-రాజధానిపై మంత్రులు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
– యనమల రామకృష్ణుడు
వైసీపీ ప్రభుత్వానికి వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం లేదు. పార్లమెంటుపై గానీ, రాజ్యాంగంపై గానీ విలువ లేదు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మూడు రాజధానులు బిల్లు తీసుకొచ్చింది. ఇది విభజన చట్టానికి పూర్తి వ్యతిరేకం. విభజన చట్టంలో ఒకే రాజధాని అని చాలా స్పష్టంగా పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర రాజధానిపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి ఒకే రాజధాని, అది విశాఖపట్నం అంటున్నారు. మరో మంత్రి మూడు రాజధానులు అంటారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి పదేపదే తప్పులు చేస్తూ పోతున్నారు. మంత్రులు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర అప్పులపై, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని రెండు సార్లు పిలిచినా వైసీపీ నుంచి ఎటుంవంటి స్పందన లేదు. బడ్జట్ లో చూపిన అప్పులు కంటే ఎక్కువగా ఎందుకు అప్పులు చేశారో ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పగలదా? బడ్జటేతర అప్పుల గురించి అధికారులు ఎందుకు మాట్లాడటం లేదు. కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు ప్రభుత్వం వాడుకుంటున్నప్పుడు ఆ అప్పులు మాకు సంబంధం లేదని ఎలా చెబుతారు? బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన రూ.8300 కోట్లకు ప్రభుత్వ ఆదాయంను ఎందుకు ఎస్క్రో చేశారు? ఎఫ్.ఆర్.బి.ఎం చట్టానికి సవరణ చేసి 90 శాతం ఉన్న లిమిట్ ఉన్న గ్యారెంటీలను 180 శాతంకు ఎందుకు పెంచారు? ఈ నాలుగేళ్లలో ఎన్నికోట్లు వేస్ అండ్ మీన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఎన్ని రోజులకు ఓడీకి వెళ్లారు, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్సు ద్వారా ఎంత తీసుకున్నారో సి.ఎం.ఓ చెప్పగలదా?
రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డిఫెసిట్ విఫరీతంగా పెరిగిపోయాయి. 2014 లో రాష్ట్రానికి ఇబ్బందులు లేకపోవని ప్రభుత్వ అధికారులు మాట్లాడటం విడ్డూరం. విభజన నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 2.62 శాతంగా ఉంది. దాన్ని 2018-19 నాటికి 1.61 శాతంకు టిడిపి తగ్గించింది. అది ఇప్పుడు 3.60 కు పెరిగింది. 2018 లో రూ.16 వేల కోట్లు ఉన్న రెవెన్యూ లోటు నేడు రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగింది? 2018 నాటికి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ రూ.2.5 లక్షల కోట్లు ఉంటే ఈ మూడేళ్లలో అవి. 4.42 లక్షల కోట్లకు ఎందుకు పెరిగాయి? ఇది రెండింతలు పెరగలేదా? 2018-19 లో 27.59 ఉన్న స్థూల ఆదాయంలో అప్పుల శాతం నేడు 39.43 శాతంకు ఎందుకు పెరిగింది?