తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్
పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్తున్న చంద్రబాబు గారిని పోలీసులు అడ్డుకోవడం పిరికి పంద చెర్య .. దీన్ని తీవ్రంగా కండిస్తున్న .. రాష్ట్ర ప్రజలకి ఏమి జరుగుతుందో తెలియాలి? పోలవరం పాకిస్థాన్ లో ఉందా ? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రజల తరపున పోరాడే స్వేచ్ఛ లేదా ? తక్షణం చంద్రబాబుకి ప్రాజెక్టు వద్దకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నా.
నాడు విశాఖపట్నంలో రుషికొండపై జరుగుతున్నా తవ్వకాలను చంద్రబాబు పరిశీలిస్తానంటే అడ్డుకున్నారు … నేడు మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పరిశీలిస్తానంటే అడ్డుకుంటున్నారు.. ఇవేమి చీకటి రాజకీయాలు ? అక్రమాలు జరగకపోతే భయమెందుకు ? తెలుగుదేశం ప్రభుత్వంలో 72 % పనులు పూర్తి చేశాము కాబట్టి నాడు ప్రజలకి కూడా ప్రాజెక్ట్ ఎలా సాగుతుందో చూపించాము .. నేడు వైసీపీ ఎందుకు అడ్డుకుంటుంది ? డయాఫ్రమ్ వాల్ ని నాశనం చేసింది నిజం కాదా ? 3.5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారు ? ఎంత శాతం పూర్తి చేశారు … రివర్స్ టెండరింగ్ తో సాధించిందేంటి ? నిర్వాసితులని ఇంకెన్నాళ్లు గాలికి వదిలేస్తారు ? జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో పోలవరానికి ఇదేం ఖర్మ ?