– జగన్ రెడ్డి పేరు ఇకపై ఫేక్ మోహన్
-నాది అంబేద్కర్ రాజ్యాంగం
– జగన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్నాడు
– సీపీఎస్ రద్దు చేస్తానని మోసం చేశాడు
– కనీసం ప్రతినెలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు
– గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదు… లోకల్ ఫేక్ సమ్మిట్
– సోమాలియా లో కూడా భోజనం, గిఫ్టుల కోసం అలా కొట్టుకోరు
– పాపాల పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప రాష్ట్రంలో ఏ రెడ్డి సోదరులూ బాగుపడలేదు.
– విజనరీ, ప్రిజనరీకి చాలా తేడా ఉంది
– నేను ప్రజల్లో ఉంటా…జగన్ పరదాల మధ్య ఉంటాడు
– అన్నమయ్య జిల్లా పీలేరు బహిరంగసభలో యువనేత లోకేష్
వెంగమాంబ పుట్టిన ఈ పీలేరు గడ్డపై నేను పాదయాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క ఛాన్స్…ఒక్క ఛాన్స్..అని ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.ఒక్క ఛాన్స్ వల్ల మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదు..పిచ్చోడి చేతిలో రాయిపెట్టినట్లు తయారైంది మన రాష్ట్రం పరిస్థితి. యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాటినుండి జగన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు. నా పాదయాత్రను ఎలా అడ్డుకోవాలి అంటూ స్కెచ్ వేస్తున్నారు.వెయ్యి మంది పోలీసులు, ఆరుగురు డీఎస్పీలు, 20మంది సీఐలు, ఇంటెలిజెన్స్ అధికారులు… ఒక్క లోకేష్ ను ఆపడానికి ఇంత మంది అవసరమా? 400రోజులు మీ మధ్యే ఉంటా…ఎవరాపుతారో చూస్తా. నన్ను అడ్డుకోవడానికి నా మైక్, సౌండ్ వెహికల్, స్టూల్ లాక్కుంటున్నారు.మై డియర్ జగన్ రెడ్డి…నేను టెర్రరిస్టును కాదు…వారియర్ ని. జగన్ రెడ్డిది రాజారెడ్డి రాజ్యాంగం అయితే…నాది అంబేద్కర్ రాజ్యాంగం.
నేను ప్రజల్లో ఉంటా…జగన్ పరదాల మధ్య ఉంటాడు. మాటతప్పి, మడమతిప్పే జగన్ రెడ్డి పేరు ఇకపై ఫేక్ మోహన్. 2019ఎన్నికల సమయంలో యువతకు జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చింది సున్నా. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ సున్నా. 2.30లక్షల ఖాళీ ఉద్యోగాల భర్తీ సున్నా. మెగా డీఎస్సీ నిర్వహణ సున్నా.జగన్ రెడ్డి ఓ ఫేక్ ముఖ్యమంత్రిగా నిలిచాడు. 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక 2025 నుంచి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశాడు.సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చి వీధి వీధికీ బెల్టు షాపులు పెట్టి కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు.
జగన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్నాడు. సీపీఎస్ రద్దు చేస్తానని మోసం చేశాడు. కనీసం ప్రతినెలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చివరకు పోలీసులు కూడా జగన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారారు.4సరెండర్లు, 8టీఏ, డీఏ లు పెండింగ్ లో పెట్టాడు. 2024లో అధికారంలోకి వచ్చేది టీడీపీనే…మీ సమస్యలు పరిష్కరించేది మేమే. ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా జగన్ రెడ్డి మార్చేశాడు. దీనిపై ప్రధాని మోదీ కి లేఖ రాసాను. దీనిపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గంజాయి ఎక్కడా లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు.ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సమయంలోనే చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో గంజాయి దొరికింది.చిన్న పిల్లల్ని కూడా వైసీపీ నాయకులు గంజాయికి బానిసలుగా చేస్తున్నారు.టీడీపీ పాలనలో గంజాయిని పూర్తిగా అరికట్టాం…డీ అడిక్షన్ సెంటర్లను కూడా మేం నిర్వహించాం.వైసీపీ పాలనలో పదో తరగతి విద్యార్థులను గంజాయి బానిసలుగా చేస్తున్నారు. చివరకు వారినే సప్లయర్లుగా మార్చేస్తున్నారు.
యువకులంతా గంజాయికి నో చెప్పాలని వేడుకుంటున్నా. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం కోసం గంజాయికి దూరంగా ఉండండి.మేం అధికారంలోకి వచ్చాక గంజాయి అమ్మిన వారిని, అమ్మేవారిని తరిమి తరిమి కొడతాం. విజనరీ, ప్రిజనరీకి చాలా తేడా ఉంది. టీడీపీ పాలనలో పెట్టుబడులు వెల్లువెత్తాయి.వైసీపీ అధికారంలోకి వచ్చిన 4ఏళ్ల వరకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రాలేదు. జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదు… లోకల్ ఫేక్ సమ్మిట్. పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవాళ్లు గిఫ్టులకోసం కొట్టుకున్నారు. కాగితాల్లేకుండా ఫేక్ ఎంఓయులు చేసుకున్నారు. సోమాలియాలో కూడా భోజనం, గిఫ్టుల కోసం అలా కొట్టుకోరు. ఇండోసోల్ అనే కడపకు చెందిన జగన్ బినామీ కంపెనీ రూ.76వేలకోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు కలరింగ్ ఇచ్చారు.
ఆ కంపెనీ పేరుతో 25వేల ఎకరాల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశారు.కానీ నెట్ లో కొట్టి చూస్తే ఆ కంపెనీ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ కేవలం లక్షరూపాయలు మాత్రమేనని బయటపడింది. సిరాంటికా అనే ఐటి కంపెనీలో 50మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆ కంపెనీ 8వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందట ఏబీసీ మరో ఊరుపేరులేని కంపెనీ 1.50లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందట. ఫేక్ సమ్మిట్ పై రేపు నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నా…అసలు వాస్తవాలు బయట పెడతా. చంద్రబాబు పాలనలో తెచ్చిన లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫాక్స్ కాన్, అమర్ రాజా వంటి పెద్దపెద్ద కంపెనీలను జే ట్యాక్స్ కోసం తరిమేసి…ఫేక్ కంపెనీలతో పెట్టుబడులు పెడుతున్నామంటూ అబద్దాలు చెప్పిస్తున్నారు. జగన్ రెడ్డిని ఒక కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్.
అన్న క్యాంటీన్, పండుగ కానుక, పెళ్లి కానుక, ఫీజు రీయింబర్స్మెంట్, చంద్రన్న భీమా ఇలా అనేక కార్య్రమాలను కట్ చేశారు. కరెంటు ఛార్జీలు, పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసరాలు ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఫిటింగ్ మాస్టర్ గా మారారు. భారతీ సిమెంట్ ధర ఏకంగా రూ.400కు పెంచేశాడు.మైనారిటీలను జగన్ రెడ్డి దారుణంగా మోసం చేస్తున్నాడు.దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
చంద్రబాబు పాలనలో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. పీలేరులోని రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. జగన్ రెడ్డి పాలనలో లబ్ధిపొందింది కేవలం నలుగురు రెడ్లు మాత్రమే.పాపాల పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప రాష్ట్రంలో ఏ రెడ్డి సోదరులూ బాగుపడలేదు. జగన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయ్యాక దళితులను చంపేందుకు వైసీపీ నాయకులకు లైసెన్స్ ఇచ్చాడు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడు సుబ్రహ్మణ్యంను చంపి, డోర్ డెలివరీ చేశాడు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దోచేశాడు. అసైన్డ్ భూములను లాక్కున్నారు.దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారు. మరో డాక్టర్ అనితను వేధించారు.
పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డి అన్న బంగారం. చింతల రామచంద్రారెడ్డిని ఇక్కడ రెండుసార్లు గెలిపించారు. మీకు చింతలు తప్ప ఏమీ మిగల్లేదు.పాపాల పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే బావమరిది హరీష్ రెడ్డి పీలేరును అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ ముగ్గురూ నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసుకుతింటున్నారు.ఈ నియోజకవర్గంలో రూ.500కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు పాపాల పెద్దిరెడ్డి ప్రయత్నిస్తే మన సింహం కిషోర్ కుమార్ రెడ్డి పోరాడి అడ్డుకున్నారు.
దీన్ని తట్టుకోలేక సబ్ కలెక్టర్ ను పాపాల పెద్దిరెడ్డి ట్రాన్స్ ఫర్ చేయించాడు. పీలేరు నియోజకవర్గంలో కొండలు, గుట్టలను వైసీపీ వాళ్లు దోచుకుంటున్నారు.పీలేరు, కలికిరి, గుర్రంకొండ తదితర ప్రాంతాల్లో ఇల్లీగల్ క్వారీయింగ్ ద్వారా 600 కోట్లు స్వాహాచేశారు. బహుదా, మాండ్యా నదుల్లో రూ.500కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారు.పెద్దిరెడ్డి కన్నుబడిన ఏ భూమి అయినా అది స్వాహా అయినట్టే.రాత్రికి రాత్రే పేదల భూముల్లో ఫెన్సింగ్ వేసి, ఆ మరుసటి రోజు దొంగ పత్రాలు సృష్టించి లాక్కుంటున్నాడు పెద్దిరెడ్డి. హంద్రీనీవా, అడవిపల్లి రిజర్వాయర్లు పూర్తిచేయడంలో వైసీపీ ముందడుగు వేయలేదు. చుక్క నీరు మనకు ఇవ్వలేదు. చెరువులు, చెక్ డ్యామ్ లు వర్షాలకు కొట్టుకుపోతే ఈ ఎమ్మెల్యే బాగుచేయించలేదు. మేం అధికారంలోకి వచ్చాక మీకు సంక్షేమ పాలన అందిస్తాం.పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి ఇక్కడి యువకులకు ఉద్యోగాలిస్తాం.టొమాటో రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించి ఆదుకుంటాం.
పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లిని ఓ ప్రత్యేక జిల్లాగా చేస్తాం. కిషోర్ కుమార్ రెడ్డిని 2024లో భారీ మెజారిటీతో గెలిపించండి…అసెంబ్లీకి పంపండి. గతంలో కంటే ఎక్కువగా పీలేరులో రెట్టింపు వేగంతో అభివృద్ధి చేస్తాం. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు…కానీ ఈ లోకేష్ వైసీపీ నాయకులకు మూర్ఖుడు.అక్రమాలు చేసి, అన్యాయంగా మా కార్యకర్తలు ఇబ్బందులు పెట్టిన నాయకులు, అధికారులు ఎవరో నాకు తెలుసు. వాళ్ల తోలు తీస్తాం. మేం అధికారలోకి వచ్చాక జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి తప్పుచేసిన అధికారులకు జైలుకు పంపుతాం. యువత భవిష్యత్తు కోసం నేను యువగళం పేరుతో నేను చేస్తున్నది ధర్మయుద్ధం. ప్రతి బూత్, ప్రతి గ్రామంలో బంపర్ మెజారిటీని టీడీపీకి ఇచ్చి 175స్థానాలు మనమే గెలవాలి. అందులో మొదటి స్థానంలో పీలేరును నిలబెట్టాలి. అందరూ కలిసి రండి…జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిద్దాం. సైకో పోవాలి…సైకిల్ రావాలనే నినాదంతో ముందుకు వెళదాం… పోరడదాం రండి.