసర్వే, భూరక్షపథకం రైతులకోసమని చెప్పడం పచ్చి అబద్ధం.
రూ.1200కోట్లు ఖర్చుచేసి మరీ జగన్ రెడ్డి చేయబోతున్న భూములసర్వేతో ప్రజలకుఒరిగేదేంలేదు. అంతఖర్చుపెట్టి, రెవెన్యూశాఖ సాయంతో ఎంతోఆర్భాటంగా ప్రభుత్వంసర్వేచేశాక, ఏవైనావివాదాలు, సమస్యలుంటే మరలా తిరిగి ఆర్బిట్రేషన్ కు వెళ్లాలని సర్కార్ చెప్పడం పెద్దవింత. భూవివాదాలు, సమస్యలను ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) ద్వారా పరిష్కరించుకోవాలన్నప్పుడు, రూ.1200కోట్ల ప్రభుత్వధనం దుర్వినియోగం చేయడం, రెవెన్యూఅధికారుల సమయాన్ని వృధాచేయడం, రైతుల్ని మరింతగా ఇబ్బందిపెట్టడం ఎందుకు? వివాదాలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నప్పుడు జగన్ రెడ్డి చేసేసర్వేలు ఎందుకోసమే ఆయనే సమాధానం చెప్పాలి.
కమీషన్లకోసమే గానీ, రైతులకోసంకాదు…
ఇలా రైతులకు మేలుచేస్తున్నామని చెప్పేబదులు, అవినీతి చేయాలంటే జగన్ నేరుగానే కమీషన్లు తినేయచ్చుకదా…! రెవెన్యూశాఖపై భారంవేస్తూ, ఇలాంటి నిరుపయోగమైన పథకాలు పెట్టడం ఎందుకు? ప్రజలకు మంచిచేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి అసమర్థ, అసంబద్ధ వ్యవహారాలముసుగులో దోపిడీకే ప్రాధాన్యతనిస్తున్నాడు. వ్యాపార వివాదాలు, సంస్థలకు సంబంధించిన సమస్యలే ఆర్బిట్రేషన్ పరిధిలో ఉంటాయి. కానీ జగన్ దిక్కుమాలిన పథకంతో ఇకపై రైతులకుసంబంధించిన భూసమస్యలు, వివాదాలు ఆర్బిట్రేషన్ పరిధిలోకివెళితే, దానివల్ల అన్నదాతలకు మేలుజరక్కపోగా మరింతగా నష్టపోతారనే విషయం ప్రభుత్వానికి తెలియదా?
భూహక్కు, హద్దుదారులు లేకుండా సర్వేలా?
మెడమీదతలకాయ ఉన్నఎవరైనా, గ్రామాల్లో ఉండేరైతులు వారికి సంబంధించిన భూహద్దులు, సమస్యలను చాలాస్పష్టంగా చెప్పగలరు. వాస్తవంగా అయితే భూహక్కు, హద్దుదారులుచెప్పిన వివరాలప్రకారం, గ్రామాల్లో ఉండే రెవెన్యూఅధికారులు సర్వేయర్ల సాయంతో సర్వేనిర్వహిస్తారు. నలుగురిసమక్షంలో, హద్దుదారుల పర్యవేక్షణలో భూములుకొలిచి, వాటివిస్తీర్ణం నిర్ణయిస్తే ఎవరికీ ఎలాంటిసమస్యఉండదు. ఏవైనా సమస్యలు న్నా రైతులు, అధికారులు చర్చించుకొని పరిష్కరించుకుంటారు. అలాకాకుండా భూహక్కు దారులులేకుండా, ప్రభుత్వం ఏకపక్షంగా అధికారబలంతో సర్వేజరిపితే, దానివల్ల రైతులకు ఎలా మేలుజరుగుతుంది? ప్రశాంతమైన సమాజంలో అలజడులు సృష్టించి, దోపిడీ దారులకుమేలు చేయడానికే జగన్ రెడ్డి భూములసర్వేలకు తెరలేపాడు. న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే, జగన్ రెడ్డి ఫోటోలపిచ్చిని కట్టడిచేస్తాం.
జగన్ రెడ్డి బొమ్మలున్న హద్దురాళ్లపై మూత్రవిసర్జన చేయడం వైసీపీ వారికి ఆనందమా?
జగన్ రెడ్డికి ఉన్న ఫోటోలు, రంగులపిచ్చి కూడా రైతులకు శాపమనే చెప్పాలి. గతంలో ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లపై జగన్ బొమ్మ ముద్రిస్తే, కోర్టు అక్షింతలు వేసింది. అయినా కూడా ప్రభుత్వం రైతులకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎలా వేస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రజల ఇళ్లల్లో, వారికి సంబంధించిన పత్రాలు, పట్టాదార్ పుస్తకాల్లో జగన్ రెడ్డి బొమ్మ ఉండాలా? ఎవరి ఆస్తిపత్రాలపై ఎవరిఫోటో ఉండాలనే ఆలోచన జగన్ రెడ్డి చేయడా? పొలాలమధ్య ఉందే హద్దురాళ్లపై కూడా తనబొమ్మ ఉండాలనడం జగన్ రెడ్డి పిచ్చికాక మరేమిటి? ఆ హద్దురాళ్లపై పొలాల్లో ఎవరేంచేస్తారో చెప్పాల్సిన పనిలేదు.
ఆఖరికి కుక్కులు కూడావాటిపై కాళ్లెత్తుతాయి. ఇంతాతెలిసి కూడా ఆయన పార్టీవాళ్లు కావాలనే జగన్ రెడ్డి బొమ్మలపై కుక్కలతో మూత్రవిసర్జన చేయిస్తున్నార నుకోవాలి. జగన్ రెడ్డి ఏడుపుగొట్టు ముఖాన్నినిత్యం చూడటానికి ప్రజలెవరూ ఇష్టపడరు. తనరంగులు,బొమ్మల పిచ్చిని జగన్ రెడ్డి మానుకోకుంటే, పట్టాదార్ పాస్ పుస్తకాలపై బొమ్మలు ముద్రించేవ్యవహారంపై న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే, జగన్ రెడ్డి పిచ్చిచర్యలను కట్టడిచేస్తాం.
రాజ్యాంగవ్యవస్థల ప్రకారం పాలనచేయలేని వ్యక్తి ప్రభుత్వనిర్వహణకు అనర్హుడు. భూరక్ష, సర్వేలపేరుతో రాష్ట్రంలోని భూముల్ని తానేఉచితంగా రైతులకు ఇస్తున్నట్లు జగన్ రెడ్డి ఫీలవుతున్నాడు. బ్రిటీష్ వారి హయాంలో కూడా జగన్ రెడ్డి చెబుతున్నంత దారుణంగా భూములసర్వే చేయలేదు. జగన్ అండ్ కంపెనీలో మొన్నఒకడు చెబుతున్నాడు… పొలానికి నాలుగుహద్దులుంటాయని! భూములకు ఎన్నికొలతలు, ఎన్ని ముఖాలుంటాయని తెలియని జగన్ బ్యాచ్ సక్రమంగా సర్వేలు చేస్తుందా?
అధికారంలోకి వచ్చినప్పటినుంచీ నిరాటంకంగా సాగించిన ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలను తలదన్నేలా భూమాఫియాను సాగించడానికే జగన్ రెడ్డి భూహక్కు, భూరక్ష అంటున్నాడు.
రాష్ట్రంలోని రైతాంగమంతా ప్రభుత్వనిర్వహించాలనుకుంటున్న భూరక్ష, భూములసర్వే పథకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. భూహక్కుదార్లు, హద్దుదార్ల సమక్షంలోనే ప్రభుత్వం సర్వేనిర్వహించేలా రైతులుపట్టుబట్టి, అధికారులతో న్యాయం జరిరిపించుకోవాలి” అని మర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.