ఉన్నత ఆశయ సాధనే ఓ తపన

Spread the love

-టీ పోపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్

మహిళలు ఉన్నత ఆశయం తో లక్ష్య సాధన కు కృషి చెయ్యాలని తెలంగాణ పద్మశాలి ఆఫిషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహిత మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మార్చ్ 8 న జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం తో పాటు మహిళా దినోత్సవం ఉన్న సందర్భంగా.. సోమవారం నాడు ఆయన హైదరాబాద్ నాగోల్ లో చింతల పాటి శ్రీనివాస్ ఆధ్వర్యం లో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఇంటర్ స్తాయి నుంచే గ్రూప్స్, సివిల్స్ సాధన కోసం కృషి చేస్తే..విజయం తధ్యం అని సూచించారు.డిగ్రీ చదువుతున్న రమ్య కు సివిల్స్ సాధన కోసం తగు సూచనలు చేశారు. సాధన చేస్తే, సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం లో నే యువత శక్తి,యుక్తి ని చాటాలన్నారు.ఫోటో గ్రఫీ లో చక్కటి ప్రతిభ కలిగిన శ్రీరామ్, ప్రసాద్ ను అభినందించారు.

Leave a Reply