– కర్నూలు జిల్లాలో ఖాళీ భూములు కన్పిస్తే కబ్జా చేయటం తప్ప ప్రజలకు నువ్వు చేసిందేంటి?
– లోకేశ్ పై మాట తూలితే తాటతీస్తాం
– టీడీపీ శాసన మండలి సభ్యులు బీ.టీ నాయుడు
మంత్రి గుమ్మనూరు జయరాం నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే ప్రజలే గుడ్డలూడదీసి కొడతారు. మంత్రి అన్న సంగతి మరచి బజారు రౌడీలా మాట్లాడుతావా? ఆ భాష ఏంటి? పందికి ప్యాంటు షర్ట్ వేస్తే అది నీ కంటే అందంగా ఉంటుంది, అయినా నిన్ను పందితో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయేమో. కర్నూలు జిల్లాలో ఖాళీ భూములు కన్పిస్తే కబ్జా చేయటం తప్ప మంత్రిగా నాలుగేళ్ల నుంచి ప్రజలకు నువ్వు చేసిందేంటి?
ఒక్క రోజులోనే 180 ఎకరాలు ఎలా రిజిస్ట్రేషన్ ఎలా చేశావ్ ? నీకు అంత డబ్బు ఎక్కడిది? మీ తాత ఏమైనా మైసూర్ మహారాజా? 180 ఎకరాలు కొనుగోలుకు సంబందించి ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మీ భార్యకు నోటీసులు ఎందుకు జారీ చేశారో సమాధానం చెప్పు? ఆలూరుతో పాటు కర్నూలు జిల్లాలో నువ్వు కబ్జా చేసిన భూములు సర్వే నెం.లతో సహా త్వరలో బయటపెడతాం, ప్రజల చేత గుడ్డలూడదీసి కొట్టిస్తాం.
ఆలూరులో పేకాట, గుండాట వంటి జూద శిభిరాలు నిర్వహించి ప్రజల్ని దోపిడి చేసే నువ్వు లోకేశ్ ని విమర్శిస్తావా? పేకాట శిబిరం నిర్వహిస్తూ నీ తమ్ముడు గుమ్మనూరు నారాయణ గతేడాది పోలీసులకు పట్టుబడలేదా? నీ కొడుకు బెంజ్ కారు ఎలా కొన్నాడు? గంజి తాగే స్ధాయి నుంచి బెంజి కారు కొనే స్ధాయికి ఎలా ఎదిగావో ప్రజలకు తెలియదా? కమీషన్లు తీసుకుని కార్లు కొంటున్నావ్, ఖాళీ భూములు కబ్జాలు చేసి రిజిష్ట్రేషన్ చేయిస్తున్నావ్.
ఓ వైపు ప్రజలను సొమ్ము దోచేస్తూ మరో వైపు పట్ట పగలు పూటుగా మద్యం తాగి ప్రతిపక్షనేతల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతావా? మా నాయకుడు నారా లోకేశ్ పై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోం, నీ తాట తీస్తాం. గుమ్మనూరు జయరాంకి గుండు గొట్టి ఊరేగించేందుకు ఆలూరు ప్రజలు సిద్దంగా ఉన్నారు.