నెల్లూరు రూరల్ వైసీపీ కి భారీ షాక్

– టీడీపీ లో చేరిన గొల్లకందుకూరు గ్రామ వైసీపీ నేతలు

నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు గ్రామం మేజర్ పంచాయతీ. ఈ గ్రామంలో సీనియర్ నాయకులుగా గతంలో సర్పంచ్ గా, ఎంపీటీసీ గా పనిచేసిన పొనకా కుటుంబం. పొనకా శివకుమార్ రెడ్డి మరియు పొనకా హరిప్రసాద్ రెడ్డి నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారిని చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసారు. చంద్రబాబు నాయుడు గారు వారికి తెలుగుదేశం కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారివెంట పొనకా రాజేంద్రప్రసాద్ రెడ్డి, పెన్నా వెంకు రెడ్డి, తాటిపర్తి పుల్లయ్య వారు కూడా పార్టీలో చేరారు.

గొల్లకందుకూరులో పొనకా కుటుంబం టీడీపీ లో చేరిక మండలంలో చర్చనీయాంశం అయ్యింది. ఇది వైసీపీ కి తీవ్రమైన ఎదురు దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అతి త్వరలో మరికొందరు వైసీపీ లో బలమైన నేతలుగా ఉన్న కొందరు టీడీపీ లో చేరేదానికి నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో మంతనాలు చేసినట్లు మండలంలో పెద్దఎత్తున ప్రచారం సాగుతుంది.

Leave a Reply