-చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు రూల్స్ వర్తించవు అన్నట్లు వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి
-చంద్రబాబు,పవన్ కల్యాణ్ లే అరాచకాలు సృష్టిస్తున్నారు
-వైయస్సార్ సిపికి ఆంధ్రప్రదేశ్ అభివృధ్ది,సంక్షేమం తప్ప మరే ప్రాధాన్యత లేదు
-రుషికొండ తవ్వకాల గురించి అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్లు చిత్రీకరిస్తున్నారు
-చంద్రబాబు అమరావతిలో జీవనవిధానాన్నే నాశనం చేశారు
-రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి.అయినా పచ్చమీడియా,చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు
-రైతులకు భరోసా ఇస్తోంది వైయస్ జగన్ విధానాలు…అందుకనే ఆత్మహత్యలు తగ్గాయి
-రాష్ట్ర ఆర్దిక పరిస్దితిని ఉపాధ్యాయులు,ఉద్యోగులు అర్దం చేసుకుని సహకరిస్తున్నారు
-వాలంటీర్లు స్వఛ్చంధ సేవకులు.ఆ వ్యవస్ధను దుర్వినియోగం చేసే ఆలోచన మాకు లేదు
రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని అందుకు వైయస్ జగన్ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలే కారణం అని ప్రభుత్వసలహాదారులు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయనను మీడియా ప్రతినిధులు కలసి మాట్లాడిన సందర్భంలో పలు అంశాలపై వారు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ ఏమన్నారంటే…..ఆయన మాటల్లోనే…..
2014 -19 మధ్య చంద్రబాబు విజయవాడ రోడ్లన్నీ ఎలా బ్లాక్ చేసారో అందరికి తెలుసు. గతంలో ప్రతిపక్షనేతగా మా నాయకుడు వైయస్ జగన్ వైజాగ్ వెళ్లబోతే రన్ వే పై ఎలా అడ్డుకున్నారో చూశారు. జేసి దివాకర్ రెడ్డి బస్ ప్రమాదం సందర్భంలో సైతం శ్రీ వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ సీన్ టిడిపి వాళ్ళు సీన్ క్రియేట్ చేశారు. మా రోజమ్మ ఎంఎల్ఏ గా అప్పటి స్పీకర్ నిర్వహిస్తున్నమహిళా సదస్సుకు హాజరుకాబోతే ఆమెను అడ్డుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ బెంజ్ సర్కిల్ లో రోడ్లన్నీ బ్లాక్ చేసి సభలు నిర్వహించారు.
అవన్నీ వదిలేస్తే ఈరోజు చంద్రబాబు ప్రతిపక్షనేతగా గ్రౌండ్స్ లో సభలు పెడుతున్నారా…. లేదే… ఎక్కడైతే ట్రాఫిక్ నిలిచి ఉంటుందో అక్కడికి వెళ్లి మాట్లాడుతున్నారు. అదేమని ఎవరైనా అడిగితే…నన్నే అడుగుతారా అని చంద్రబాబు ప్రశ్నించడమే కాదు.తాను ఏదనుకుంటే అదే రూలని అంటున్నాడు. సరే చంద్రబాబును వదిలేద్దాం…ఆయన ఆడించే ఆటబొమ్మైన పవన్ కల్యాణ్ ఇప్పడం గ్రామం వద్ద వెహికల్ టాప్ పై ఎక్కి ప్రయాణించాడు. తమకు ఎలాంటి రూల్స్ ఉండవు అనుకునే అరాచకపు బ్యాచ్ ఈరోజు వైయస్సార్ సిపి గురించి విమర్శించడం అనేది వారి వైఖరిని తెలియచేస్తోంది తప్ప ప్రజలకు అన్నీ తెలుసు.
ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాటల్లో చెప్పాలంటే ఎనీ డైరక్షన్ ఆర్ రిస్ర్టిక్షన్ లేదా బెనిఫిట్ అనేది పార్టీలకతీతంగా ఉండాలనేది లక్ష్యం. అది ఎంతగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది మా పార్టీ వారు తప్పుచేసినా…కేసులు బుక్ చేయడంలోగాని,ఇృతర అంశాలలో పోలీసు యంత్రాగం నిష్పాక్షపాతంగా పనిచేస్తున్నారనేది అందరికి తెలుసు. దానిపై టిడిపి,పచ్చమీడియా బురద చల్లేందుకు దుష్ప్రచారం చేస్తున్నారనేది స్పష్టం అవుతుంది.
భూ సర్వేతో రెవెన్యూశాఖలో సిఎం వైయస్ జగన్ సంస్కరణలు చేస్తున్నారు. ఇది ఒక బృహత్తర భాధ్యత. ఎప్పుడో జరిగి ఉండాల్సింది. దీనివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందనేది అందరూ చూస్తున్నారు. ఇంత పెద్ద యజ్ఞం జరుగుతున్నప్పుడు చిన్నచిన్నవి ఉంటాయి. ప్రభుత్వం-ఎంప్లాయిస్ రెండు వేర్వేరు కాదు. అయితే ఇంప్లిమెంట్ చేయడంలో వారికి ఉన్న ఇబ్బందులు,వత్తిడులు ఏవైనా ఉన్నా ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుంది. వాటిని పరిష్కరిస్తుంది. కాని వాటి పేరు చెప్పి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం గురించి దుష్ప్రచారం చేయడం సరికాదు. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో రీ సర్వే చేస్తూ సీఎం వైయస్ జగన్ రైతులకు మేలు చేస్తున్నారు. శ్రీ వైయస్ జగన్ గారికి ప్రజల్లోమంచి పేరు వస్తుందనే దుర్భుద్దితో వాళ్లు చేసే దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం. భూముల రీ సర్వే పై ప్రతిపక్షాలు విమర్శలు సరికావు.
వైయస్ జగన్ సైకోపాలన పోవాలి – సైకిల్ రావాలంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు సరికాదు. ఎవరు సైకో అనేది చంద్రబాబు,ఆయన కొడుకు మాటలు చూస్తే అర్ధమవుతుంది. పచ్చమీడియా చేస్తున్న వీరంగం చూస్తుంటే పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నట్లుందిగా ఉంది. చంద్రబాబే సైకోగా తయారైనట్లు కనిపిస్తుంది. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ లోనే చెప్పారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రైతులకోసం సున్నావడ్డి, పెట్టుబడి రాయితీ సహా పలు పథకాలు ఇస్తున్నారు. రైతులకు ప్రభుత్వంనుంచి రావాల్సినవి అన్నీ కూడా ప్రణాళికబద్దంగా వారికి అందచేస్తున్నారు. రైతులకు వారికి అవసరమైన సమయానికి అవి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు సంవత్సరకాలంలో ఏదైనా నష్టపోయి ఉంటే రైతుభరోసా రూపంలో వారికి పూర్తిగా వస్తుంది. ఇవన్నీ ఇంతగా ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది.
మరోవైపు చూస్తే కుటుంబానికి సంబంధించి అనేక సంక్షేమ పధకాలు కూడా వారికి అందుతున్నాయి. ఆర్దికపరమైన ఇబ్బందులు గాని,ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే దాంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్ధితులు రాష్ర్టంలో గత మూడున్నరేళ్లలో లేవు. వారికి అందాల్సినవన్నీ కూడా ఎటువంటి లంచాలు ఇవ్వకుండా వారి అకౌంట్లలోకి నేరుగా వస్తుంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి. నోరుంది కదా ,తనకు పత్రికలు ఉన్నాయ కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా చెల్లుతుంది.
ఉపాధ్యాయులకు జీతాలు అందడం లేదనే అంశంపై మాట్లాడుతూ కోవిడ్ అనంతరం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఈ విషయం ఉద్యోగులు,ఉపాధ్యాయులు అందరూ అర్ధం చేసుకున్నారు. ఉద్యోగులు సంక్షేమ పధకాలను కిందిస్దాయికి తీసుకువెళ్లడంతోనే రైతులు గాని, పేద, ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాలు ధీమాతో ఉండగలిగాయి. ఫైనాన్స్ క్రైసిస్ ఉన్నప్పటికి కోవిడ్ నేపధ్యాన్ని తీసుకుంటే గతంలో ఏ పాలకులు పరిపాలించిన సమయం కంటే కూడా రాష్ర్టం ఆర్దికంగా బాగానే ఉంది. జిడిపి మెయింటైన్ అవుతోంది. మన ప్రోడక్టవిటి,రైతుల పరిస్దితి బాగానే ఉంది. పరిస్దితి ఎలా ఉన్నా కూడా బ్యాలెన్సింగ్ చేయడం ప్రభుత్వం, వైయస్ జగన్ గొప్పదనం. తాత్కాలికంగా వచ్చే ఆర్థిక సమస్యలను సీఎం అధిగమిస్తున్నారు. ఆర్థికంగా పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు సహకరించాలి. భవిష్యత్తులో ఇదంతా సరి అవుతుంది అని అన్నారు.
ఉమ్మడి ఏపి అంశంపై తాను చేసిన వ్యాఖ్యలపై షర్మిల,కొందరు చేస్తున్న కామెంట్స్ పై వేసిన ప్రశ్నలపై మాట్లాడుతూ వైయస్ జగన్ పై ఉండవల్లి ఆరోపణలపై స్పందనగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆనాడు మాట్లాడటం జరిగింది. సమైక్యాంధ్ర కోసం ఎవరైనా నిలబడ్డారంటే అది వైయస్ జగన్ . ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో మూడు,నాలుగు లక్షలమందితో పెద్ద బహిరంగ సభ జరిపి సమైక్యాంధ్ర కోసం నిలబడ్డారు. అప్పటి ప్రభుత్వంలోని కిరణ్ కుమార్ రెడ్డి,చంద్రబాబునాయుడు,ఉద్యోగులను పాల్గొననీయకుండా చేసినా ప్రజలందర్ని కూడగట్టి వైయస్సార్ సిపి సభ నిర్వహించడం జరిగింది. అందుకే మళ్లీ చెబుతున్నా రెండు రోజుల క్రితం ఉండవల్లి విమర్శలపై తాను ఏం చెప్పానో అదే స్టాండ్ పై నిలబడి ఉన్నా. ఇది రాజకీయాలు చేయాల్సిన అంశం కాదని స్పష్టం చేశారు.
వాలంటీర్ల గురించి చేస్తున్న విమర్శలపై మాట్లాడుతూ 62 లక్షలమంది పెన్సనర్లు ఉన్నారు. సంక్షేమ పధకాలు అందుకుంటున్న వారివద్దకు వెళ్లి ఈ మాటలు అంటే అలా మాట్లాడేవారిపై పేడనీళ్ళు చల్లుతారు. శాపనార్ధాలు పెడతారు. ముఖం పగులగొడతారు. 2014-19 మధ్య పెన్సన్ కావాలంటే పోస్టాఫీసు,మండలాఫీసులు వద్దకు వెళ్లి నిరీక్షించాల్సి వచ్చేది. సభలకు హాజరైతే…. అదీ చివరివరకు కూర్చుంటే ఇస్తామని ఇబ్బంది పెట్టేవారు. మరోవైపు జన్మభూమి కమిటీలు దోచుకునేవి. తెలుగుదేశం పార్టీని చెత్తబుట్టలో వేయడానికి ఇదొక ప్రధాన కారణం.
ఆ ప్లేసులోకి వాలంటీర్లు వచ్చి 80,90 శాతం పెన్సన్లు ఒకేరోజు అందచేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడాఅర్హతలు ఉన్నవారికి ఇస్తున్నారంటే అది విజయవంతంగా చేస్తున్నది వాలంటీర్లు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వాలంటీర్ల వ్యవస్ధ ఎనౌన్స్ చేసిన రోజునే చెప్పారు. ఇది జాబ్ కాదు అని. నాయకత్వ లక్షణాలు,సేవా భావంతో పనిచేయాలనేవారికి మంచి అవకాశం అని కూడా చెప్పారు. వాలంటీర్లకు ఇస్తోంది పారితోషకం. వారు ప్రభుత్వస్కీమ్ లు బాగుంటే వాలంటీర్లు ప్రభుత్వం గురించి అబిమానం పెంచుకుంటే అది తప్పేలా అవుతుంది. వాలంటీర్లు ఉద్యోగులు కాదు. స్వఛ్ఛంధ సేవకులు. వారికందుతున్నదానితో పోల్చుకుంటే వారు పదింతలు చేస్తున్నారు. ఈ సిస్టమ్ ఇంత లిబరల్ గా అమలవుతోంది. ప్రభుత్వ పధకాలు లంచాలు లేకుండా అందచేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చాలా బాగా డోర్ డెలివరీ చేస్తున్నారు.
పార్టీ స్ట్రక్చర్ ప్రకారం వైయస్ జగన్ ఆలోచన చేస్తున్నారు.క్లస్టర్ బేస్ చేసుకుని ప్రస్తుత టెక్నాలజీ యూజ్ చేసుకుని ప్రజలకు ఏమీ అందుతున్నాయి. వారు ఏమనుకుంటున్నారు తెలుసుకునేందుకు యంత్రాంగం ఏర్పాటుచేసుకుంటున్నారు. వాలంటీర్లు మా కార్యకర్తలు అని ఇప్పటివరకు టిడిపి పచ్చమీడియా చేస్తున్న దుష్ప్రచారం అని తేలిపోయింది. అలాగే మా పార్టీ సొంత యంత్రాంగం మాకుందని తెలుస్తుంది.ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు గొప్పవైతే అదే ప్రజలకు వాలంటీర్లు చెబుతారు.
అంతేగాని చంద్రబాబు గొప్పొడని చెబుతారా ఏంటి అని ప్రశ్నించారు. ఏబై,వంద ఇళ్ళలోని లబ్దిదారులు, అవ్వాతాతలు వాలంటీర్లసేవలకు మెచ్చుకుంటే వారి బ్లెస్సింగ్స్ అందినట్లే కదా. అందుకనే వాలంటీర్లు కూడా అభిమానం చూపుతారు. వాలంటీర్లను దుర్వినియోగం చేయాలనే ఆలోచన మాకు లేదు. మా పార్టీ యంత్రాంగాన్ని అవసరమైన చోట్ల నియమించుకుంటుంది అందుకేనన్నారు. కేవిపి రామచంద్రరావు గారు కాంగ్రెస్ సిధ్దాంతాలకు అనుగుణంగా వారి ఆలోచనలమేరకు మాట్లాడి ఉంటారని బావిస్తున్నాను. మేం కూడా రాజకీయంగానే స్పందిస్తాం. ఆయన వేరే ఉద్దేశ్యంతో మాట్లాడి ఉంటారని తాము అనుకోవడం లేదన్నారు.
బిఆర్ఎస్ పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేసిఆర్ స్ధాపించిన భారత రాష్ట్ర సమితి పై మా ఒపీనియన్ మాకుంది. మీరు అడిగింది హైపోతిటికల్ క్వశ్చన్. బి ఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాలని అడిగితే ఏం చేయాలనే విషయమై అప్పుడు ఆలోచిస్తాం. దీనిపై అందరితో చర్చించి మా నాయకుడు వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటారు. మా అదినేత వైయస్ జగన్ చెబుతున్నది మొదటి నుంచి ఒక్కటే.
మాకు ఆంధ్రప్రదేశ్ ప్రధానమైంది. రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాష్ర్ట ప్రజల అవసరాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీర్చగలదు అనే విధంగా పార్టీని,కార్యకర్తలను మా సైన్యాన్ని రెడీ చేసుకుని పనిచేస్తాం. ఇదే విషయాన్ని మేం గతంలో కూడా చాలాసార్లు చెప్పాం. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన వైయస్సార్ కాంగ్రెస్ కు లేదు. రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పోటీ చేయవచ్చు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు.
వారాహి అని ఎన్నికల కోసం ట్యాంకర్ లాగా చూపించి రాజకీయాలు చేయడమో…దాని ద్వారా జిమ్మిక్కులు చేయడమో జనంకు ఏదో జరుగుతుందనో వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన దానికి సంబంధించి ఊపిరి పీల్చుకోకూడదా అని అన్నట్టు ఉన్నాడు. ఆ వాహనం రిజిస్ర్టేషన్,కలర్ కు సంబందించి వార్తలు వచ్చాయి. దీని వల్ల తాము రాజకీయాల్లోకి ప్రజాసేవకు కాదు మరేదో చూపించి ఇమేజ్ పెంచుకుందామనే ధోరణి కనబడుతోంది. జనసేన నేత దృష్టిలో రాజకీయం అనేది 65 సీన్లు ఉన్న సినిమా అనుకుంటున్నట్లుగా ఉంది. రాజకీయాలంటే ప్రజలతో మమేకమవ్వాలనే అంశం ఆయనకు తెలిసినట్లు లేదు.
వైయస్ జగన్ కు ఏపి అభివృధ్ది,సంక్షేమం మినహా వేరే ఆలోచన లేదు అని స్పష్టం చేశారు. కర్ణాటకలో,తమిళనాడులో పోటీ చేసే ఆలోచన లేదు. ఇతర రాష్ట్రాల్లో పోటీచేసే ఆలోచన ఉంటే తెలంగాణ లోనే పోటీ చేసేవారం కదా.. విభజన హామీలు తీర్చడంలో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. పోరాటం అంటే యుద్దం చేయడం కాదు..ఎలా ఒత్తిడి తేవాలో మాకు తెలుసు అని అన్నారు.
రుషికొండ విషయంలో వాటర్ మెన్ గా పిలవబడే రాజేంద్రసింగ్ విమర్శలు చేశారనే ప్రశ్నపై మాట్లాడుతూ ఆయన గతంలో అమరావతి సందర్శించి పంటలు పండే ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నట్లుగా కూడా మాట్లాడారు. నిజానికి ఇదీ నాశనం చేయడం అంటే. రాజధానిపేరుతో 33 వేల ఎకరాలను నాశనం చేశారని మాట్లాడారు. విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకోవాలనే శక్తులు టిడిపి,పచ్చమీడియా పనిగట్టుకుని ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి ఉద్యమకారులను తీసుకువచ్చి కొండను తవ్వడం తప్పుకదా అని చెబితే వాళ్లు అవును తప్పే అంటారు. దానిని తీసుకుని వీళ్లు పచ్చమీడియాలో బ్యానర్లు పెడుతుంటారు.
నిజానికి అమరావతిలో విధ్వంసం చేశారు. జీవనవిదానాన్నే దెబ్బతీశారు. పచ్చని ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. రిషికొండలో గతంలో నిర్మాణాలు లేవా…అక్కడకు వెళ్ళడానికి రోడ్డు లేదా ఉన్నాయి కదా. వాహనాలు తిరిగేవి కదా. టన్నులు , తూకాలు లెక్కపెట్టి తవ్వారా …గుట్టను పట్టుకుని విమర్శలు చేయడం బట్టి దివాలా కోరు తనం. చిన్న గుట్టకు ఏదో జరిగిందని ప్రపంచం అంతా ఏదో అయిపోయిందని ప్రచారం చేయడం ఏంటి. ఇది ఏమైనా అంతర్జాతీయ సమస్యా .హైద్రాబాద్ లో కొండల్లో రోడ్లు నిర్మించలేదా….రామానాయుడు స్టూడియో ఎక్కడుంది.
అవన్నీ కూడా చర్చించండి. రాజేంద్రనాధ్ సింగ్ ను కూడా పచ్చమీడియా తీసుకువెళ్లి చూపితే అప్పుడు కూడా అదే చెబుతారు. హైకోర్టు కు ఎవ్వరు వెళ్లి పిటీషన్ వేసినా అక్కడకు వెళ్లి చూడమంటారు…అదే రీతిలో కమిటి వేశారు. దానివల్ల ప్రభుత్వానికి నష్టం లేదు. వైజాగ్ విషయంలో ప్రజల అభిమతానికి విరుధ్దంగా చేయాలని టిడిపి,పచ్చమీడియా చూస్తున్నారు.
క్యాపిటల్ అక్కడకు మూవ్ కాకూడదనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. ఉండడానికి అనువుగా లేదు. మునిగిపోతుంది. భూకంపాలు వస్తాయి అంటూ విశాఖ సిటిని పట్టుకుని ఏదోదే మాట్లాడుతున్నారు. విశాఖకు రాజధాని రాకుండా చేసేందుకే ఉద్యమకారులతో మాట్లాడిస్తున్నారు. రుషికొండ గుట్టవల్ల ప్రపంచానికి నష్టం ఏమీ జరగదు..ప్రభుత్వం అక్కడ డెవలప్ మెంట్ చేస్తోంది.