– జగన్ రెడ్డి మీ అసమర్ద పాలనలో ఇంకెంతమంది మహిళలు బలికావాలి?
– తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
రాష్ట్రంలో రోజుకో ప్రేమోన్మాది యువతుల ప్రాణం తీస్తున్నా..సీఎంకి చీమకుట్టినట్టు కూడా లేదు. జగన్ రెడ్డి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. డాక్టర్ అయ్యి పేదలకు వైద్యం అందించాలని ఎన్నో కళలు కన్న వైద్య విద్యార్దిని తపస్విని జగన్ రెడ్డి పాలనలో ఓ ఉన్మాది చేతిలో బలైంది. వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో మహిళల అఘాయిత్యాలు నితృకృత్యమయ్యాయి. మొన్న రమ్య, నిన్న తపస్విని రేపు ఎవరో? జగన్ రెడ్డి మీ అసమర్ద పాలనలో ఇంకెంతమంది మహిళలు బలికావాలి? జగన్ రెడ్డి పోలీసు వ్యవస్ధను దుర్వియోగం చేయటం వల్లే రాష్ట్రంలో పరిస్థితికి కారణం. వైసీపీ పాలనలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో ఫెయిలైనా..ప్రతిపక్షనేతల్ని కట్టడి చేయటం, అక్రమ కేసులతో వేధించటంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో మహిళలకు భద్రత, రక్షణ.