– డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు
• చంద్రబాబుకు పటిష్టమైన భద్రత కల్పించాలంటూ లేఖ
జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ వలయంలో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు టూర్ ను భగ్నం చేయాలని వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. టూర్ లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.పర్యటనకు ఏలూరు పోలీసు సూపరింటెండెంట్, ఇతర సంబంధిత పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది.
టూర్ ను భగ్నం చేసేందుకు వైసీపీ నాయకులు కౌంటర్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. చంద్రబాబు పర్యటన మార్గంలో టిడిపి జెండాలు, పోస్టర్లు కనిపంచకుండా వైసీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపివేశారు. కావున చంద్రబాబు నాయుడు పర్యటనకు వైసీపీ మద్దతుదారులు, సంఘవిద్రోహుల నుంచి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.