– చంద్రబాబు ప్రాణాలు కాపాడారు
– లోకేష్‌ని కలిసి కృతజ్ఞత తెలిపిన వైసీపీ నేత
కులం షూడం, మతం షూడం, ప్రాంతం షూడం అంటూ లెక్చర్లు దంచుతూ..కులం చూసుకుని పదవులు, మతం చూసుకుని సహాయాలు, ప్రాంతాల పేరుతో విద్వేషాలు చిమ్మే జగన్ రెడ్డి కోసం వైసీపీ నేత ప్రమాదం బారినపడ్డాడు. ప్రాణాపాయస్థితిలో మంచంపట్టాడు. అప్పుడు కులం,మతం,ప్రాంతం, పార్టీలు చూడకుండా సాయం అందించింది చంద్రబాబు ప్రభుత్వం. కష్టంలో ఉన్నది వైసీపీ నేత, సాయం చేయాల్సింది వైసీపీ అనుకోలేదు టిడిపి.
టిడిపి ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సిఫారసు మేరకు చంద్రబాబు ప్రభుత్వం 30 లక్షలు అందించి అశోక్ ప్రాణాలు నిలబెట్టింది. తమ కుటుంబసభ్యుడి ప్రాణాలు కాపాడిన తెలుగుదేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆ కుటుంబం. పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ వైసీపీ నేత. జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ ప్రమాదానికి గురయ్యాడు. వైసీపీ పట్టించుకోలేదు. మంచానికే పరిమితమై 2 నెలలపాటు మృత్యువుతో పోరాడాడు. అశోక్ కుటుంబసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని సహాయం కోరారు. ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి 30 లక్షలు సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించారు. వైద్యంతో అశోక్ ప్రాణాలు నిలిచాయి. పీలేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తూ చింతపర్తి విడిది కేంద్రంలో ఉన్న నారా లోకేష్‌ని అశోక్ కుటుంబ సభ్యులు కలిసి చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు.