– చంద్రబాబు నాయుడు
పవిత్రమైన తిరుమల కొండను ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. టీటీడీ అతిథి గృహాల్లో అద్దె రేట్లను భారీగా పెంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీ అతిథి గృహాల్లో భారీగా అద్దెల పెంపుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండను భక్తులకు దూరం చేయాలనుకుంటున్నారా అని ధ్వజమెత్తారు. పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయని నిలదీశారు.సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారని మండిపడ్డారు.అద్దెలు 1100 శాతం పెంచడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. కలియుగ దైవం విషయంలో అహంకారం వద్దని..భక్తుల మనోభావాలు గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు.