– దేవాలయాలకు వచ్చే ఆదాయాలను చర్చ్, మసీదుల నిర్మాణాలకు ఎలా మళ్ళిస్తారు?
-ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే వారి అభివృద్ధికి వినియోగించాలి
– గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ
ఈరోజు అరండల్ పేట లోని ఎస్సీ మోర్చా కార్యాలయం లో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ధారా అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతనంగా జిల్లా కార్యవర్గంలో బాధ్యతలు చేపట్టిన వారికి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ సమక్షంలో నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ…
ఎస్సీ,ఎస్టీలకు రాష్ట్ర పతిగా అవకాశం కల్పించిన పార్టీ బిజెపి.బలహీన వర్గాలకు చెందిన మోడీ అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తున్నారు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించి పాస్టర్లకు జీతాలిస్తున్నారు.హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాలను చర్చ్, మసీదుల నిర్మాణాలకు ఎలా మళ్ళిస్తారు? పాస్టర్లు, ముల్లాలకు జీతాలిచ్చి సమాజంలో ఏవిధమైన మార్పు తీసుకొస్తారో చెప్పాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే వారి అభివృద్ధికి వినియోగించాలి.ఎన్నికల ముందు దళితుల సంక్షేమం రాజకీయ నాయకులకు గుర్తొస్తుంది.ప్రతి రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకు కోసం ఉపయోగించు కున్నారు. కానీ బీజేపీ మాత్రం వారికి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉన్నత స్థానంలో నిలుచోపెట్టి సముచిత స్థానం కల్పించింది.దళితుల పేరుతో నిర్మించిన సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దళితులను మోసం చేస్తున్నారు.ఎస్సీ వర్గాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేస్తుంది.వారి కేటాయించిన నిధులను నవరత్నాలకు మళ్ళిస్తున్నారు.వారికోసం భారతీయ జనతాపార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేశారు.
ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ ధారా అంబేద్కర్ మాట్లాడుతూ… గుంటూరు జిల్లాలోని అన్ని ఎస్సీ కాలనీలో పాదయాత్ర నిర్వహించి నరేంద్రమోడీ సంక్షేమ పథకాలు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ల పట్ల వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని అందరికీ తెలియజేస్తామని అన్నారు. ఎస్సి మోర్చా జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా రాయపూడి చిన్నరాజు, బొక్క నరసింహారావు, ఉపాధ్యక్షులుగా కొరబండి వెంకయ్య, డాక్టర్ దొడ్డ జార్జ్, కార్యదర్శులుగా దాసరి సింగయ్య, వేముల రమేష్, బుర్ర ప్రేమ్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ గా చుక్కా అశోక్ తదితరులు నూతన కమిటీలో నియమించ బడ్డారు. కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచుమల్లు భాస్కరరావు, కుమార్ గౌడ్, జిల్లా బిల్డింగ్ సెల్ నాయకులు రాయ నాగేశ్వరావు, స్టాలిన్, బిజెపి రాష్ట్ర మీడియా కోకన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.