– జగన్ రైతుల్ని ఉద్ధరిస్తే, దేశంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వస్థానంలో ఎందుకుంది?
– అప్పులకోసం జీడీపీని పెంచారు. 7శాతంకూడా లేని జీడీపీని 14శాతమున్నట్టు చెప్పడం మోసం కాదా?
• ఎన్నికల కమిషనర్ పట్ల, హైకోర్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పట్ల, గత గవర్నర్, ప్రస్తుత గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరించినతీరు రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే.
• 4 ఏళ్లలో జగన్ సాగించిన విధ్వంసకరపాలనని గవర్నర్ ప్రసంగంలో మెరుగ్గా చూపే ప్రయత్నం చేశారు, ప్రభుత్వం రాసిచ్చిన అబద్ధాలు చదవలేక గవర్నర్ చాలాసార్లు తడబడ్డారు. అవాస్తవాలు, అసత్యాలు జీర్ణించుకోలేక ప్రసంగం మధ్యలో మంచినీళ్లు తాగారు.
• నాడు-నేడు పేరుతో విద్య, వైద్యరంగాలను నిర్వీర్యం చేశారు. ఇంకో ఏడాదిలో ఇంటికిపోయే ముఖ్యమంత్రి రాబోయే ఐదేళ్లగురించి మాట్లాడటం సిగ్గుచేటు.
• బడ్జెట్ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తూ, ప్రతిపక్షం గొంతునొక్కేసి, సొంతడబ్బాలు కొట్టుకుంటున్నారు.
– టీడీపీ శాసనసభ్యులు పయ్యావులకేశవ్, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బెందాళం అశోక్
గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే. : పయ్యావుల కేశవ్
పాత గవర్నర్ ను అప్పులకోసం తాకట్టుపెట్టారు. కొత్తగా వచ్చిన గవర్నర్ స్థాయిని తగ్గించి, సభసాక్షిగా గవర్నర్ వ్యవస్థను అవమానించారు. “ కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్, అలాంటి గవర్నర్ తో ముఖ్యమంత్రిని పొగిడించడం, వైసీపీప్రభుత్వానికే చెల్లింది. గవర్నర్ తో ముఖ్యమంత్రిని పొగిడించేంత (అవర్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ అని) సాహసం ప్రభుత్వం ఎలాచేసింది? 40 నుంచి 50ఏళ్లవరకు చట్టసభల్లో గవర్నర్ మాట్లాడింది చూస్తే ఎక్కడా ఇలాంటి విపరీతధోరణి కనిపించదు. రాజ్యాంగవ్యవస్థలో గవర్నర్ పెద్దా.. లేక ముఖ్యమంత్రి పెద్దా? గవర్నర్ ప్రసంగమే అయినా, ఆయన చదివే ప్రతుల్ని తయారుచేసేది ప్రభుత్వమే. గతంలో గవర్నర్ గాపనిచేసిన వ్యక్తిని తాకట్టుపెట్టారు. ఇప్పుడు గవర్నర్ గా వచ్చినవ్యక్తి స్థాయిని తగ్గించారు. గవర్నర్ కంటే ముఖ్యమంత్రి గొప్ప అనడం గవర్నర్ వ్యవస్థను అవమా నపరచడం కాదా?
ఎన్నికల కమిషనర్ పట్ల, హైకోర్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపట్ల, గతగవర్నర్, ప్రస్తుత గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిం చినతీరు రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే. గవర్నర్ అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు కచ్చితమైన సమయపాలన ఉంటుంది. ముఖ్యమంత్రి, ఇద్దరు సభాపతులు గవర్నర్ కు ఎదురెళ్లి, స్వాగతంపలికి ఆయన్ని సభలోకి తీసుకురావడం సభాసంప్రదాయం..అనాదిగా వస్తున్న విధానం. కానీ నేడు ఈ ప్రభుత్వం గవర్నర్ ను సరైనపద్ధతిలో రిసీవ్ చేసుకోలేదు. ముఖ్యమంత్రి వచ్చేవరకు గవర్నర్ ఎదురుచూడాలా? గవర్నర్ ని తీసుకెళ్లి, సభాపతిస్థానం లో కూర్చోబెట్టకముందే, సభకురావాలని ముఖ్యమంత్రికి తెలియదా?
కౌల్ అండ్ షక్దర్ ని యమావళిలో గవర్నర్ ను సభలోకి ఎలా ఆహ్వానించాలో, ఆయనకు ఎలా స్వాగతం పలకా లో స్పష్టంగాఉంది. కానీ జగన్ ప్రభుత్వం నేడు ఆ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిం ది. గవర్నర్ ను అసెంబ్లీలో వేచిఉండేలా చేయడం ముమ్మాటికీ ఆయనపై జగన్ కు ఉన్న చిన్నచూపుకు సంకేతం. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం మొత్తం పొగడ్తలు, సత్యదూరమైన విషయాలు, చేయనిపనుల్ని చేసినట్టు చెప్పుకోవడాల సమాహారమేనని చెప్పాలి. జగన్ ప్రభుత్వంలో నియమాలు, నిబంధనలకు విలువలేదు.
ముఖ్యమంత్రిని పొగడటం, ఆయనకు అనుకూలంగా పనిచేయడం, ఆయన ఆదేశాలే శిరోధార్యం అన్నట్లు రా జ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. వైసీపీప్రభుత్వంలో రాజ్యాంగం, విధివిధానాలు, ప్రోటో కాల్ ఎక్కడా, ఎప్పుడూ కనిపించలేదు. ముఖ్యమంత్రి విశాఖే రాజధాని అంటాడు. ఆర్థిక మంత్రేమో బెంగుళూరు వెళ్లి విశాఖే రాజధాని అంటాడు. బయటవేదికలపై రాజధానిగురించి మాట్లాడతారు, కానీ శాసనసభలో మాత్రం రాష్ట్రరాజధాని ఏదో స్పష్టంచేయరు. రాష్ట్రంలో ఎక్కడా అమల్లోలేని దిశాయాక్ట్ గురించి గవర్నర్ తోనే అబద్ధాలు చెప్పంచారు. ఇరిగేషన్ ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే ఏంచేశామో చెప్పుకోలేక క్లీన్ డ్రింకింగ్ వాటర్ గు రించి చెప్పించారు. చేనేత, చేతివృత్తుల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఎక్కడాలేదు.”
అవాస్తవాలు, అసత్యాలు జీర్ణించుకోలేక ప్రసంగం మధ్యలో మంచినీళ్లు తాగారు : నిమ్మల రామానాయుడు
4 ఏళ్లలో జగన్ సాగించిన విధ్వంసకరపాలనని గవర్నర్ ప్రసంగంలో మెరుగ్గా చూపే ప్రయత్నం చేశారు, ప్రభుత్వం రాసిచ్చిన అబద్ధాలు చదవలేక గవర్నర్ చాలాసార్లు తడబడ్డారు.“గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అబద్ధాలతో సాగింది. 4ఏళ్ల జగన్ విధ్వంసకరపాలన ఏదైతే ఉందో, దాన్ని గవర్నర్ ప్రసంగంలో మెరుగ్గా చూపే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగానికి, వాస్తవాలకు చాలాచాలా వ్యత్యాసం ఉంది. నాడు-నేడు పేరుతో పాఠశాలలకు పైపైన మెరుగులుదిద్ది, 3,4,5 తరగతుల్నిరద్దుచేసిన ప్రభుత్వం విద్యావ్యవస్థగురించి మాట్లాడటం సిగ్గుచేటు. వైద్యసేవలు అందక పేదలు, మరీముఖ్యంగా మహిళలు నానాఅవస్థలు పడుతుం టే ఈ ప్రభుత్వం ఆరంగాన్ని ఉద్ధరించినట్టు చెప్పుకుంటోంది. ప్రసవంకోసం డోలీలు, మంచాల పై వెళ్లాల్సిన దుస్థితికి మహిళలురావడం, మృతదేహాలను ద్విచక్రవాహనాలపై తీసుకెళ్లడమే నా ఈప్రభుత్వం వైద్యరంగంలో సాధించినప్రగతి?
5ఏళ్లలో 25లక్షల ఇళ్లు కట్టిస్తామన్న జగన్ హామీ ఏమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4ఏళ్లలో కేవలం 5ఇళ్లు(ఐఏవై) మాత్రమే నిర్మించింద ని కేంద్రప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. ఇళ్లపట్టాల పేరుతో నివాససముదాయాల కు 15, 20 కిలోమీటర్ల దూరంలో పేదలకు ఇళ్లస్థలాలు (సెంటుభూమి)ఇస్తే, ఇళ్లునిర్మించిన ట్టా? ఆపట్టాలు పేదలకు ఎందుకూ పనికిరాకుండాపోయాయి. గవర్నర్ ప్రసంగంలో ఇళ్లనిర్మాణాన్ని ప్రభుత్వం అపహాస్యంగా మార్చిందనేచెప్పాలి. వైఎస్సార్ ఆసరా పేరుతో మ హిళలకు ఇచ్చింది గోరంత అయితే, దాన్నికూడా గవర్నర్ ప్రసంగంలో గొప్పగాచెప్పారు. వైఎస్సార్ పింఛన్ గురించి కూడా పచ్చి అబద్ధాలే చెప్పించారు. 300యూనిట్ల విద్యుత్ అని, నాలుగుచక్రాల వాహనం ఉందని, ఇన్ కంట్యాక్స్ కడుతున్నారని ఎప్పటినుంచో ఉన్న 5లక్షల పింఛన్లకు ప్రభుత్వం కోతపెట్టింది. కానీ గవర్నర్ ప్రసంగంలో ఆఊసే లేదు. విభజనచట్టం కాలపరిమితి 10నెలల్లో ముగుస్తున్న తరుణంలో గవర్నర్ ప్రసంగంలో ప్రభు త్వం ఎక్కడా ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. 4ఏళ్లలో ఒక్కరూపాయికూడా వైఎస్సార్ కల్యాణ మస్తు పథకంకింద అర్హులకు అందలేదు.
కానీగవర్నర్ ప్రసంగంలో ఆ పథకం బ్రహ్మండంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వర్గానికి చెందినవారిని కీలకపదవుల్లో నియ మించి, నిధులు విధులు, కుర్చీలులేని పదవులుబీసీలకు ఇవ్వడమే జగన్ అమలుచేస్తున్న సామాజిక న్యాయం. ఆసామాజికన్యాయం గొప్పగా ఉన్నట్టు గవర్నర్ తో అబద్ధాలు చెప్పిం చారు. రైతులు నానాఅవస్థలుపడుతుంటే, పండించిన పంటఉత్పత్తులు కూడా అమ్ముకోలేక విలపిస్తుంటే, రైతుసంక్షేమం గొప్పగా ఉన్నట్లు గవర్నర్ తో చెప్పించారు. రైతుభరోసా కేంద్రా లు రైతుభక్షక కేంద్రాలుగా మారితే, అవే గొప్పగాపనిచేస్తున్నట్టు గవర్నర్ తో చెప్పించారు. అలానే వైఎస్సార్ జలకళ పథకంకింద రాష్ట్రంలో ఎక్కడా ఒక్కబోర్ కూడావేసింది లేదు. ఇరిగే షన్ ప్రాజెక్ట్ ల పనితీరు నత్తనడక కంటే అన్యాయంగాఉంది. టీడీపీప్రభుత్వం పోలవరాన్ని 72శాతంపూర్తిచేస్తే, 4ఏళ్లలో జగన్ 2శాతంకూడా పూర్తిచేయలేదు. 2021, 2022, 2023 అంటూ తేదీలుమారుస్తూ, అబద్ధాలు చెబుతున్నారుగానీ, అవగింజంతకూడా పనిజరగడం లేదు. స్వయంగా కేంద్రజలశక్తి మంత్రే పోలవరంప్రాజెక్ట్ ను ఏపీప్రభుత్వం ఎన్నికలనాటికి పూర్తిచేయలేదని తెగేసిచెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అటకెక్కించిన జగన్, గవర్నర్ ప్ర సంగంలో మాత్రం అంతా బాగుందని చెప్పించారు. ప్రభుత్వం రాసిచ్చిన అబద్ధాలుచదవలేక గవర్నర్ చాలాసార్లు తడబడ్డారు.”
జగన్ రైతుల్ని ఉద్ధరిస్తే, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో 3వస్థానంలో ఎందుకు ఉంది?: గోరంట్ల బుచ్చయ్యచౌదరి
3వేలమంది ఎందుకు ప్రాణాలు పోగోట్టుకున్నారు? రాష్ట్ర జీడీపీ7శాతంకూడా లేకపోతే, 14శాతం ఉన్నట్టు అబద్ధాలు చెప్పించారు. అప్పుల కోసమే జీడీపీని పెంచారు. “గవర్నర్ ప్రసంగంలో కూడా ముఖ్యమంత్రి పేర్లపిచ్చి, రంగులపిచ్చే బయటపడింది. జగనన్న, వైఎస్సార్ పేర్లుతప్ప గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కొత్తపదాలు లేవు. నాతో ఇన్ని అబద్ధాలు, అవాస్తవాలు చెప్పించారా అని గవర్నర్ కూడా ఇంటికెళ్లాక బాధపడతారు. కొత్తగా వచ్చారు..రాష్ట్రం గురించి, ప్రభుత్వం గురించి తెలుసుకోవడానికి ఆయనకు కొంతసమయం పడుతుందని తాముకూడా సంయమనంతో వ్యవహరించాము. గవర్నర్ ప్రసంగం మొత్తం ప్రభుత్వం రాసిచ్చింది కాబట్టే తాము నిరసన వ్యక్తం చేశాము. దిశాయాప్ గురించి కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఇంకోసంవత్సరంలో ఇంటికెళ్లే ముఖ్యమంత్రి, రాబోయే 5ఏళ్లగురించిచెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎవరైనా ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా? రైతులకు, వ్యవసాయరంగానికి ఈ ప్రభుత్వం చేసింది శూన్యం. కేవలం అప్పులకోసమే ప్రభుత్వం జీడీపీ 14శాతం ఉన్నట్లు అబద్ధాలు చెప్పింది. వాస్తవంగా 7శాతంకూడా లేదు. కేపిటల్ వ్యయం ఎక్కడాఖర్చుపెట్టలేదు. ప్రజలసొమ్ము ఖర్చుపెట్టి చట్టసభలు నిర్వహిస్తున్నప్పుడు ఆ సభల్లో చెప్పే అంశాలు కాస్తైనా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా!
కేంద్ర ప్రభుత్వం రైతుభరోసా కిందఇస్తున్న సాయాన్ని తానే ఇస్తున్న ట్టు జగన్ సొంతడబ్బాలు కొట్టుకుంటున్నాడు. 80లక్షల మంది రైతులుంటే, కేవలం 52లక్ష లమందికి మాత్రమే రైతుభరోసా కింద అరకొరసాయంచేస్తున్నారు. అదికూడా ఒకరైతుకి ఒక సంవత్సరం ఇస్తే, మరోసంవత్సరం ఇవ్వడంలేదు. 4ఏళ్లలో రాష్ట్రంలో3వేలమంది రైతులు ఆత్మహత్యచేసుకున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీదేశంలోనే 3వస్థానంలోఉంది. కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వస్థానంలోఉంది. అయినా సిగ్గులేకుండా ప్రభుత్వం అబద్ధాలే చెబుతోంది. పనికిమాలిన ముఖ్యమంత్రి రైతుల్ని ఉద్ధరిస్తే, వారుఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఎక్కడైనా అమలవుతోందా? గవర్నర్ తో ప్రభుత్వంచెప్పించిన అంకెలన్నీకూడా వాస్తవవిరుద్ధాలే. జగనన్న ఇళ్లపట్టాలపేరుతో ప్రభుత్వంఇచ్చిన పట్టాలెన్ని.. కొన్నభూమిఎంత…ఎంతధరకుకొన్నది? ఇళ్లపట్టాలిచ్చి ఇళ్లు కట్టాల్సిందే అంటే పేదలు ఎలాకడతారు? నీళ్లు, కరెంట్ రోడ్లులేని ప్రాంతాల్లో స్థలాలిచ్చి ఇళ్లుకట్టాల్సిందే అంటూ వాలంటీర్ల తో బెదిరిస్తున్నారు. చంద్రన్నబీమాను ఎందుకు రద్దుచే శారు? అన్నక్యాంటీన్లు ఎందుకు మూసేశారు? రాయలసీమరైతులకు చంద్రబాబు అందించి న డ్రిప్, ఇతరయంత్రపరికరాల్ని ఎందుకు ఆపేశారు? తుంగభద్రపై కర్ణాటక అక్రమప్రాజెక్ట్ లు నిర్మిస్తుంటే జగన్ చోద్యంచూస్తున్నాడు. గవర్నర్ త్వరలో రాష్ట్రపర్యటనచేస్తేనే ఆయనకు వాస్తవాలు బోధపడతాయి. వైసీపీప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఒక్కరోడ్డుకూడా వేసింది లేదు. కానీ రోడ్లవేసినట్టు, అన్నీ బ్రహ్మండంగాఉన్నట్టు గవర్నర్ తోచెప్పించారు. విశాఖలో పరిశ్రమల సమ్మిట్ పేరుతో షోచేశారు. రాష్ట్రంలోని విద్యుత్ఉత్పత్తిఎంత..రాష్ట్రానికి అవసర మైన విద్యుత్ ఎంతనేది తెలియకుండానే ఒప్పందాలుచేసుకున్నారు. రాష్ట్రాన్ని జగన్ ప్రభు త్వం ఆర్థికంగా దివాళాతీయించి, నేరాంధ్రప్రదేశ్ గా మార్చారు. గవర్నర్ రాష్ట్రంలో జరుగుతు న్న పరిణామాలను ఆకళింపుచేసుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలి”
40రోజులు నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలు 5, 10రోజులకే పరిమితం చేయడం బాధాకరం : బెందాళం అశోక్
“చివరి బడ్జెట్ అయిన ఈ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో నేడు ప్రారంభమ య్యాయి. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం అభూతకల్పనలు, అవాస్తవాలే. డైనమిక్ ముఖ్యమం త్రి అని ఏ గవర్నర్ దేశచరిత్రలో ఎన్నడూ ప్రస్తావించిందిలేదు. అభివృద్ధి ప్రస్తావనలేకుండా, లేని సంక్షేమంతో ప్రజల్ని మభ్యపెట్టేలా ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని తయారుచేసింది. అమరావతి, పోలవరం ప్రస్తావనలేదు. బడ్జెట్ సమావేశాలు అంటే కనీసం 40 నుంచి 45 రోజులు జరగాలి. కానీ జగన్ ప్రభుత్వం తూతూమంత్రంగా 5, 10రోజులకే పరిమితం చేయడం దుర్మార్గం.”