-జగన్ రెడ్డి మతం పేరుతో క్రిస్టియన్లను మోసం చేస్తున్నారు
-టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మతం పేరుతో క్రైస్తవులను మోసం చేస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాధర్లు ఇన్నయ్య, చిన్నయ్య, శెవిరి రాజు ప్ర్యతేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం పాస్టర్లతో కలిసి టీడీపీ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సంధర్బంగా పాధర్ ఇన్నయ్య మాట్లాడుతూ…..ప్రేమ, శాంతి, కరుణ యేసు క్రీస్తు సందేశం. క్రైస్తవం అనేది మతం కాదు జీవన విధానం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న క్రీస్తు మాటలు పాటిస్తే సమాజంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావుండదని, ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.
టీడీపీ నేతలు మాట్లాడుతూ…..క్రైస్తవ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక క్రైస్తవ సంక్షేమానికి పాటుపడకపోగా క్రైస్తవ సంస్ధలు ఆస్తులు దోపిడి చేస్తున్నారు. క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా నాలుగేళ్లలో నలుగురు క్రిస్టియన్లకు కూడా ఒక లోన్ ఇవ్వని జగన్ రెడ్డి క్రిస్టియన్ ఉద్దారకుడా ? లోటు బడ్జట్ లో సైతం క్రిష్టియన్ మైనారిటీల సంక్షేమం కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.3450 కోట్ల ఖర్చు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం కోసం వై.ఎస్ కేటాయించింది కేవలం రూ.458 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి మైనారిటీల సంక్షేమం కోసం ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమౌతోంది.
దళిత క్రైస్తవులు మతం వారి ఆర్ధిక, సామాజిక స్థితిగతులలో ఎలాంటి మార్పు లేదని గుర్తించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి ఎస్సీ జాబితాలో చేర్చేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేశారు. చర్చీల మరమత్తులకు, నిర్మాణాలకు రూ.5 లక్షల ఆర్ధిక సహాయం చేశారు. ఇందుకోసం 52.34 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని జగన్ రెడ్డి నిర్ధాక్షణ్యంగా నిలిపివేశారు. గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం రెండెకరాల భూమిని కేటాయించి రూ.16 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
ఈ భవనం కరోనా సమయంలో క్వారంటైన్ సెంటర్ గా కరోనా రోగులకు వైద్యసేవలు అందించేందుకు ఉపయోగపడింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భనవ మైనర్ పనుల చేయడం కోసం రూపాయికూడా విడుదల చేయలేదు. విజయవాడ లోని సి.ఎస్.ఐ సెయింట్ బాసిలికా చర్చికి చంద్రన్న రూ.1.5 కోట్ల ఆర్ధిక సహాయం అందించారు. సేవా రంగంలో ఉన్న క్రైస్తవ సంస్థలకు రూ.10 లక్షల ఇచ్చి వారు క్రిస్టియన్లకు మరింత సేవ చేసేలా ప్రోత్సహించడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవ స్మశాన వాటికలకు భూసేకరణ చేసి రూ. 100 కోట్లు నిధులు కేటాయించి శ్మశాన వాటికలు నిర్మించాం.
క్రైస్తవ ఆడబిడ్డలకు పెళ్లి కానుగా రూ.50 వేలు అందించడం జరిగింది. క్రైస్తవుల పవిత్ర స్థలం జెరూసలేం సందర్శించాలనుకునే క్రైస్తవులకు రూ.75 వేలు ఆర్ధిక సహాయం ఇచ్చి దాదాపు 2 వేల మందిని యాత్రకు పంపడం జరిగింది. చంద్రన్న క్రిస్మస్ కానుకలో భాగంగా 6 రకాల సరుకులు గోధుమపిండి, నెయ్యి, కందిపప్పు, ఆయిల్, శెనగపప్పు, బెల్లం ఉచితంగా సరఫరా చేశాం. దీన్ని కూడా జగన్ రెడ్డి రద్దు చేశారు. జగన్ రెడ్డి మోసాలను క్రిస్టియన్లు గమనించి జగన్ రెడ్డి మోసాలకు సరైన బుద్ది చెప్పాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, క్రిస్టియన్ సెల్ కో ఆర్డినేటర్ స్వామి దాస్, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల ఇమ్మానియేల్ , ఫాథర్ ఇన్నయ్య, పాథర్ చిన్నయ్య, పాధర్ శెవిరి రాజు, పాస్టర్లు కృపానందం తదితరులు పాల్గొన్నారు.