Suryaa.co.in

Telangana

క్రీడల్లో దేశం సత్తా చాటాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

– కిసీ సే కమ్ నహీ అన్నట్లు బాలికలు బాగా ఆడారు
– క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది
– ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ క్రీడా పోటీల ముగింపు సదస్సులో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
౼ రాజకీయం, అంటే తిట్లు, శాపనార్థాలు కాదు.. యువతలో ఆరోగ్యకరమైన క్రీడాస్ఫూర్తిని నింపే దిశగా కిషన్ రెడ్డి క్రీడాపోటీలు నిర్వహించారు : జయప్రకాశ్ నారాయణ
౼ మోడీ ప్రేరణ, కిషన్ రెడ్డి సంకల్పంతోనే తెలంగాణలో 7 వేల మంది క్రీడాకారులకు అవకాశం : మురళీధర్ రావు

హైదరాబాద్: క్రీడాకారులు క్రీడల్లో సత్తా చాటాలని, ఎంచుకున్న క్రీడలో ప్రతిభ చాటి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ పేరుతో సికింద్రాబాద్ పార్లమెంట్పరిధిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అమ్మాయిలు కిసీ సే కమ్ నహీ అన్నట్లుగా అద్భుతంగా ఆడారని ఆయన అభినందించారు. జింఖానా గ్రౌండ్లో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ‘‘భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక విజన్తో క్రీడలకు సంబంధించి దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పోటీలు నిర్వహించాలని చెప్పారు. వారు ప్రధాని అయిన తర్వాత ఒలింపిక్స్ సహా ఇతర అంతర్జాతీయ పోటీల్లో మన దేశ క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మనం ప్రపంచంలో అనేక అంశాల్లో నెంబర్ వన్గా ఉన్నప్పటికీ క్రీడల్లో కొంత వెనకబడి ఉండే వాళ్లం. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు మంచి ప్రతిభ సాధించారు. తెలంగాణలో కూడా ప్రభుత్వంతోపాటు వ్యక్తులు, సంస్థలు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. గత 7 రోజులుగా దాదాపు 7 వేల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వారికి ముఖ్యంగా, అమ్మాయిలు, బాలికలను ప్రధాని మోడీ, నా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒలింపిక్స్ను గుర్తు చేసేలా క్రీడాకారులు వారి ప్రదర్శన చూపారు. ఇదే స్ఫూర్తితో క్రీడాకారులు భవిష్యత్లో చివరి వరకు పోరాడాలి. క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది”అని అన్నారు.

లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ..
‘‘మంత్రి కిషన్ రెడ్డిని మనసారా అభినందిస్తున్నాను. రాజకీయం, ప్రజా జీవితం అంటే తిట్లు, శాపనార్థాలు కాకుండా.. యువతలో ఆరోగ్యకర పోటీ పెంచి క్రీడాస్ఫూర్తిని నింపేందకు అద్భుతమైన క్రీడాపోటీలు నిర్వహించారు. ఆడపిల్లలు ఖోఖో అద్భుతంగా ఆడారు. అది చూసి నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినయ్. ఖోఖో, కబడ్డి లాంటి టీమ్ స్పిరిట్ ఆటలు పెట్టినందుకు కిషన్ రెడ్డికి అభినందనలు”అని అన్నారు.

బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మురళీధర్ రావు మాట్లాడుతూ..
‘‘అటల్ బిహారి వాజ్ పెయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం సంతోషకరం. దేశంలో అనేక మంది ప్రధాన మంత్రులను మనం చూశాం. కానీ అందరు ప్రధానమంత్రులకు భిన్నంగా దేశ ప్రజల అభిమానాలు చూరగొన్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. ఆసియా గేమ్స్, క్రికెట్, ఒలింపిక్స్లో ఎక్కడైనా ఓ ఆట జరుగుతుందంటే.. గెలిచినా, ఓడినా.. మీకు నేను అండగా ఉన్నాను అని దేశ ప్రధాని మోడీ ధైర్యం చెబుతారు. ఏదైనా ఆటలో ఓడిపోతే.. ఆ టీమ్ క్యాప్టన్కు ప్రధాని మోడీ నుంచి ఫోన్కాల్ వస్తుంది. ఓటమి విజయానికి తొలి మెట్టు.. బాధపడొద్దని చెప్పే ఏకైక ప్రధాని మన నరేంద్ర మోడీ. పరీక్షల్లో విద్యార్థుల భయం పోగొట్టేందుకు కృషి చేస్తున్న ప్రధాని కూడా మోడీ ఒక్కరే. మోడీ ప్రేరణతో, కిషన్ రెడ్డి సంకల్పంతోనే తెలంగాణలో 7 వేల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు”అని అన్నారు. ఈ కార్యక్రంమలో బీజేపీ సీనియర్ నాయకులు, పలు సంస్థల ప్రతినిధులు, జాతీయ స్థాయి క్రీడా అవార్డుల గ్రహీతలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE