Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు, కష్టాలే!

-వైయ‌స్ జగన్ అధికారం చేపట్టాక సమృద్ధిగా వానలు
-కుప్పంలో గెలవలేని పరిస్థితి చంద్రబాబుది
-అన్న ఎవరో.. దున్న ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు
-మాజీ మంత్రి కన్నబాబు

చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు, కష్టాలే అని.. దరిద్రానికి డెఫినిషన్‌ చంద్రబాబు అని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు విమ‌ర్శించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని మండిప‌డ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రవాసాంధ్రులని ఎద్దేవా చేశారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తేల్చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక అజెండా లేకుండా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. చంద్రబాబు తాను లేస్తే మనిషిని కాదంటాడు.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటాడు.
మాజీ సర్పంచ్ చేత క్లాస్‌ పీకించుకున్నాడు. ఇంత కంటే దరిద్రం ఉంటుందా బాబూ… చంద్రబాబు అంటే దరిద్రమని ప్రజలే చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే వానలు పడవు. వైయ‌స్ జగన్ అధికారం చేపట్టాక సమృద్ధిగా వానలు కురుస్తున్నాయ‌ని, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయ‌ని చెప్పారు.

కుప్పంలో గెలవలేని పరిస్థితి చంద్రబాబుదని విమ‌ర్శించారు. ఇది కాదా దరిద్రం. చంద్రబాబు హయాంలో ఒక్క మంచైనా జరిగిందా..?. బాబు హయాం నుంచి చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు కన్నబాబు. బాబు పాలనలో కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి అని క‌న్న‌బాబు గుర్తు చేశారు. చంద్రబాబు తనను మించిన మహానటుడు చంద్రబాబు అని స్వయానా ఎన్టీఆరే అన్నారని, చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని కన్నబాబు పేర్కొన్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్‌ అని, సీఎం వైయ‌స్‌ జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్‌ ఉందా? అని ఎమ్మెల్యే కన్నబాబు ప్రశ్నించారు. ‘అన్న ఎవరో.. దున్న ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. పాదయాత్రలో లోకేష్‌ భాష, బాడీలాంగ్వేజ్‌ అసభ్యకరంగా ఉంది. ఓర్వలేనితనంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

లోకేష్‌ తన భాషను అదుపులో పెట్టుకుంటే మంచిదని కన్నబాబు సూచించారు. పాదయాత్రలో లోకేష్ భాష అసభ్యకరంగా ఉంద‌న్నారు. లోకేష్ బూతులు నేర్చుకుని రోడ్డెక్కాడు. దున్నలు, ఆంబోతులు ఉన్నది టీడీపీలోనే..అయ్యన్నపాత్రుడు స్పృహ ఉండి మాట్లాడుతున్నాడా..?. లోకేష్, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడి భాషకు ఎల్లో మీడియా ఏమని సమాధానం చెబుతుందా అని ప్ర‌శ్నించారు. టీడీపీ నేతలు భాష, బాడీ లాంగ్వేజ్ విచిత్రంగా ఉంద‌న్నారు. లోకేష్ ఒళ్లు బలుపుతో మాట్లాడుతున్నాడని దుయ్య‌బ‌ట్టారు. ఓర్వలేని తనంతో లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్ 10వ తరగతి పరీక్షలు రాయిద్దాం..

ఆయన పాస్ అవుతాడా..? ఆంధ్రప్రదేశ్‌లో సున్నా ఎక్కడా పెట్టాలో కూడా లోకేష్‌కు తెలియడం లేద‌ని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో నటించడం సీఎం వైయ‌స్ జగన్‌కు చేతకాదన్నారు. జనం గుండె చప్పుడు విని వైయ‌స్ జగన్ గారు పాలన చేస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో ఎన్ని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో లోకేష్ చెప్పాలని నిలదీశారు. మ‌హానేత వైయ‌స్ఆర్ విగ్రహాన్ని టచ్‌ చేయండి..ఎలా ఉంటుందో చూస్తార‌ని కన్నబాబు హెచ్చ‌రించారు.

LEAVE A RESPONSE