Suryaa.co.in

Andhra Pradesh

నేను, నా కుటుంబం ఏం తప్పు చేశామని వైసీపీ ఎమ్మెల్యే బూట్లునాకాల?.

నాబాధలు, కష్టాలు, ఈ ప్రభుత్వంలో నాకు జరిగిన అన్యాయాన్ని లోకేశ్ తో చెప్పుకోవడమే నా నేరమా?
• రజకమహిళనని నన్ను అనరాని మాటలన్న వైసీపీఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డి, అతనితీరుని సమర్థించిన జగన్మోహన్ రెడ్డికి రజకులంతా బుద్ధిచెప్పాలి.
• కాళహస్తి వైసీపీఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డి, అతని అనుచరులు ఆడబిడ్డనని కూడా చూడకుండా అనరాని మాటలన్నారు. గుడ్డలు ఊడదీస్తాం..చేయాల్సింది చేస్తాం.. ఎవడు అడ్డొస్తాడు అన్నారు.
• చంద్రబాబు, లోకేశ్ లు బీసీమహిళనైన నన్ను, వారి ఇంట్లో మనిషిలా ఆదరించారు. లోకేశ్ “అక్కా నీకు నేనున్నాను, నీబిడ్డల్ని చదివిస్తాను.” అని ధైర్యంచెప్పాడు.
-కాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డి దుర్మార్గానికి, దురహంకారానికి బలైన రజకమహిళ మునిరాజమ్మ

నేను, నాకుటుంబం ఏం తప్పు చేశామని ఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డి బూట్లునాకాలి?
“యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ గారు నావద్దకు వచ్చినప్పుడు నాబాధలు, కష్టాలు, ఈ ప్రభుత్వంలో అధికారులు లంచాలకోసం జనాన్ని పీక్కుతింటున్న వైనాన్ని ఆయనతో చెప్పుకున్నాను. అదేసమయంలో వారితో జరిగిన సంభాషణల్ని మీడియావారు తమకు చెప్పమనికోరితే, వారితో కూడా నాబాధలు పంచుకున్నాను. ఆసందర్భంలో లంచం కోసంనన్ను, నాకుటుంబాన్ని అధికారులు వేధించిన తీరుని కూడా మీడియావారితో పంచు కున్నాను. తాను నోరుతెరిచానన్న అక్కసుతో, ఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డిని ప్రశ్నించాన న్న అహంకారంతో కొందరు వైసీపీనేతలు నా ఇంటిపైకి మనుషుల్ని పంపించారు. రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకొని బతికే నావద్దకు వచ్చిన కొందరు వైసీపీ మహిళానేతలు, నా బండివద్దకు వచ్చి టిఫిన్ పెట్టమని అడిగి, పెట్టినవెంటనే దానిలో పురుగులున్నాయి.. బొద్దింకలున్నాయని నాపై అన్యాయంగా దాడికి పాల్పడ్డారు. అకారణంగా నా టిఫిన్ బండిని పడేసి, అడ్డుకోబోయిన నాభర్తను కూడా చావగొట్టారు. ఆ సమయంలో నాపై దాడికి పాల్పడ బోతే, స్థానికులు నన్నుపక్కకు తీసుకెళ్లి ఒక ఇంట్లోదాచారు. నాపై దాడిజరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే, సీఐ లైన్లోకి వచ్చి నీపై దాడిచేసినవారిని గుర్తించగలవా, నీవద్ద ఏమైనా ఫోటోలు, వీడియోలు ఉన్నాయా అన్నారు. అవేవీ లేవనిచెప్పడంతో, మరోసారి వస్తే తమకుచెప్పాలంటూ ఫోన్ పెట్టేశారు. నాపై, నా కుటుంబంపై దాడిచేసి, నన్ను, నాభర్తను కొట్టి, తిరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాపైనే తప్పుడు కేసులు పెట్టారు. నా వద్దఉన్న టిఫిన్ తిని వారి ఆరోగ్యం దెబ్బతిన్నదని తప్పుడుకేసులు పెట్టారు. తరువాత ఒకబ్బాయి నీపై పెట్టినకేసుల్ని కోర్టులో విచారిస్తారని చెప్పాడు.

తరువాత మరలా ఫోన్ చేసి, ఈరోజు నీ టిఫిన్ అంగడే పగిలింది..రేపు నీగుడ్డలు ఊడదీస్తాం.. ఎవడు అడ్డుస్తాడో చూస్తామన్నారు. దాంతో నాకుకోపంవచ్చి, నాగుడ్డలు ఇక్కడకాదు..కాళహస్తిలో ఊడదీయండి.. తీసేమగాళ్లు ఎవరో రండి అన్నాను. దాంతో మరింతకోపోద్రిక్తులై నన్నుఅనరాని మాటలన్నారు. నాకులంపేరుతో దూషించారు. చాకలిదానివి..నీకెందుకే టిఫిన్ బండి.. ఎక్కడికోవెళ్లి గుడ్డలు ఉతుక్కొని ఎవడితోనో ఉండక అంటూ నీచాతినీచంగా మాట్లాడారు. నువ్వు వెంటనే ఎమ్మెల్యే మదుసూ దన్ రెడ్డిని కలిసి, ఆయనకాళ్లపై పడి క్షమాపణ అడగాలని, ఆయన బూట్లునాకాలని నన్నుఅవమానించారు. వారిమాటలువిన్న మాఆయన విషయం పెద్దదిఅయ్యేలా ఉందని ఎమ్మెల్యేమనుషులతో మాట్లాడానికి వెళ్తే, అక్కడే ఆయన్ని తిట్టి, ఆయన ముందే నన్నునావ్యక్తిత్వాన్ని కించపరుస్తూ దారుణంగా సభ్యసమాజం తలదిం చుకునేలా జనం మధ్యలోనే దూషించారు. జరిగిందంతా తెలుసుకున్నాక కొందరు టీడీపీనేతలు నావద్దకు వచ్చిధైర్యంచెప్పారు. తిరుపతి మహిళానేత చక్రాలఉష నాకుఫోన్ చేసి, తెల్లారాక పార్టీ కార్యాలయానికి రమ్మనిచెప్పింది. అక్కా..నాకుభయం, నేనురాలేను అన్నాను. ఎలాగోలా పార్టీకార్యాలయానికి వెళ్లాలని అంటే, నాతమ్ముడు కత్తి ముందుపెట్టుకొని, బండిమీద నన్ను కూర్చొబెట్టుకొని పార్టీకార్యాలయంలో వదిలిపెట్టాడు. అక్కడినుంచి నన్ను తీసుకెళ్లి కాళహస్తి ఇన్ ఛార్జ్ సుధీర్ రెడ్డి గారి ఇంటికిపంపించారు. అక్కడ నాకు ధైర్యంచెప్పి, నా కు టుంబాన్ని ఆదుకుంటామన్నారు. తరువాత లోకేశ్ గారివద్దకు తీసుకెళ్లారు. ఆయన అక్కా.. నీకు నేనున్నాను… మనపార్టీ అధికారంలోకి వచ్చేవరకు నీకుటుంబానికి ఏ సమస్యా రాకుండా చూసుకుంటాను. నువ్వుతినే ప్రతిబియ్యపు గింజా ఈ తమ్ముడు నీకుపంపిస్తాడు, నీ బిడ్డల్ని చదివిస్తాను అనిచెప్పారు. ఆయన మాటలువినగానే నాకు ఏడుపుఆగలేదు. లోకేశ్ గారిని కలిశాక, నన్ము పట్టుకోవడానికి పోలీసులు చిత్తూరుజిల్లా మొత్తం తిరిగారు. మా బంధువులు, చుట్టాలను కూడా వేధించారు. నేను, నా కుటుంబం సురక్షితంగా సుధీర్ రెడ్డి గారివద్దే ఉన్నాము. నేను, నాకుటుంబం ఏంతప్పుచేశామని ఎమ్మెల్యే బూట్లునాకాలి?

నేను కాళహస్తి వస్తున్నా…గుడ్డలు ఊడదీస్తామన్నవాళ్లు వచ్చి నన్ను అడ్డుకోవచ్చు.
నేడు చంద్రబాబుగారిని కలవడానికి వచ్చాను. ఆయన నాకుధైర్యంచెప్పారు. నాపై దాడిజరిగి నప్పుడు, వైసీపీవాళ్లు నా ఇంటిపైకి వచ్చినప్పుడు టీడీపీవాళ్లు ఎవరూరాలేదన్న బాధతో అప్పుడు వారిని మాటలన్నాను. దానికి వారు చిన్నబుచ్చుకున్నారని తెలిసింది. వారు నా వాళ్లు, వారిని బాధపెట్టాలని నేను అనలేదు. ఆడబిడ్డకు అన్యాయంజరిగితే రాలేదన్న బాధ లోఉండి మాట్లాడాను. నా మాటలువారిని గాయపరిస్తే, మనస్ఫూర్తిగా టీడీపీ జాతీయ కార్యా లయంనుంచే క్షమాపణలు అడుగుతున్నాను నేను తప్పుచేయను. నన్ను ఎవరైనా ఏమై నా అంటే ఊరుకోను. ముందునుంచీ కష్టాన్నినమ్ముకొనే బతుకుతున్నాను. నా ఇంట్లో ఉండ టానికి నేను తిరిగి కాళహస్తి వెళ్తున్నాను. నా గుడ్డలు ఊడదీస్తాం..నన్ను అదిచేస్తాం.. ఇది చేస్తాం అన్నవారు ఎవరైనా రావచ్చు. నాకుచదువురాదు.. నా తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం మాత్రమే ఉంది. ఆ ధైర్యంతోనే కాళహస్తికి వస్తున్నా.. ఎమ్మెల్యే బూట్లునాకాలి..లేకపోతే న న్ను చంపేస్తాం అన్నవారు వచ్చి నన్ను అడ్డుకోవచ్చు. నాకుటుంబాన్ని పోషించుకోవడాని కి టిఫిన్ బండిపెట్టుకుంటే, అదితప్పా?  చాకలిదానివి నీకెందుకు అన్నారు. చాకలిదా న్నే..ఎక్కడికి వచ్చానో చూడండి. ఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డి నన్ను చాకలిది అన్నాడు.. దానెక్కచాకలిది.. ఎన్ని మాట్లాడుతుందిరా అని ఆయనపక్కనుండే వాడు అన్నాడు. నేను చదువుకోకపోయినా 5భాషలు మాట్లాడగలను. పుట్టినప్పటినుంచీ నేను తెలుగుదేశమే. మదుసూదన్ రెడ్డి నీకు, నీదిక్కుమాలిన రాజకీయాలకు ఒకదండం.”

మా సోదరి మునిరాజమ్మకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రంలోని రజకులందరికీ తెలియచేస్తాం: టీడీపీ రజకవిభాగం రాష్ట్ర కన్వీనర్ గుర్రపుశాల రామకృష్ణ

“మాఆడబిడ్డ అయిన మునిరాజమ్మపై జరిగిన దాడిని నిరసిస్తూ, వైసీపీ ఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డి దురహంకా రాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. మాసోదరి మునిరాజమ్మకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీనేతలు ఆమెపై వ్యవహరించినతీరుని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుగారి దృష్టికి తీసుకెళ్లాము. వైసీపీప్రభుత్వ కులఅ హంకారానికి, అధికారమదానికి సర్వంకోల్పోయిన మా ఆడపడుచు మునిరాజమ్మకు, ఆమెకుటుంబానికి తెలుగుదేశంపార్టీ, తానుఅండగా ఉంటానని చంద్రబాబుగారు భరోసాఇచ్చారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఆమె కుటుం బాన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటామని చంద్రబాబుగారు చెప్పారు. శ్రీకాళహస్తి వైసీపీఎ మ్మెల్యే మదుసూదన్ రెడ్డి దుర్మార్గాలను, అతని పొగరును, అతని అవినీతిని ఎదిరించాలనే నిర్ణయానికి వచ్చాము.

రజకులంటే చిన్నచూపు చూస్తున్న మదుసూదన్ రెడ్డిని, అతన్ని మసమర్థిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలోని రజకులు వదిలిపెట్టరని హెచ్చరిస్తున్నాం. మునిరాజమ్మకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రప్రజలందరికీ తెలిసేలాచేసి, వైసీపీఎమ్మెల్యేని, ముఖ్యమంత్రిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం. మమ్మల్ని, మా కులాన్ని అవమానించి, అవహేళనగా మాట్లాడిన మదు సూదన్ రెడ్డిలాంటివారిని, అలాంటి దురహంకారులకు కొమ్ముకాస్తున్న జగన్మోహన్ రెడ్డిని బట్టలు ఉతికినట్టు ఉతుకుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.”

LEAVE A RESPONSE