Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ప్రజల బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ

-అలాంటి గడ్డకు ఆపరేషన్ చేయాలి
-జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలందరూ బాధితులే
-జగన్ రెడ్డి అభిమన్యుడు కాదు, అర్జునుడు కాదు, భస్మాసురుడు
-ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే చేతులుపెట్టారు
-అన్నా క్యాంటీన్లు తీసేసిన వ్యక్తి పేదల ప్రతినిధా?
-వైకాపా ప్రభుత్వాన్ని దించేందుకు 5 కోట్ల మందీ స్టార్ క్యాంపెయినర్సే
-నెల్లూరు రూరల్ లో నిర్వహించిన “రా.. కదలిరా బహిరంగ సభ”లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

ఐదేళ్లలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది
వైకాపా పాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఐదేళ్లలో అందరూ బాధితులే. ప్రజలిచ్చిన అధికారాన్ని జగన్ రెడ్డి దుర్వినియోగం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? జగన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ బాధితులే. గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయాలు విరమించుకునే పరిస్థితి. మాచర్ల నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు భరించలేక దుర్గారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రానికి నేనేం చేశానని అడుగుతున్ను. జగన్ రెడ్డి పుట్టకముందే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను.

ఆ విషయాన్ని ఎవరిని అడిగినా చెబుతారు. నేను వేసిన ఫౌండేషన్ పైనే అందరూ పాలించారు. ప్రజల జీవితాల్లో మేం మార్పు తీసుకువచ్చాం. నాకు మద్దతుగా 80 దేశాల్లో నివసిస్తున్నవారు ముక్తకంఠంతో చెప్పారు. విభజన తర్వాత అమరావతి, పోలవరం పూర్తికి కృషిచేశాం. అనేక పరిశ్రమలు తీసుకువచ్చాం. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిశ్రమలను తరిమేశారు. జగన్ రెడ్డి పాలనలో నేను కూడా బాధితుడినే.

రాష్ట్రాన్ని నెం.1 స్థానంలో నిలబెట్టే బాధ్యత టీడీపీది
ఈ రాష్ట్రాన్ని, తెలుగువారిని ప్రపంచంలో నెం.1 స్థానంలో నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం. పేదవారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్ కూడా పేదవారి గురించి ఆలోచించారు. మీ అందరి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నేడు ఎక్కడ చూసినా విధ్వంసం, తుగ్లక్ విధానాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అందుకే “రా కదలి రా” అని పిలుపునిచ్చాం. పిల్లల భవిష్యత్ కోసం, 5 కోట్ల ప్రజల కోసమే ఈ పిలుపునిచ్చాం. నాకోసం కాదు. జగన్ రెడ్డి ‘సిద్ధం’ అని మీటింగ్ పెట్టారు. మీరు సిద్ధమంటే టికెట్లిచ్చిన వైకాపా నేతలందరూ పారిపోతున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైకాపా నాయకులకు కూడా “రా కదలి రా” అని పిలుపునిస్తున్నాం. వారికి బాధ్యత గుర్తుచేస్తున్నా.

జగన్ రెడ్డి పాలనలో చితికిపోయిన రైతులు
ఏ వర్గం ఆనందంగా లేదు. రైతులందరూ చితికిపోయారు. ధాన్యం కొనే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోళ్లలో కూడా కమీషన్లు. ఆక్వా రంగం కుదేలైంది. ఆక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. లక్షా 50వేల రుణమాఫీ చేశాం. ఒకేసారి 50వేల మాఫీ చేసిన చరిత్ర టీడీపీది. జగన్ రెడ్డి రైతు భరోసా పేరుతోఇచ్చేది ఏడాదికి రూ.7,500 మాత్రమే. ఐదేళ్లలో రూ.37,500 మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వాకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తాం

జగన్ రెడ్డిది భస్మాసుర హస్తం
జగన్ రెడ్డి అభిమన్యుడు కాదు.. అర్జునుడు కాదు.. భస్మాసురిడివి. ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే చేతులు పెట్టారు. జగన్ రెడ్డి చాలా పేదవాడంట? అన్నా క్యాంటీన్లు తీసేసిన వ్యక్తి పేదవారి ప్రతినిధా? చంద్రన్న కానుకలు, విదేశీ విద్య, రైతుల సబ్సీడీలు తీసేసిన వ్యక్తి జగన్ రెడ్డి. తనకు ఇల్లే లేదంటున్నారు. తాడేపల్లి, బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్, రుషికొండలో రూ.500 కోట్ల ప్యాలెస్ లు కట్టుకోలేదా? జగన్ రెడ్డికి ప్యాలెస్ ఉంటే తప్ప పేదవారు గుర్తుకురారు. ఏటా జాబ్ కేలండర్, డీఎస్సీ అని హామీ ఇచ్చి మాట తప్పారు. వాలంటీర్లు, ఫిష్ మార్కెట్లో ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నారు. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం ఏపీ. టీడీపీ-జనసేన పాలనలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. డీఎస్సీ పెడతాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇంటింటికి మరుగుదొడ్లు, ఎల్ ఈడీ బల్బులు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం. నేడు గ్రామాల్లో అంధకారం నెలకొంది. సర్పంచ్ ల అధికారాలకు కోతపెట్టారు. మేం సర్పంచ్ లకు గౌరవమిస్తాం. సొంత బ్రాండ్లతో మద్యం తయారుచేసి ప్రజల రక్తం తాగుతున్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మద్యపాన నిషేధం ఏమైంది? 99 శాతం హామీల అమలు అంటూ అబద్ధాలు చెబుతున్నారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. దిశ చట్టమే లేకుండా గొప్పలు చెప్పుకుంటున్నారు.

జగన్ రెడ్డి ప్రజల బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ
బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. టీడీపీ హయాంలో వారి ఆర్థికాభివృద్దికి కృషిచేశాం. జగన్ రెడ్డి ప్రజల బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ. అలాంటి గడ్డకు ఆపరేషన్ చేయాలి. ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరిచేస్తారు. రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ ఇస్తారు. అక్రమాలను ప్రశ్నించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై వేధింపులకు పాల్పడ్డారు. పెట్రోల్ రేట్లు దేశంలోనే అధికంగా ఉన్నాయి. ఆటో నడిపే వ్యక్తి ఏడాదికి రూ.24వేలు పెట్రోల్ కోసం అదనంగా ఖర్చు చేసే పరిస్థితి. పది వేలు రిపేరు ఛార్జీలు. ఫైన్ ల పేరుతో వారిని వేధిస్తున్నారు. ఒక్కో ఆటో కార్మికుడిపై అదనంగా రూ.50వేలు భారం వేసి రూ.10వేలు ఇస్తున్నారు. పది లక్ష్మల మంది ఉంటే 2.60 లక్షల మందికే ఇస్తున్నారు. దోచింది రూ.5వేలు, ఇచ్చింది రూ.260. గ్రీన్ ట్యాక్స్ పేరుతో దోచుకుంటున్నారు. ఇదంతా దోపిడీ కాదా? రవాణ రంగం కుదేలైంది. టీడీపీ పాలనలో క్లీనర్ లారీ ఓనరైతే.. జగన్ రెడ్డి పాలనలో ఓనరు క్లీనరయ్యాడు.

పట్టాదారు పాసు పుస్తకంపైనా జగన్ రెడ్డి బొమ్మ
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. పెండింగ్ బిల్లులతో పేదవారిని వంచిస్తున్నారు. మేం మహాప్రస్థానం పెడితే.. నేడు ద్విచక్ర వాహనాలపై మృతదేహాలను తరలించే పరిస్థితి. కాన్పుల కోసం డోలు కట్టుకుని వెళ్లే పరిస్థితి. టిడ్కో ఇళ్లను పూర్తిచేయకుండా వంచించారు. పట్టాదారు పాసు పుస్తకంపైనా జగన్ రెడ్డి బొమ్మ వేసుకుంటున్నారు. సర్వే రాళ్లపైనా వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. దేవుడు కూడా కాపాడలేరు. అందుకే స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. జగన్ రెడ్డి పాలనలో బాధితులందరూ స్టార్ క్యాంపెయినర్సే. ఐదు కోట్ల ప్రజలు స్టార్ క్యాంపెయినర్స్ గా మారి జగన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉంది.

అనిల్ కుమార్ యాదవ్ అవినీతిపరుడు. కావలికి పట్టిన చెద ఒకతను ఉన్నాడు. అన్నింటికీ కమీషనే. నల్లపురెడ్డి కనిపించిన ప్రతిదాంట్లో దోచుకుంటున్నాడు. గోవా నుంచి, పాండిచ్చేరి నుంచి మద్యం తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆత్మకూరులో పేరుకే విక్రమ్. మైనింగ్ డీల్స్ చేస్తున్నారు. నన్ను, పవన్ ను తిట్టలేదని కందుకూరు అతనికి టికెట్ లేదంటున్నాడు. బూతులు తిట్టేవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. ఎంత ఎక్కువ బూతులు తిడితే అంత పెద్ద టికెట్. ఇలాంటి వారు రాజకీయాలకు అనర్హులు.

LEAVE A RESPONSE