-మోటార్ల పంపింగ్ సామర్థ్యం తగ్గట్టుగా పైప్ లైన్ వేయలేదు
-పైప్ లైన్ పనులు నాసిరకంగా ఉండటం వల్ల పగిలిపోతున్నాయి
-తెలంగాణలో నీళ్ల కోసం రైతుల గోసపడటం ప్రభుత్వ వైఫల్యం
-మంచిర్యాల జిల్లా ప్రభుత్వం ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న దండేపల్లి రైతులకు, కాంగ్రెస్ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏమన్నారంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 వేల ఎకరాలకు సాగు నిరాందించాలని స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గూడెం ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చారు. నీళ్లకోసమే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో BRS అధికారంలోకి వచ్చాక నాసిరకం పనులు చేయడం వల్లనే మోటర్లు రిపేర్ కు వచ్చి రైతులకు సాగునీరు అందడం లేదు.ఎత్తిపోతల ద్వారా 3 టీఎంసీల నీళ్లను రెండు మోటార్ల ద్వారా పంపింగ్ చేసి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా మోటార్ల పంపింగ్ సామర్థ్యం తగ్గట్టుగా పైప్ లైన్ వేయలేదు.
పైప్ లైన్ పనులు నాసిరకంగా ఉండటం వల్ల పగిలిపోతున్నాయి. మోటర్లు కూడా ఖర్చు రిపేర్ కావడంతో కెనాల్ ద్వారా సాగునీరు రైతులకు అందడం లేదు.కెనాల్ 30, 42 కాలువ ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నిరందించలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అమరణ నిరాహార దీక్షకు దిగిన 13 మంది రైతుల ప్రాణానికి ముప్పు ఉన్న నేపధ్యంలో వారికి బరోసా కల్పించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశాము. నీళ్ల కోసమే తెలంగాణ తెచ్చుకుంది. తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల కోసం రైతుల గోసపడటం ప్రభుత్వ వైఫల్యం సాగునీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు. ప్రభుత్వం పై పోరాటం చేద్దాం కాంగ్రెస్ పార్టీ రైతులకు వెన్నటి ఉంటుంది. వారి కష్టాలకు అండగా ఉంటాం.
2023- 24 కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. గూడెం ప్రాజెక్టుకు కొత్త మోటర్లు, కొత్త పైప్ లైన్ వేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. యాసంగి సాగుకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడతాను.