ఉగ్రవాద భావజాల వ్యాప్తి చేసే సంస్థకు ప్రభుత్వం డబ్బులివ్వడమేంటి?

– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి
– మత మార్పిడులకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు ఎలా కట్టబెడుతుంది?
తుక్డే తుక్డే గ్యాంగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు?
– తబ్లిగీ జమాత్ కు రూ. 3 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై రచనా రెడ్డి మండిపాటు

ఇస్లాం మత వ్యాప్తి, ఉగ్రవాద భావజాల వ్యాప్తి చేసే సంస్థకు ప్రభుత్వం డబ్బులివ్వడమేంటి..? తుక్డే తుక్డే గ్యాంగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు..? కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపెడుతోంది. ఎన్నికలప్పుడు అనేక వాగ్ధానాలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకుంది.

వచ్చిరాగానే కాంగ్రెస్ ప్రభుత్వం… ముస్లిం మత ప్రచార సంస్థ తబ్లిగీ జమాత్ నిర్వహించే సదస్సుకు నిధులు కట్టబెట్టింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో జరిగిన సమావేశంలో ఈ నిధులు మంజూరు చేసింది. మేం మైనారిటీలకు వ్యతిరేకం కాదు.. కాని, ఇస్లాం మత వ్యాప్తి, ఉగ్రవాద భావజాల వ్యాప్తి చేసే సంస్థకు ప్రభుత్వం డబ్బులివ్వడమేంటి..?

13 డిసెంబరు 2023న విడుదలైన మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ జీవో నెం. 123 అనేది దేశానికి ప్రమాదకరం. 2020లో కరోనా విపత్తు సమయంలో ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సంస్థ వైరస్ వ్యాప్తికి కారణమయ్యిందనేది తెలిసిందే. తబ్లీగీ జమాద్ సంస్థపై టెర్రరిజం వ్యాప్తికి కారణమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా ఇస్లాం మతంలోకి మార్పిడులకు పాల్పడటం, మతవ్యాప్తి చర్యలకు పాల్పడటంతో సౌదీ అరేబియాలో తబ్లిగీ జమాద్ ను బ్యాన్ చేసింది.

ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియానే తబ్లిగీ జమాద్ ను నిషేధించింది. తీవ్రవాద భావజాల వ్యాప్తి, బలవంతపు మత మార్పిడులకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు ఎలా కట్టబెడుతుంది..? ఎలాంటి ఇంటలిజెన్స్ సమాచారం తెలుసుకోకుండా, అధికారులను సంప్రదించకుండా.. తబ్లిగీ జమాత్ కు శాశ్వత ప్రాతిపదికన మంచినీటి పైపులు, పార్కింగ్ లాంటి సౌకర్యాల కల్పనకు వక్ఫ్ బోర్డు నిధులు అందించడం శోచనీయం. తుక్డే తుక్డే గ్యాంగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు?

Leave a Reply