Suryaa.co.in

Editorial

తెలంగాణలో తెలుగుదేశం రీ ఎంట్రీ తకరారు

– ఖమ్మంలో టీడీపీ సభ సూపర్‌హిట్‌తో సీన్ మారుతుందా?
– కేసీఆర్ సర్కారును విమర్శించని చంద్రబాబు ఆంతర్యమేమిటి?
– అయినా టీడీపీపై బీఆర్‌ఎస్ మూకుమ్మడి దాడి ఎందుకో?
– కేసీఆర్ ఆంధ్రాకు వెళ్లేముందు బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు లాభమా? నష్టమా?
– అవి బీఆర్‌ఎస్ జాతీయవాదంపై ప్రభావం చూపుతాయా?
– బీఆర్‌ఎస్ పేరు మార్చి చంద్రబాబుకు కేసీఆర్ మేలు చేశారా?
– టీడీపీ రీ ఎంట్రీతో బీఆర్‌ఎస్ భయపడుతోందన్న వ్యాఖ్యలు
– బీజేపీ, కాంగ్రెస్ మౌనంలో ఆంతర్యమేమిటి?
– కాసానితో తెలంగాణలో పార్టీ పరుగులు తీస్తుందా?
– ఆయన పార్టీ నుంచి వెళ్లిన వారిని పట్టుకొస్తారా?
– కాసానికి పూర్తి పగ్గాలు ఇచ్చినట్లా ? లేదా?
– ఇంతకూ టీడీపీ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకమా? అనుకూలమా?
– టీడీపీ బలపడితే లాభమెవరికి? నష్టమెవరికి?
– తెలంగాణలో టీడీపీ మళ్లీ బలపడటం అంత సులభమా?
– ఖమ్మం సభ సక్సెస్‌తో సర్వత్రా చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్రాలుగా విడిపోవాలంటూ ఉద్యమించి.. తెలంగాణ సాధించిన టీఆర్‌ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మారిన వేళా విశేషం, తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. అది ‘ఆంధ్రాపార్టీ’గా ముద్ర వేసి, ఆంధ్రాకు తానే తరిమేసిన టీడీపీకి మళ్లీ ప్రాణం పోసింది. ప్రాంతీయవాదం స్థానంలో కేసీఆర్ గళమెత్తిన
KCR-AND-Chandrababu-Naidu జాతీయవాదం.. ఇప్పుడు టీడీపీ రీఎంట్రీకి రెడ్‌కార్పెట్ వేసింది. ఫలితంగా ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన సభ సూపర్‌హిట్టయి, తెలంగాణలో మరికొన్ని సభల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. అంటే ఒకరకంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ‘పొలిటికల్ వెల్‌కమ్’ చెప్పినట్లే లెక్క. స్వయంగా బీఆర్‌ఎస్ పార్టీనే, టీడీపీపై వేసిన ‘ఆంధ్రా ముద్ర’ తన చేత్తో తానే చెరిపేసినట్లే లెక్క.

<a href=”https://ibb.co/M2Wt6cY”><img src=”https://i.ibb.co/2nmCNvD/dayakar.jpg” alt=”dayakar” border=”0″></a>
<a href=”https://ibb.co/vwd3RLQ”><img src=”https://i.ibb.co/6ntHLD1/harish.jpg” alt=”harish” border=”0″></a>

</a>
<a href=”https://ibb.co/kQByQRy”><img src=”https://i.ibb.co/syRPy0P/kavitha-1.jpg” alt=”kavitha-1″ border=”0″>

అంతా బాగానే ఉంది. మరి టీడీపీకి మళ్లీ పైకి లేచే శక్తి ఉందా? అన్ని జిల్లాలు ఖమ్మం అవుతాయా? అసలు కాసానితో తెలంగాణలో పరుగు కుదురుతుందా? ఒకవేళ ఆ పార్టీ బలపడితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? కేసీఆర్ సర్కారును బాబు పల్లెత్తుమాట అనకపోయినా, బీఆర్‌ఎస్… టీడీపీపై మూకుమ్మడి దాడి చేయడానికి కారణమేమిటి? అంటే టీడీపీ రీఎంట్రీపై అధికారపార్టీ భయపడుతోందా? టీడీపీ రీంట్రీపై బీజేపీ, కాంగ్రెస్ మౌనంలో మతలబేమిటి? బీజేపీతో చెలిమి కోసమే.. బాబు ఖమ్మంలో సభ పెట్టారన్న బీఆర్‌ఎస్ ఆరోపణల్లో నిజమెంత? ఇదీ.. ఇప్పుడు తెలంగాణ సమాజంలో హాట్‌టాపిక్.

ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మార్పు. కొన్నేళ్ల నుంచి చంద్రబాబు వైఖరి వల్ల, ఉనికి లేని టీడీపీ ఖమ్మంలో నిర్వహించిన సభకు అంచనాలకు మించి పోటెత్తిన జనం. ఈ రెండూ చూడటానికి వేర్వేరు అంశాలయినా, ఈ మార్పునకు పునాది వేసింది మాత్రం బీఆర్‌ఎస్ అనబడే టీఆర్‌ఎస్. తెలంగాణ వాదంతో ఉద్భవించి.. ఆంధ్రా పార్టీగా తానే ముద్ర వేసిన టీడీపీని, బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుని తిరిగి తెలంగాణ రాజకీయాల్లో ఆహ్వానించింది.. టీఆర్‌ఎస్సేనన్నది మనం మనుషులం అన్నంత నిజం.

ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు బీఆర్‌ఎస్ అయింది. అంటే.. తెలంగాణతో టీఆర్‌ఎస్‌కు ఏళ్లనుంచి పెనవేసుకున్న, పేగుబంధం-పేరు బంధం రెండూ ఇక తెగిపోయినట్లే. బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు రాజకీయంగా-సాంకేతికంగా పక్కనే ఉన్న ఆంధ్రా కావాలి. అటు పక్కనున్న కర్నాటక కావాలి. ఇటు పక్కన ఉన్న మహారాష్ట్ర కావాలి. దక్షిణ భారతంలోని తమిళనాడు కావాలి. వేల కిలోమీటర్ల దూరంలోని ఢిల్లీ కావాలి. మొత్తంగా జాతీయపార్టీగా దేశంలోని అన్ని రాష్ట్రాలూ కావాలి. అంటే ఇకపై ప్రాంతీయవాదం కుదరదు.

సూటిగా చెప్పాలంటే.. మునుపటి లెక్క ఆంధ్రా వాడికి ఇక్కడేం పని? తమిళోడికి ఇక్కడేం పని? మరాఠీ వాడికి ఇక్కడేం పని? కన్నడవాడికి ఇక్కడేం పని అనడం ఇక కుదరదు. అలా ప్రశ్నిస్తే.. దాని జాతీయ స్వభావానికి అర్ధం లేనట్లే లెక్క. కానీ తాజాగా బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్.. ‘పార్టీ పేరు మారినా డీఎన్‌ఏ అదే’నన్న వ్యాఖ్యను, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు.

అంటే బీఆర్‌ఎస్ డీఎన్‌ఏ.. తెలంగాణవాదమేనని స్పష్టం చేయడమేనంటున్నారు. ఒకవైపు కేసీఆర్ జాతీయవాదంతో పార్టీ పేరు మారిస్తే, మరోవైపు పేరు మారినా.. డీఎన్‌ఏ అదేనని కేటీఆర్ చెప్పడం, పార్టీ సిద్ధాంతంపై అనుమానం రేపడమేనన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.

ఖమ్మం సభ టీడీపీ అంచనాలకు మించి సక్సెస్ అయింది. చాలా కాలం తర్వాత తెలంగాణ గడ్డపై, టీడీపీ నిర్వహించిన సభ అది. తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య వంటిimage-1 పెద్దనేతలు లేకుండా సక్సెస్ అయిన సభ అది. చంద్రబాబు కూడా, చాలాకాలం తర్వాత ఖమ్మంలో కాలుపెట్టారు. టీడీపీ తెలంగాణను వీడినప్పటికీ, దాని ఉనికి అతి తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ఆంధ్రాను ఆనుకుని ఉండే ఖమ్మం జిల్లాలో, మొదటి నుంచీ ఆంధ్రా వాసనలు ఎక్కువ. పైగా కమ్మ సామాజికవర్గం బలం ఎక్కువ.

ఏ పార్టీలో అయినా నేతలు వాళ్లే. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే సీటు గెలించింది కూడా ఆ జిల్లా నుంచే. ఆ సభకు దాదాపు లక్షన్నర మంది జనం వచ్చారన్నది ఒక అంచనా. వాళ్లంతా డబ్బులిచ్చి తరలించినimage-3 వారు కాదు. ఖమ్మం టౌన్‌లో బాబు రావడం ఆలస్యమైనా, రాత్రి వేళయినా ఆయన రోడ్‌షోకు వేలమంది హాజరయ్యారు. బాబు మాటల్లో చెప్పాలంటే.. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా, అంతమంది జనం రావడం గొప్పే. అయితే అంతమంది ఎందుకొచ్చారన్నది వేరే అంశం.

సభకొచ్చిన జనాన్ని చూసి చంద్రబాబు పులకించిపోయి ఉండాలి. బాబుకు జనం వీక్‌నెస్ ఎక్కువ. ఎక్కువమంది ఉంటే సమయాభావం అసలు పాటించరు. ఖమ్మంలోనూ అదే కనిపించింది. టీడీపీ నుంచిimage వెళ్లిన తమ్ముళ్లను, తిరిగి రమ్మని పిలుపునిచ్చారు. అంటే ఘర్‌వాపసీకి బాబు అధికారికంగానే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నమాట. మరి దానికి ఎంతమంది తమ్ముళ్లు స్పందిస్తారన్నది కాలం నిర్ణయించాలి.

బాబు తన ప్రసంగంలో కేసీఆర్‌ను గానీ, ఆయన ప్రభుత్వాన్ని గానీ పల్లెత్తు మాట అనలేదు. కించిత్తు విమర్శ చేయలేదు. బీఆర్‌ఎస్‌నే కాదు, అసలు ఏ పార్టీ జోలికి వెళ్లలేదు. ఎంతసేపూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఏకరవు పెట్టేందుకే పరిమితం అయ్యారు. నిజానికి బాబు వైఖరి తమ్ముళ్లను ఆశ్చర్యపరిచింది. ఫలితంగా తాము ఇకపై, బీఆర్‌ఎస్‌ను విమర్శించాలా? వద్దా? అన్న సందేహాన్ని బాబు ప్రసంగం మిగిల్చింది.

కానీ చంద్రబాబు వ్యూహం లేకుండా ఏమీ చేయరు. అసలు ముందు చాలా ఏళ్ల తర్వాత, రీఎంట్రీ ఇచ్చిన తన పార్టీ క్షేత్రస్థాయి బలమేమిటో పరీక్షించాలి. ఈలోగా పార్టీ నుంచి వెళ్లిన తమ్ముళ్లు, ఎంతమంది తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో అంచనా వేయాలి. అసలు ఖమ్మం సభ రియాక్షన్ ఎలా ఉందో, ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలి.

ముఖ్యంగా పార్టీకి ఎక్కువ సానుభూతిపరులున్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డితోపాటు.. నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో.. ప్రజల పల్సు ఎలా ఉందో పట్టుకోవాలి. వీటికిమించి.. తెలంగాణలో ఇతర పార్టీల్లో సర్దుకునిపోతున్న కమ్మ వర్గం నాయకులు, దాదాపు పాతిక నియోజకవర్గాలపై పైన సంఖ్యాబలం ఉన్న కమ్మవర్గం, గుండెచప్పుడేమిటో తెలుసుకోవాలి. ఇన్ని చేస్తూనే భవిష్యత్తులో తనతో ఏ పార్టీ పొత్తుకు ముందుకు వస్తుందో అంచనా వేయాలి.

ఇవన్నీ తేల్చుకోకుండా, తన వాస్తవ బలంపై ఒక అంచనాకు రాకుండా.. కేవలం ఖమ్మం సభ సక్సెస్ చూసి, బలమైన బీఆర్‌ఎస్‌ను విమర్శించడానికి బాబు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన స్టూడెంట్ కాదు. బహుశా ఆ కారణంతోనే ఆయన.. బీఆర్‌ఎస్‌పై తొందరపడి విమర్శలకు దిగకుండా, వాటికి దూరంగా ఉండవచ్చన్నది, రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

పైగా తెలంగాణ టీడీపీ పగ్గాలిచ్చిన కాసాని జ్ఞానేశ్వర్, పెద్ద జనాకర్షక నేత కాదు. కొన్ని దశాబ్దాల పాటు, కాంగ్రెస్‌లో మాజీ మంత్రి రామిరెడ్డి చాటు నాయకుడాయన. పసుపు కండువా కప్పేసుకునే ముందు.. బీజేపీలో చేరాలనుకున్న కాసానితో, హరీష్‌రావు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఊహించని విధంగా కాసాని, బాబుతో కండువా కప్పించుకున్నారు.

కాసాని టీడీపీ పగ్గాలందుకోకముందు వరకూ, కేవలం ముదిరాజ్ కులనేత మాత్రమే. తెలంగాణలోని బీసీ వర్గంలో, ముదిరాజులదే ఎక్కువ జనాభా. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు వరకూ, ఆ వర్గంలో ఆయనే మొనగాడు. కాసాని పిలుపే ఒక ప్రభంజనంలా ఉండేది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజ్ నేతలంతా, ఆ పార్టీ వైపు మళ్లారు.

అప్పుడు ఈటల రాజేందర్ ముదిరాజ్ పెద్దదిక్కు. ఇప్పుడు ఈటల బీజేపీలో చేరడంతో, ముదిరాజులు ఆయన వైపే ఉన్నారు. కాబట్టి కాసాని మునుపటి మాదిరిగా.. ముదిరాజ్ కులంలో వన్‌మ్యాన్ షో చేయడం కుదరదు. స్వతహాగా కాసాని వ్యూహకర్త కాదు. రియల్ ఎస్టేట్‌లో దిట్ట. అది పార్టీని నడిపించేందుకు ఆర్ధికంగా అక్కరకొస్తుందే తప్ప, రాజకీయాల్లో ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు సరిపోదు.

సరే. ఇంతకూ తెలంగాణలో టీడీపీ పంథా ఏమిటన్నది, కాసానికి చంద్రబాబు చెప్పారా లేదా? కేసీఆర్ సర్కారును విమర్శించమని చెప్పారా? లేదా? పార్టీ పగ్గాలిచ్చిన బాబు, మరి ఆయన సొంత ఆలోచనలకు స్వేచ్ఛ ఇస్తారా? లేదా? అసలు పార్టీని పరుగులు తీయించేంత శక్తి ఆయనకుందా? లేదా? పార్టీ నుంచి వెళ్లిపోయిన సీనియర్లను తిరిగి తీసుకువచ్చేంత స్థాయి కాసానికి ఉందా? లేదా? అన్నదే ప్రశ్న. ఏదేమైనా కాసాని స్థాయిలో, అధ్యక్ష పదవి ఇచ్చేంత నేతలెవరూ తెలంగాణ టీడీపీలో లేరన్నది మాత్రం నిర్వివాదం.

అసలు ఖమ్మం సభలో బీఆర్‌ఎస్‌ను పల్లెత్తుమాట అనని చంద్రబాబుపై.. బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు వరస వెంట వ రస ఎందుకు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారన్నదే ఆశ్చర్యం. కేసీఆర్, ఆయన కుటుంబాన్ని రోజూ చాకిరేవు పెడుతున్న షర్మిల విమర్శలు పట్టించుకోవడం లేదు. మరి అసలు కేసీఆర్‌ను పల్లెత్తుమాట అనని బాబునే, మంత్రులు లక్ష్యంగా ఎంచుకున్నారంటే.. బాబును చూసి, బీఆర్‌ఎస్ అప్పడే భయపడిపోతుందన్న సంకేతాలివ్వడమేనన్నది రాజకీయవర్గాల వ్యాఖ్య.

హరీష్, కవిత మొదలుకొని.. ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాసగౌడ్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వరకూ వరస పెట్టి బాబుపై విమర్శలు సంధించారు. చంద్రబాబు కుట్రలు తెలంగాణలో సాగవని, టీడీపీనిBRS ప్రజలు నమ్మరన్నది వారి ప్రధాన విమర్శ. తెలంగాణను నాశనం చేసిన చంద్రబాబు, బీజేపీతో పొత్తు కోసమే ఖమ్మంలో సభ పెట్టారన్నది హరీష్ రావు వాదన.

అందులో నిజమే ఉండవచ్చు. కానీ సభ పెట్టుకునే హక్కు , పార్టీని విస్తరించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. దానికే ఇంత కంగారు ఎందుకన్నది రాజకీయవర్గాల ప్రశ్న. బీఆర్‌ఎస్ విమర్శలు ఇలాగే కొనసాగితే, ఆ పార్టీ టీడీపీ రీ ఎంట్రీని చూసి.. భయపడుతోందన్న అనుమానాలను, నిజం చేసినట్టవుతుందని బీఆర్‌ఎస్ సీనియర్ల వ్యాఖ్య.

ఒకవైపు కేసీఆర్ ఆంధ్రాలో బీఆర్‌ఎస్ సభలకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఖమ్మంలో టీడీపీ సభను అదే పార్టీ నేతలు విమర్శిస్తున్న ప్రభావం, కేసీఆర్ ఆంధ్రా పర్యటనలపై పడదా? అక్కడ శాఖ పెట్టాలన్న కేసీఆర్ ప్రయత్నాలకు విఘాతం కాదా అన్నది మరో ప్రశ్న.

‘గత ఎన్నికల ముందు ‘ఆంధ్రా పార్టీకి ఇక్కడేం పని’ అని విమర్శించిన కేసీఆర్‌కు.. ఇప్పుడు ఆంధ్రాలో ఏం పని’ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తాజాగా నిలదీశారు. మరి బీఆర్‌ఎస్ నేతల వైఖరి ఇలాగే సాగితే.. ఆంధ్రా పార్టీలు కూడా కేసీఆర్ అక్కడకు వెళ్లినప్పుడు, అలాంటి ప్రశ్నల వర్షమే కురిపిస్తే, బీఆర్‌ఎస్ ఉనికి ఏమిటి?జాతీయపార్టీకి సాంకేతికంగా ఆ పార్టీకి కావలసిన ఓట్ల సంగతేమిటన్నది ప్రశ్న.

LEAVE A RESPONSE