-విద్యా దీవెన కాదు విద్యార్ధులకు దగా దీవెన
-ఒక్క విద్యా దీవెన పథకానికి 5 ఏళ్లల్లో రూ.100 కోట్లు
-అవినీతి పుత్రిక సాక్షికి ప్రజాధనం దోపిడి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు
టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 11 లక్షల మందికి అదీ విడతల వారీగా అందిస్తూ గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. ఏటా నాలుగు విడతలుగా ఫీజులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేస్తామని ఆర్బాటంగా ప్రకటించి మూడు విడతలు మాత్రమే విడుదల చేస్తూ నాలుగో విడత ఎగ్గొడుతున్నారు.
2021-22 4వ క్వార్టర్ నగదు ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో పరీక్షలు రాయనీయబోమని విద్యార్ధులకు తాఖీదు ఇస్తున్నారు. మోసకారి సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. పత్రికా ప్రకటన పేరుతో జగన్ రెడ్డి అవినీతి పుత్రిక సాక్షికి దోచిపెడుతున్నారు. ఒక్క విద్యా దీవెనకే ఏడాదికి రూ.20 కోట్లు చొప్పున 5 ఏళ్లకు రూ.100 కోట్లు ఒక్క సాక్షికే ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. అంతే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల సంఖ్యను తగ్గించి విద్యను దూరం చేస్తున్నారు. 2018-19లో టీడీపీ ప్రభుత్వం 3,47,567 మంది ఎస్పీ విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే 2021-21లో జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 2,15,852 మంది విద్యార్ధులకు తగ్గించి వెనకబడిన వర్గాలకు విద్యను దూరం చేశారు.
జీవో నెం.77 ద్వారా ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు విద్యాదీవెన నిలిపివేసి బడుగు బలహీన వర్గాలకు ఉన్నత చదువులను దూరం చేశారు. జగన్ రెడ్ది అనాలోచిత, అవగాహనా రాహిత్య నిర్ణయాలతో మూడున్నరేళ్ల పాలనలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి విద్యార్దుల భవిష్యత్ ని నాశనం చేశారు. టీడీపీ హయాంలో అమలు చేసిన విదేశీ విద్య, పీజీ విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పధకాలు రద్దు చేసి విద్యార్ధులకు ద్రోహం చేశారు.