– పిచ్చివాడు కాబట్టే దళిత పథకాలురద్దుచేసి, దళితరాజధానిని, అంబేద్కర్ స్మృతివనాన్ని నాశనం చేశాడు.
– సబ్ ప్లానే లేని రాష్ట్రం దాని అమల్లో టాప్ లో ఉందా?
• దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తానన్న జగన్, ముఖ్యమంత్రి కాగానే దళితులపై కత్తివేటు వేశాడు.
• టీడీపీప్రభుత్వం 4లక్షల మంది దళితయువతకు ఉపాధి కల్పించింది.
• నాలుగేళ్లలో జగన్ రెడ్డి నలుగురికైనా ఉపాధి కల్పించాడా?
• సబ్ ప్లానే అమల్లో లేకుంటే, సబ్ ప్లాన్ అమల్లో ఏపీ టాప్ లో ఉందా?
• భూమికొనుగోలు పథకం కింద చంద్రబాబు దళితులకిచ్చిన 12 వేలఎకరాలను, జగన్ ఇళ్లస్థలాల పేరుతో లాక్కున్నాడు.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
జగన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన పాపానికి దళితులకు రాష్ట్రంలో నిర్బంధాలు, బేడీలు, అవమానా లు, వేధింపులే మిగిలాయని, అధికారంలోకి వస్తే దళితసంక్షేమానికి పెద్దపీట వేస్తానన్న జగన్ రెడ్డి, కత్తివేటు వేశాడని, నూటికి వెయ్యిశాతం జగన్ రెడ్డి దళితద్రోహేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే … “వైసీపీప్రభుత్వాన్ని దళితులు నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే బేడీలు, అడ్డుకుంటే అవమా నాలు, వేధింపులు. జగన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన దళితులకు వంచన, మోసమే మిగిలాయి. దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానన్న జగన్, అధికారం దక్కగానే వారిపై కత్తివేటు వేశాడు.
టీడీపీప్రభుత్వం 4లక్షల మంది దళితయువతకు ఉపాధి కల్పించింది… జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో నలుగురికైనా కల్పించాడా?
టీడీపీప్రభుత్వం 4లక్షల మంది దళితయువతకు రుణాలిచ్చి, ఎస్సీకార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పించింది. వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే, ప్రభుత్వంలోని దళితమంత్రు లు, వైసీపీఎమ్మెల్యేలు రికార్డులు పరిశీలించుకోవచ్చు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. ఈ నాలుగేళ్లలో నలుగురు దళితులకు రూపాయి రుణమిచ్చి, ఉపాధి కల్పించాడా? టీడీపీ ప్రభుత్వంలో దళితులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, విదేశీవిద్య, అంబేద్కర్ స్టడీసర్కిళ్లు, విద్యోన్నతి, భూమికొనుగోలు పథకం లాంటి ఎన్నో గొప్పపథకాలు అమలయ్యాయి. భూమికొనుగోలు పథకం కింద చంద్రబాబు దళితులకు 12వేల ఎకరాల భూమిస్తే, జగన్ రెడ్డి రాగానే ఇళ్లస్థలాలపేరుతో దాన్ని వెనక్కులాక్కున్నాడు. దళితుల భూమి లాక్కోకపోతే, ప్రభుత్వం సొంతడబ్బుతో భూమికొని ఇళ్లస్థలాలకు ఇవ్వకూడదా?
సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించకూడదని చట్టం చెబుతున్నా, జగన్ రెడ్డి కావాలనే దళితసొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు
దళితసంక్షేమానికి కేటాయించిన నిధుల్ని ఇతరత్రా పనులకు మళ్లించకూడదని చట్టం చెబుతున్నా, జగన్ అండ్ కో నిస్సిగ్గుగా ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని నూటికి నూరుశాతం పక్కదారి పట్టిస్తున్నారు. 1986లో తెలుగుదేశం ప్రభుత్వం దళితనిధులు పక్కదారి పట్టించకూడదని చట్టం చేసింది. 2013లో అప్పటి న్యాయస్థానం కూడా అదే విషయాన్ని స్పష్టంచేసింది. 2014లో చంద్రబాబురాగానే, సబ్ ప్లాన్ నిధుల్ని నూటికి 99శాతం దళితుల సంక్షేమానికే వినియోగించారు. ఆనాడు సాంఘికసంక్షేమ శాఖ మంత్రిగా ఉన్ననేను, టీడీపీప్రభుత్వ దళిత సంక్షేమం అమలుపై ఎంతో సంతోషించాను. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దళితనిధుల్ని దారిమళ్లించడం, ఇతరత్రా అవసరా లకు వినియోగించడం ఎక్కువైంది. దళితులంటే ముఖ్యమంత్రికి చిన్నచూపు ఉండ బట్టే, ఇలా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో సబ్ ప్లానే అమల్లో లేకపోతే, సాటిలేని ఉపకారం-దేశంలో సబ్ ప్లాన్ అమల్లో ఏపీ టాప్ అని తప్పుడురాతలు రాస్తున్నారు. అమల్లో లేని సబ్ ప్లాన్ పూర్తిగా నాశనం చేయడంలో ఈప్రభుత్వం టాప్ లో ఉంది.
దళితులకోసం ప్రత్యేకంగా ఒక్కపథకం అమలు చేశారా?
రాష్ట్రాల సదస్సులో ఏపీలో ఎస్సీల అభివృద్ధికి రూ.9,225కోట్లు ఖర్చుపెట్టారని కేంద్ర మంత్రి చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు. రేషన్ బియ్యం, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, అమ్మఒడి కింద చేసేసాయం దళితులకోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్నారా? సాధార ణంగా అన్నివర్గాలకు అమలయ్యే పథకాల్లో దళితులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు తప్ప, ప్రత్యేకంగా దళితులకోసం జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఒక్క పథకమైనా అమలుచేస్తుందా? వైసీపీప్రభుత్వం దళితులకు ఏంచేసిందయ్యా అంటే సమాధానం చెప్పకుండా దాడులు చేస్తారు. దళితయువతను చంపడం, తప్పుడు కేసులతో వేధించడం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో దళితులపై దాడిజరగని రోజు ఉందా? అమరావతి దళితరైతులపై ఎస్సీఎస్టీ కేసులుపెట్టి, బేడీలేసి జైలుకు తీసుకెళ్లారు.
దళితరాజధానిని, అంబేద్కర్ స్మృతివనాన్ని నాశనంచేసి, విజయవాడలో విగ్రహం పెడితే సరిపోతుందా?
దళిత నియోజకవర్గాల మధ్యఉన్న రాజధాని అమరావతిని సర్వనాశనం చేసి, దళితుల నోట్లో మట్టికొట్టారు. రాజధానిలో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం చేపట్టిన టీడీపీప్రభుత్వం రూ.157కోట్లు కేటాయించి, 26శాతంపనులు పూర్తిచేస్తే, జగన్ దాన్ని రద్దుచేశాడు. అక్కడి పనులన్నీ ఆపేయించి, దానికోసం కేటాయించిన నిధుల్ని దుర్వినియోగం చేశాడు. దళితరాజధాని అమరావతితోపాటు, అంబేద్కర్ స్మృతివ నాన్ని సర్వనాశనం చేశాడు. రాజధానిలో స్మృతివనం లేకుండా చేసి, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టేదేంటి? విజయవాడలోనే ఎందుకు.. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టండి.. దళితులు కాదన్నారా? ఉత్తుత్తి విగ్రహాలు కాదు కావా ల్సింది.. అంబేద్కర్ స్మృతివనంలో ఆ మహానీయుడి జీవితవిశేషాలతో కూడిన గ్యాలరీ, లైబ్రరీ ఉండేలా టీడీపీప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. దాని నిర్మాణం కొనసాగించి, టీడీపీ అనుకున్నదానికంటే ఎక్కువ చేసి చూపించండి. జగన్ కు పిచ్చి బట్టే, అమరావతిని, అంబేద్కర్ స్మృతివనాన్ని విధ్వంసం చేశాడు. విగ్రహాలపేరుతో దళితుల్ని ఏమార్చకుం డా, నాశనం చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని జగన్ రెడ్డి తక్షణమే పూర్తిచేయాలి.
సబ్ ప్లాన్ యాక్ట్ ను పదేళ్లు పొడిగించి, అమలుకు ప్రత్యేకచట్టం చేయాలి
సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వస్తుంది.. కచ్చితంగా సబ్ ప్లాన్ అమలు చేస్తుం ది. సబ్ ప్లాన్ యాక్ట్ గడువు ఈనెల 24తో ముగుస్తుంది. మరోపదేళ్లు యాక్ట్ ను పొడిగించి, దాని అమలుకు ప్రత్యేకచట్టం చేయాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీప్రభుత్వం తక్షణమే దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వాలి. దళితులకు నూటికి వెయ్యిశాతం ద్రోహం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఆయన భజన చేస్తూ, దళితజాతికి ద్రోహం చేస్తున్న మంత్రులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజాస్వామ్యా న్ని పరిరక్షించుకోవడం ప్రజల బాధ్యత. ప్రజాస్వామ్య పరిరక్షణార్థం చేపట్టిన లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే, ప్రభుత్వం ఏం చవిచూడాలో అదే చూస్తుంది” అని విలేకరు లు అడిగినప్రశ్నకు సమాధానంగా ఆనంద్ బాబు సమాధానమిచ్చారు.