Home » రానున్న ఒక పెను మార్పుకి ఇది సంకేతమా ?

రానున్న ఒక పెను మార్పుకి ఇది సంకేతమా ?

అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేసింది ఓ మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సర్వీసు లో ఉన్న తల్లి -..
కేవలం తన ఏడేళ్ల కొడుకుని వేదవిద్యలో చేర్చటం కోసం !
‘ఇలా జరుగుతుంది’ అని ఎవరైనా చెబితే నమ్మగలమా?
అందులోనూ ప్రపంచం అంతా ఎగబడే ‘పాశ్చాత్య విద్య’ అవకాశాలను వదులుకొని మరీ చేస్తారా?

“గురుకుల వేద పాఠశాలకు భారీ విరాళాలు ఇచ్చే దాతలున్నారు. అయితే, సనాతన ధర్మం గురించి, వేదవిద్య ఔన్నత్యం గురించి తెలిసిన విద్యావంతులు తమ పిల్లలను ఈ వేద విద్యాభ్యాసానికి పంపినప్పుడే, వేదమాత పట్ల మన ధర్మాన్ని నిర్వర్తించినవాళ్ళం అవుతాం…” ఇది వివిధ సందర్భాలలో ప్రముఖ ప్రవచన కర్త, ‘ఋషిపీఠం’ పత్రిక సంపాదకులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఇస్తున్న పిలుపు.

దీనికి తెలుగు నేల మీద స్పందన బాగా వస్తోంది.
అయితే గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడిన ఒక యువ జంట – రవి, శిరీష కూడా ఇలా స్పందించిన వాళ్లలో ఉన్నారు.
ఆ స్పందన ఎలాంటిదో ఆ తల్లి మాటల్లో చెప్పాలంటే …
“యాంత్రిక జీవన ప్రవాహంలో కొట్టుకుపోతున్న మాకు కోవిద్ కాలం – జీవితం, సనాతన ధర్మం, మన బాధ్యత గురించి ఆలోచించే అవకాశం ఇచ్చింది. గత ఏడాది మేం స్వదేశానికి తిరిగి వచ్చేశాం. హైదరాబాదు నగర శివార్లలో చిప్పలపల్లె గ్రామంలో సువిశాల క్షేత్రంలో 2015 నుంచి మాడుగుల శశిభూషణ సోమయాజి గారి సారథ్యంలో నడుస్తున్న అధునాతన వేద విద్య గురుకులం ‘విద్యారణ్యం’లో మా ఏడేళ్ల కొడుకుని చేర్చాం. అప్పటికే ఇక్కడ వందమంది విద్యార్థులున్నారు. ఋగ్వేద, యజుర్వేదాలను, వేద విద్యతోపాటు 12 వ తరగతి వరకు ‘నేషనల్ స్కూల్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్’ గుర్తింపు పొందిన ఆధునిక విద్యను కూడా బోధిస్తున్న ఈ గురుకులంలో – ప్రతి విద్యార్థి 18 ఏళ్ల వయసు వచ్చేసరికి వేద శాఖతో పాటు, తన అభిరుచికి తగిన ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తున్నాడు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వేదాంగాలను కూడా అభ్యసించే ఏర్పాటు ఉంది. శారీరక, మానసిక వ్యాయామం వంటి అంశాలతో పిల్లలను తీర్చిదిద్దుతున్న ఈ విద్య మాకు నచ్చింది. మా ఏడేళ్ల వాడిని అలా వేదాధ్యయనంలో పెట్టాం. నాకు గర్వంగా ఉంది. …”

– శిరీష చెన్నాప్రగడ

ఇప్పుడు శిరీష ఈ విద్యారణ్యం నిర్వహణలో కీలక పాత్ర కూడా స్వీకరించారు. ఒక ఏడాది క్రితం ఇలాగే – డెలాయిట్ లో పని చేస్తున్న మరో తల్లి దివ్య , మురళీకృష్ణ శర్మ ( అపర్ణ ఎంటర్‌ప్రైజస్ )లు తమ కొడుకుని తీసుకువచ్చి ‘విద్యారణ్యం’ లో చేర్చారు. కొద్ది మాసాల క్రితం హుజూరాబాదులో గణితశాస్త్రం అధ్యాపకుడు శ్రీ శ్రీకాంత్ శర్మ కూడా తన కొడుకుని తీసుకొచ్చి చేర్చారు.

Leave a Reply