-తెలంగాణ ఆఫ్ఘనిస్థాన్ అయితే ఇక్కడ షర్మిల ఎందుకు ఉంటున్నారు?
-షర్మిల చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటుంది
-షర్మిల ప్రస్థానం ఎటు వైపు?
-ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,ఎంపీ మాలోత్ కవిత
తెలంగాణ ప్రాంతంలో విష నాగులు తిరుగుతున్నాయి. షర్మిల ప్రస్థానం ఎటు వైపు…ఏ లక్ష్యంతో మీరు పాదయాత్ర చేస్తున్నారు.తెలంగాణ వ్యతిరేక భావాన్ని షర్మిల కొనసాగిస్తున్నారు. ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు షర్మిలను గౌరవించారు…కానీ ఆడబిడ్డగా షర్మిల వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయి.2004 లొనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ తండ్రి వైఎస్ కొన్నారు.
తెలంగాణ ఆఫ్ఘనిస్థాన్ అయితే ఇక్కడ షర్మిల ఎందుకు ఉంటున్నారు?పక్క రాష్ట్రం ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారు షర్మిల ఎందుకు అడగట్లేదు,ఏపీలో సమస్యలపై షర్మిల స్పందించాలి.షర్మిల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో త్వరలోనే బయటపెడతాం.
నాన్న లాగే అధికారం వస్తుందని షర్మిల పాదయాత్ర.నాటి ఆంధ్రా పాలకుల వైఖరిని తెలంగాణలో షర్మిల అనుసరిస్తున్నారు.షర్మిల చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటుంది.దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ అగ్ర స్థానంలో వుంది.విషపు కుట్రలు చేస్తూ తెలంగాణను ఆగం చేయాలని షర్మిల పాదయాత్ర.
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు తెలంగాణకు ఇప్పటి వరకు నెరవేర్చలేదు…దానిపై షర్మిల స్పందించారా?బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేంద్రాన్ని షర్మిల ఎందుకు అడగడం లేదు.రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ గురించి షర్మిళ కేంద్ర ప్రభుత్వంను ఎందుకు అడగడం లేదు?వైఎస్ జగన్,కె.వి.పి ఇద్దరు తెలంగాణ వద్దని పార్లమెంట్ లో ప్లకార్డులు పట్టుకున్నారు.తెలంగాణ అభివృద్ధి చెందడం షర్మిలకు ఇష్టం లేదు.ఇప్పుడు ఓదార్పు యాత్రలు ఏపీకి చాలా అవసరం… షర్మిల ఏపీలో ఓదార్పు యాత్ర చేయాల్సిన సమయం వచ్చింది.
తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది.మీకు లాగా దొంగ కేసులతో జైలుకు వెళ్లిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి లేదు.షర్మిల రక్తం, మాటలు,ప్రవర్తన ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చాయి.షర్మిలను అడ్డుకున్నది మహిళలే ఇది గుర్తించాలి.షర్మిల పాదయాత్రకు మేము ఎక్కడా అడ్డు చెప్పలేదు… కానీ షర్మిల వ్యక్తిగత వ్యాఖ్యలు కరక్టేనా?
తెలంగాణలో విషపు బీజాలు నాటడానికి షర్మిల ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణలో షర్మిల ఆటలు సాగవు.ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అనేక సంవత్సరాలుగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు…కానీ షర్మిల వ్యాఖ్యల వలన సెటిలర్లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.
తెలంగాణలో అధికారం కోసం షర్మిల కుట్రలు చేస్తున్నారు.తెలంగాణ సమాజం గురించి తెలుసుకుని షర్మిల వ్యవహరించాలి.పోలీసులను ఆర్.ఎస్.ఎస్.తో పోల్చారు… ఆర్.ఎస్.ఎస్.విధానం గురించి షర్మిలకు తెలుసు మాకు తెలియదు.షర్మిల టిఆర్ఎస్ పై మానసిక దాడి చేస్తున్నారు…మేము ఎలా చూస్తూ ఉండాలి.
జగన్ ముఖ్యమంత్రి అయితే మాకు ఏం సంబందం.. ఎవరి రాష్ట్రం వాళ్లదే పక్క రాష్ట్ర సిఎంగా గౌరవిస్తాం.తెలంగాణలో షర్మిల పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరు.కేసీఆర్ కుటుంబం,టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విషం చిమ్మడమే షర్మిల లక్ష్యం.బయ్యారం గనులను దోచుకున్నది షర్మిల కుటుంబం.
తెలంగాణను దోచుకోవడానికే షర్మిళ పాదయాత్ర.ఆంధ్రాలో నీ పప్పులు ఉడకట్లేదనే తెలంగాణలో షర్మిల డ్రామాలు.షర్మిల తన మాటలు అదుపులో ఉంచుకోకపోతే టిఆర్ఎస్ కార్యకర్తలను ఆపడం మా వల్ల కాదు.
తెలంగాణలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా…కేవలం వ్యక్తిగత విమర్శలతో షర్మిల దిగజారుతున్నారు.తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం హామీల గురించి షర్మిల ఎందుకు మాట్లాడట్లేదు.ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణ రాజకీయాల గురించి షర్మిల మాట్లాడటం విడ్డూరంగా వుంది.
షర్మిలకు కె.ఎ. పాల్ కన్నా తక్కువ ఓట్లు వస్తాయి.షర్మిల కుటుంబం మొత్తం తెలంగాణ వ్యతిరేక కుటుంబం.మానుకోట ఘటనలో జగన్ ను వంగపల్లి దాటనివ్వలేదు. మేము షర్మిల పట్ల సంస్కారంతోనే వున్నాము…కానీ షర్మిల మాట్లాడే పద్ధతి బాగలేదు.