ఎగ్జిబిషన్లు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి: మంత్రి ఎర్రబెల్లి

-మరింత మనసు పెట్టి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి: మంత్రి సత్యవతి
-ఎంపీ కవిత ప్రశ్నకు ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో మార్మోగిన సైన్స్ ఫెయిర్ ప్రాంగణం
-దయాకర్ రావు మా మానుకోట నేత అయ్యి ఉంటే బాగుండు: ఎంపీ కవిత

(తొర్రూరు, జనవరి 09); ఎగ్జిబిషన్లు పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో నేడు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత హాజరయ్యారు.

అక్కడి ప్రదర్శనలు చూసి పిల్లలను, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మాట్లాడారు. తొర్రూర్ పట్టణంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ప్రోత్సహించే విధంగా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని మంత్రి దయాకర్ రావు అభినందించారు. 130 ప్రదర్శనలు గొప్పగా ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ విద్యార్థులకు మంచి విద్యనందిస్తూ రాష్ట్రంలో ఈ స్కూల్ మొదటి స్థానంలోకి రావాలన్నారు.

సీఎం కేసీఆర్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మధ్య తరగతి, పేద పిల్లలను మంచిగా తీర్చి దిద్దుతున్నారు అని నమ్మి ఇక్కడికి ఇంత మంది విద్యార్థులను తల్లిదండ్రులు పంపిస్తున్నారు అని…ఇంకా మనసు పెట్టీ పిల్లల బంగారు భవిష్యత్ తీర్చిదిద్దాలని అన్నారు.ఎక్కువ సమయం మీతోనే గడిపే విద్యార్థులకు తల్లిదండ్రులు, గురువులు అన్నీ మీరే అయ్యి పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలన్నారు.

ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని విద్యార్థులకు చూపెడుతూ ఒక ప్రశ్న అడుగుతా చెప్తారా? ఈ సార్ పేరు తెలుసా? చెప్పండి? అని అడగడంతో…విద్యార్థులు అంతా ఒకేసారిMIN-DAYA1 ఎర్రబెల్లి దయాకర్ రావు అనడంతో ప్రాంగణం మార్మోగింది. ఈ ప్రాంత ప్రజల అదృష్టం వల్ల దయాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రి అయ్యి సస్య శ్యామలం చేశారన్నారు.

అనంతరం ఇంత మంచి మంత్రి మీకు ఉన్నారని, పాలకుర్తి నియోజక వర్గం అభివృద్ది చూస్తే ఈ దయాకర్ రావు మా మానుకోటకు వస్తె బాగుండు అనిపించింది.ఇక్కడి విద్యార్థులు బాగా చదువుకుని చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, గొప్పవాళ్ళు కావాలి అని ఆకాంక్షించారు.

Leave a Reply