-ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం యొక్క విధానం స్పష్టం చెయ్యాలి
-ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి షెడ్యూల్ ప్రకటించాలి
-ఉద్యోగుల సమస్యల పై సియస్ గారికి 3 రోజులలో లేఖ ఇస్తాం..బొప్పరాజు
-సియస్ కి లేఖ ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే కలిసొచ్చే సంఘాలతో సంప్రదించి ఫిబ్రవరి 26 తేదీన రాష్ట్ర కార్యవర్గం లో ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ప్రకటిస్తాం ….బొప్పరాజు వెంకటేశ్వర్లు
-మహాసభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న యన్.చంధ్రశేఖర్ రెడ్ఢి మాట్లాడుతూ ఉద్యోగుల ఆవేదనను,సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తాననిహామి ఇచ్చారు
ఏపీ జేఏసీ అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కర్నూలులో నిర్వహించిన మహాసభకు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి విచ్చేసి సభ విజయవంతం చేసిన వివిధ సంఘాల రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నాయకులకు మరియు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగులు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మహాసభ ప్రారంభంలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకున్న తదుపరి ఎన్నికల అధికారి కే భావన ఋషి మరియు సహాయ ఎన్నికల అధికారి కె.వి.కృష్ణారావు ఎపి జెఏసి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. చైర్మన్ గా బొప్పరాజు వేంకటేశ్వర్లు మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఎపి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ (ఆర్టీసి)నుండి పలిశెట్టి దామోదరరావుగారు తొలిసారిగా సెక్రెటరీ జనరల్ గా ఎన్నికైనారు. మొత్తం 21 మందితో ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ప్రకటించి వారికి సర్టిఫికెట్స్ అందచేశారు.
వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన 94 ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్న సభలో నాయకులు వక్తలు ప్రధానంగా ఉద్యోగులు దాసుకున్న డబ్బులు అవసరానికి చెల్లించక పోవడం , జీతాల సకాలం చెల్లించకపోవడం PRC పూర్తిగా అమలుపరచకపోవడం, DA లు చెల్లించకపోవడం మరియు సాక్షాత్తు సిఎం గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం తదితర అంశాలపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. జెఎసి అమరావతి రాష్ట్ర నాయకత్వం వెంట నడుస్తామని ఉద్యమకార్యచరణకు ప్రకటించాలని కోరారు.
చైర్మన్ బొప్పరాజు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఉద్యోగుల కోర్కెలు గొంతమ్మకోర్కెలు కాదని గత మూడున్నర సంవత్సరాల నుండి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదన్నారు. ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర చెల్లింపులు మరియు సమస్యలపై అనేకసార్లు ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో మొరపెట్టుకున్న కనీస ప్రతిస్పందన కనిపించడం లేదని, ఆర్థిక చెల్లింపుల విషయంలో ఉద్యోగుల పరిస్థితి మరీ హీనంగా ఉందని ఆయా దాచుకున్న సొమ్ములు బిల్లులు కూడా పెండింగ్ పెట్టడం వలన పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం సమయానికి ఆరోగ్య సంబంధమైన విషయాలను కూడా పక్కన పెట్టడం, తద్వారా ప్రాణాపాయలు సంభవిస్తున్నాయి.
ఆయా సమస్యలపై ఈరోజు వివిధ సంఘాల నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారము మరి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉద్యమానికి వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయని అయినా సమన్వయం పాటిస్తూ ఈరోజు చేసిన తీర్మానాలు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు, సిపిఎస్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్,ఆర్టీసి ఉద్యోగుల సమస్యలపై మరొకసారి ప్రభుత్వానికి విన్నవించి అప్పటికి ప్రభుత్వము స్పందించని పక్షంలో ఈనెల 26వ తేదీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని కలిసొచ్చే ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణకు పిలుపుని ఇవ్వాలని నిర్ణయించడమైనది అని తెలియజేశారు.
సమావేశంలో ఇంతవరకు సెక్రటరీ జనరల్ వై.వీ.రావు నివేదిక సమర్పిస్తూ ఈ మూడు సంవత్సరాల్లో ఏపిజెఏసి అమరావతి తరఫున నిర్వహించిన కార్యక్రమాలు సాధించిన విజయాలు, గత సంవత్సరం. ఉవ్వెత్తున చేపట్టిన ఉద్యమ కార్యాచరణలు గురించి వివరించి ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడంలేదని ఉద్యోగ సంఘాల నాయకులకు సరియైన విధానంలో వ్యవహరించడం లేదని రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలలో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉందని, ఒకటవ తారీకు జీతాలు రాకపోతే ఏమవుతుందని సాక్షాత్తు మంత్రివర్యులే ప్రశ్నించడం పై చాలా ఆవేదనతో ఉన్నారని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సామరస్య ధోరణితో వ్యవహరించాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదని తెలియజేశారు.
సమావేశంలో నూతనంగా ఏపిజెఏసి అమరావతి 3 వ రాష్ట్ర మహాసభద్వారా సెక్రటరీ జనరల్ గా ఎన్నికైన పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత వారికి పాత సర్వీస్ రూల్స్ అమలుచేయకుండా కొత్త సర్వీస్ రూల్స్ పేరుతో ప్రమోషన్లలో నష్టం కలిగిస్తున్నారన్నారు. ఇంకా 2096 మంది ఆర్టీసి ఉద్యోగులకు కొత్త పి.ఆర్.సి అమలు జరపలేదని, ఓవర్ టైమ్ & అలవెన్సులు,లీవ్ ఎన్ క్యాస్ మెంట్ చెల్లించాలని,పాతపద్దతిలోనే రిఫరల్ ఆసుపత్రులద్వారా వైద్యసౌకర్యాలు అందించాలని,ఇ.హెచ్ ద్వారాసరైనావైద్యం అందడంలేదని తెలిపారు.అలాగే ప్రభుత్వం వద్ద పెండింగున్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రభుత్వసలహాదారులు యన్. చంధ్రశేఖర్ రెడ్డి కి విజ్ఞప్తిచేసారు.
మహాసభలో ఏపి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోషియేషన్ అధ్యక్షులు,జెఏసి సీనియర్ నాయకులు అల్ ఫ్రెడ్ గారు ప్రారంభ ఉపన్యాసంతో సభ్యులను ఉత్తేజ పరుస్తూ వృద్ధులకు సహాయం చేయాలి గాని మమ్మల్ని హింస పెట్టకూడదని రిటైర్ అయిన ఉద్యోగులకు ఇంకను బెనిఫిట్స్ చెల్లించకపోవడం చాలా బాధాకరమైన తెలియజేశారు. సమావేశంలో CPS అంశం పై ఎ.పి.సి.పి ఎస్. రాష్ట్రప్రధానకార్యదర్శి పార్థసారది,కంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎ.పి.కాంట్రాక్టు&ఔట్ సోర్శింగు రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.సుమన్, భానోజీ, మహిళా ఉద్యోగుల సమస్యలు, చైల్డుకేర్ /మెటర్నరటీ లీవులు తదితరసమస్యలపై ఏపిజెఏసిఅమరావతి మహిళానాయకురాలు జి.జ్యోతి, డ్రైవర్లు మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు, క్లాస్-4 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.మల్లేశ్వరరావు మాట్లాడారు.
అలాగే యూనివర్శిటీ ఉద్యోగులకు,పభ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్సు ఉద్యోగులకు రిటైట్ మెంటు వయోపరిమితి 62 సంఃలకు పెంచాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై.వెంకటప్పారెడ్డి, ఏ.పి.గ్రామవార్డు,సచివాలయ ఉద్యోగుల సమస్యపై ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.ఆర్లయ్య,జ్యోతి,టైపిస్టు&స్టెనోల సమస్యల పరిష్కరించాలని ఆ అసోషియేన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.సి.శంకర్ మాట్లాడారు. అంతేకాకుండా టీచర్లు/భాషోపాధ్యయ ఉద్యోగులు మరియు స్కూల్ అసిస్టెంట్సు సంఘాలఫై ఆ రాష్ట్ర నాయకులు ఓంకార్ యాదవ్, శివానందరెడ్డి,ఏ.పి.టెక్నికల్ ఆఫీసర్సు సమస్యలు పరిష్కరించాలని ఆ అసోషియేషన్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ,వర్కుచార్టెడ్ ఉద్యోగులకు డిజిగ్నేషన్ మార్పు, 010 పద్దు క్రింద ప్రభుత్వం జీతాలు చెల్లించాలని ఆఅసోషియేషన్ రాష్ట్రనాయకులు డి.జి.ప్రసాధరావు,నాలుగు వేలు రూపాయలు లోపు పెన్సన్ పొందుతున్న మాజీ గ్రామాధికారులు (మున్సభ్ కరణాలు)రిటైర్డు ఆర్టీసి ఉద్యోగులకు రేషన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేయాలని ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర నాయకులు ఈర్ల శ్రీరామూర్తి విజ్ఞప్తి చేశారు.
ఏపిలో దివ్యాంగుల ఉద్యోగులకు కేంధ్రప్రభుత్వం రూపొందించిన RPWD Act -2016 అమలుచేయాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు,మెడికిల్ &హెల్త్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏ. పి గవర్నమెంట్ డాక్టర్స్ అసోషియేషన్ రాష్ట్ర నాయకులు తోపాటు ఏపిజెఏసి అమరావతి అనుబందసంఘాలు అయిన 94 సంఘాలు నాయకులు ఆయా డిపార్టుమెంటు ఉద్యోగులుసమస్యలను పరిష్కరించేలా కృషిచేయాలని కానీ పక్షంలో ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. మహాసభలో ఏపి జెఏసి అమరావతి లో మరో ఆరుసంఘాలు చేరాయి,ఈసంఘాలు చేరికతో 100 సంఘాలు అయ్యాయని వారుతెలిపారు.మహాసభ నిర్వహణలో పూర్తి భాద్యతలు తీసుకొని విజయవంతం చేసిన కర్నూలు జిల్లా ఏపిజెఎసి అమరావతి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జి.గిరికుమార్ రెడ్డి, కృష్టలను రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన నాయకులు వారిని అభినందించారు. సభలో తీసుకున్న నిర్ణయంమేరకుమేదావులైన ఏడుగురు సభ్యులతో సలహాధారులను ఏర్పాటు చేసినట్లు బొప్పరాజు తెలిపారు. సమావేశంలో ఏపిజెఏసి అమరావతి కి నూతన ఎంపిక చేసిన రాష్ట్ర కార్యవర్గాన్ని మరియు 26 జిల్లాల నూతన అధ్యక్ష,కార్యదర్నులు మహాసభకు బొప్పరాజు పరిచయం చేశారు.