నారాయణఖేడ్ లో బిజెపి బూత్ స్వశక్తీకరణ్ వర్క్ షాప్ లో పాల్గొన్న యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, సంగప్ప, విజయ్ పాల్ రెడ్డి
బిజెపి చేపట్టిన బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ ను విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిది సంగప్ప కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నారాయణఖేడ్‌లోని శెట్కార్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బూత్ స్వశక్తికరన్ వర్క్ షాప్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. బిజెపి 18 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి, తాజాగా రెండు రాష్ట్రాల్లో మళ్ళీ అధికారం చేసికించుకోవడానికి, బూత్ పట్టిష్టతే కారణమని సంగప్ప చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ శక్తి కేంద్రం ఇన్చార్జిలు, సహ ఇంచార్జిలు బూత్ కమిటీలను బలోపేతం చేయాలని కోరారు.
బూతు గెలిస్తే నియోజకవర్గం గెలిచినట్టే, తద్వారా రాష్ట్రం కూడా గెలిచినట్టే అని, అప్పుడే బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి, డాక్టర్ రవికుమార్, రజినీకాంత్, మారుతి రెడ్డి, సుధాకర్, రాజు గౌడ్ తో పాటు మండల అధ్యక్షులు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు