Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ ఎండ్రి కాయల పార్టీ

-ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారు
-6 గ్యారంటీ ల్లోని 13 హామీలను కాంగ్రెస్ మరో ఇరవై రోజుల్లో నెరవేర్చాలి
-కోమటి రెడ్డి సంతకం పెట్టిన సీఎం ను నిలదీయాలి
-మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు

మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది. కార్యకర్తలు మంచి సూచనలు చేశారు. పార్టీ కి ద్రోహం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయి. సంస్థాగత బలోపేతం పై సూచనలు వచ్చాయి. గతం లో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ముందుకు సాగుదాం. కష్టపడ్డ వారికే పార్టీ లో గుర్తింపు ఇస్తాం.

ఉద్యమ కారులకు పార్టీ లో సముచిత స్థానం ఇస్తాం. త్వరలోనే కమిటీలు వేసుకుని అసెంబ్లీ నియోజక వర్గాలలో సమావేశాలు నిర్వహిస్తాo. కాంగ్రెస్ ఎన్నికల్లో గోబెల్స్ ను మించి దుష్ప్రచారం చేశారు. ప్రచారం లో అబద్దం ..పాలనలో అసహనం ..ఇదే కాంగ్రెస్ తీరు. కాంగ్రెస్ ఎండ్రి కాయల పార్టీ ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం.
కర్ణాటక లో కాంగ్రెస్ తీరు ప్రజలకు అర్థమైంది . ఇక్కడ కూడా అర్థమవుతుంది.

కేసీఆర్ మాటిస్తే తప్ప లేదు . కాంగ్రెస్ ది ఇచ్చే గుణం కాదు .ఎగ వేసే గుణం. 6 గ్యారంటీ ల్లోని 13 హామీలను కాంగ్రెస్ మరో ఇరవై రోజుల్లో నెరవేర్చాలి. 20 రోజుల్లో నెరవేర్చకపోతే పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. కోమటి రెడ్డి బీ ఆర్ ఎస్ ను ముక్కలు చేస్తామనడం కాదు. కృష్ణ రివర్ బోర్డు లో చేరెందుకు రెండు నెలల్లోనే ఈ ప్రభుత్వం సంతకం పెట్టింది. కోమటి రెడ్డి సంతకం పెట్టిన సీఎం ను నిలదీయాలి.

నల్లగొండ కు సాగు తాగు నీళ్ల కటకట గురించి కోమటి రెడ్డి మాట్లాడాలి. రైతు బంధు గురించి మాట్లాడితే ఓ మహిళా మంత్రి అసహానం గా మాట్లాడుతున్నారు. కేసీఆర్ హాయం లో srsp చివరి ఆయకట్టు దాకా నీళ్లిచ్చాము. ఇపుడు కాళేశ్వరం నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ గెలవాలి. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుదాం. పార్టీ నేతలు అభిప్రాయ భేదాలు ఉంటె పక్కన పెట్టి టీం లా పని చేయాలి. ఎవరి పొరపాట్లు ఉన్నా సవరించుకోవాల్సిందే. తల్లి లాంటి పార్టీ ని కాపాడుకుందాం.

LEAVE A RESPONSE