ఉద్యోగులకు జీతాలు లేవు, కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వని రాష్ట్రాల్లో ఎలా పెట్టుబడులు పెడతారు?
-నాయకుల కంపెనీ లేమో పక్క రాష్ట్రాల్లో ఉంటే పెట్టుబడి దారులు నమ్మి పెట్టుబడి పెడతారా?
– ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్
విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఎందరో మహానుభావులు స్థాపించిన ఎన్నో సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తుంటే ఒక్కరు కూడా ఆంద్రప్రదేశ్ కి తమ కంపెనీ చిరునామా మార్చటానికి ఇష్టపడకపోవటానికి కారణం మనము పట్టించుకోవటం లేదా ఇంకా ఏమైనా ఇబ్బందులు పెట్టడం వల్ల రావటానికి భయపడుతున్నారా అన్న అంశం మీద విస్తృత స్థాయిలో రాష్ట్రము లో చర్చ జరగాలి అన్నారు.
ఉద్యోగాలు ఉపాధి లేక తీవ్ర వలసలతో సతమతమవుతున్న రాష్ట్రానికి పారిశ్రామిక విధానం ప్రాణవాయులాంటిది అలాంటి పారిశ్రామిక విధానం ఉన్నతంగా ఉన్నదా లేక కక్ష్య తో నిండిన రాజకీయ వ్యవస్థ పారిశ్రామిక విధానాన్ని చంపేసినదా అన్న అనుమానం రావటం లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము
పారిశ్రామిక సదస్సులు పెడుతున్నాము కంపెనీలను పిలుస్తున్నాము అని చెప్పే మీరు మీ మీ కుటుంబ అలాగే నాయకుల అలాగే అనుబంధ కంపెనీ అడ్రస్ లు ఎందుకు హైదరాబాద్ లో నే ఉన్నాయి?
మీ పాన్ కార్డు మీ కంపెనీలు హైదరాబాద్ లో ఉంటే, మీరేమో పెట్టుబడి దారులను ఆహ్వానిస్తున్నాము లాంటి మాటలు ఎవరి చెవులో పువ్వులు పెట్టడానికి అన్న సందేహం రావటం లేదా?ఆంధ్రప్రదేశ్ మూలాలున్న దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఆయా కంపెనీల అడ్రెసుని ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు మార్చటానికి ఇష్టపడటం లేదు అన్న చర్చ జరగలిసిన అవసరం లేదా ?
అధికార ప్రతిపక్ష నాయకుల కంపెనీ ల అడ్రెసులు ఆంధ్రప్రదేశ్ కి మార్చటానికి ఇష్టపడక పోవటానికి మీకే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి నమ్మకం లేకపోవటం కారణం కదా!
ఆంధ్రప్రదేశ్ మీద తీవ్ర ప్రభావం చూపించిన అంశాలు
ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారుతాయి అలాగే కక్ష తో నిండిన రాజకీయ వ్యవస్థ పారిశ్రామిక వేత్తలను కులం పార్టీల కోణం లో చూడటం మొదలు పెట్టడం ముఖ్య కారణం అనుకోవచ్చు. గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు తిరగ దోడటం ముఖ్యంగా మూడురాజధానుల విధానం అప్పటి వరకు అమరావతి లో పెట్టుబడి పెట్టిన లాంటి సంస్థలు తీవ్ర నష్టపోవటం రైతుల ఒప్పందాలను తుంగలో తొక్కటం లాంటి చర్యలు,అలాగే రివర్స్ టెండరింగ్ లాంటి విధానాలు,ఎంపీ లు రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలను బయపెట్టడాలు,అమర్ రాజా లాంటి సంస్థలను మూసేయమని ఆదేశించటం లాంటి కక్ష్యపూరిత నిర్ణయాలు రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడి దారుల నమ్మకాన్ని బాగా దెబ్బతీశాయనుకోవచ్చు.
సుమారు 2.4 లక్షల కోట్ల బడ్జెట్ లో కనీసం 2080 కోట్లు కూడా నిధులు కేటాయించని రాష్ట్రానికి ఏమిచూసి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు? ఏమి రాయితీలు ప్రభుత్వం ఇవ్వగలదు అలాగే ప్రకటించిన రాయితీలు ఏ విధంగా నెరవేర్చగలదు అన్న అనుమానం పెట్టుబడి దారులకు రాదా? మితిమీరిన ముఠా గొడవలు చూసి ఎవరైనా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టె సాహసం చేస్తారా? రాష్ట్రము లో DGP నే కోర్ట్ కి హాజరు అవ్వమని కోర్ట్ లు మాటలాడాలిసిన పరిస్థితులంటే అలాగే IAS లకు జైలు శిక్ష కోర్ట్ విధించిందంటే అలాంటి రాష్ట్రము లో (Violation to Rule of Law) రాష్ట్రము లో చట్టబద్ధ పాలన జరుగుతున్నదా అలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తారా? ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టర్లకు దీర్ఘకాలిక బిల్లుల పెండింగ్. అలాగే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఆర్థిక దివాళా పరిస్థితులున్న రాష్ట్రానికి పెట్టుబడి దారులు ఏ నమ్మకంతో పెట్టుబడి పెడుతారు అని ప్రభుత్వాలు ఆలోచించాలిసిన అవసరం లేదా?
Goverment E Marketing(GEM) లాంటి కేంద్ర ప్రభుత్వ సమస్త ఆంధ్రప్రదేశ్ ని చిన్న చిన్న బిల్లులు కూడా చెల్లించటం లేదని బ్లాక్ లో పెట్టిన పరిస్థితుల్లో ఏ దైర్యంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతారు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విధానాలను సమీక్షించుకుని పారిశ్రామిక విధానాన్ని రూపొందించటం అలాగే ముందుగా అధికార ప్రతిపక్షాల నాయకులు ముందు మీ కంపెనీ అడ్రెసులు ఆంధ్రప్రదేశ్ కి మార్చాలి. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న పారిశ్రామిక వేత్తలకు అవసరమైన రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం, ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానంలో మార్పులు ఉండవు. అలాగే పెట్టుబడి దారుడు ఎప్పుడు పెట్టుబడి దారుడేగాని అతనికి కులం మతం ప్రాంతంతో సంబంధం లేదు అన్న విధంగా పారిశ్రామిక విధానం తీసుకొని వస్తే రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. ముఠా గొడవలతో రాజకీయ వ్యవస్థ ఉంటె ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు లేకుండా చేసిన వాళ్లుగా చరిత్రలో మిగిలిపోతారని ఫోరమ్ సభ్యులు మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఫోరమ్ సెక్రెటరీ బొప్పన రాజశేఖరరావు సహాయ సెక్రెటరీ పావులూరి ఖాజారావు అలాగే నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం అలాగే నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొనడం జరిగింది