-పట్టభద్రుల ఎన్నికల్లో అక్రమాలు పట్టవా?
-అధికార పార్టీకి కొమ్ముకాసిన అధికారులపై చర్యలేవీ?
-ఈ ఎన్నికలు ఓ కేస్ స్టడీగా తీసుకోండి
-కేంద్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలు, బోగస్ ఓట్లు, ఎలక్షన్ అధికారుల అధికార దుర్వినియోగంపై సమగ్ర వివరాలతో 7 పేజీల లేఖ రాసిన టీడీపీ అధినేత. 2019 తరువాత తిరుపతి లో జరిగిన పలు ఎన్నికలలో అక్రమాలను సమగ్రంగా వివరిస్తూ లేఖ. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాడు జరిగిన ఉల్లంఘనలు కూడా లేఖలో గుర్తు చేసిన చంద్రబాబు. తిరుపతి ఎన్నికల అక్రమాలను కేస్ స్టడీ గా తీసుకుని స్టడీ చెయ్యాలని….2019 తరువాత జరిగిన వివిధ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి లేఖలో కోరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. నాటి ఎన్నికల అక్రమాలపై మా ఫిర్యాదుల ఆధారం గా అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని లేఖలో పేర్కొన్న చంద్రబాబు. లేఖతో పాటు అక్రమాలకు ఆధారాలుగా ఉన్న వీడియోలు, డాక్యుమెంట్లు, మీడియా కథనాలు లేఖకు జత చేసిన టీడీపీ అధినేత.
లేఖలో పేర్కొన్న అంశాలు:-
• ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగాయి.
• అధికార YSRCP ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించింది.
• గత ఎన్నికల్లో వైసీపీ చేసిన బోగస్ ఓట్ల నమోదు, ప్రత్యర్థి అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, బూత్ క్యాప్చర్, రిగ్గింగ్ పై ఫిర్యాదులు చేశాం.
• తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కి 2021 మార్చి 10 న జరిగిన ఎన్నికల్లో అధికార YSRCP ఎన్నికల అధికారులతో కలిసి చేసిన అవకతవకలపై నాడే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
• zptc, mptc ఎన్నికల్లో గతం లో ఎప్పుడూ లేని విధంగా ఏకగ్రీవాలు అయ్యాయి.
•ఈ స్థాయి ఏకగ్రీవాలకు కారణం అధికార పార్టీ దౌర్జన్యాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం అని నాటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కేంద్రానికి లేఖ రాశారు.
• అనంతరం జరిగిన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు, సహా పలు చట్టవిరుద్ధమైన ఘటనలకు అధికార వైసీపీ నేతలు పాల్పడ్డారు.
• ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తిరుపతి పట్టణంలో అధికార వైఎస్సార్సీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులతో కుమ్మక్కై అనేక అక్రమాలకు పాల్పడింది.
• తిరుపతి పట్టణాన్ని కేస్ స్టడీగా తీసుకుని అధికార పార్టీ అక్రమాలను పరిశీలించాలని కోరుతున్నా.
• తిరుపతి పట్టభద్రుల ఎన్నికల్లో 9వ తరగతి విద్యార్హత కలిగిన విజయ అనే మహిళ పోలింగ్ బూత్ నెం. 223 లో పట్టభద్రుల ఎన్నికల్లో బోగస్ ఓటు వేశారు
• తిరుపతి సంజయ్‌గాంధీ కాలనీలో డిగ్రీ విద్యార్హత లేని పలువురు ఆటోడ్రైవర్లు బోగస్ ఓట్లతో వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
• మీడియా ఇంటర్వ్యూలలో తాము పట్టభద్రులు కాదని…తమను వేరే వారు పంపితే ఓటు వేయడానికి వచ్చామని స్వయంగా ఓట్లరే చెప్పారు.
• ఎన్నికల అధికారులు సరైన ధృవీకరణ లేకుండానే బోగస్/నకిలీ ఓటర్లను నమోదు చేశారు.
• తిరుపతిలో ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు, గెజిటెడ్ అధికారులు వైఎస్సార్సీ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్ధితో కలిసి నకిలీ సర్టిఫికెట్లతో బోగస్ ఓట్లు సృష్టించారు.
• వైసిపి కార్యాలయం చిరునామాతో 21 బోగస్ ఓట్లు, ఖాళీ ప్రాంతం చిరునామాతో దాదాపు 30 బోగస్ ఓట్లు నమోదయ్యాయి.
• డోర్ నెం. 14-6-406 అడ్రస్ తో చికెన్ దుకాణం ఉంటే ఆ అడ్రస్ తో 16 ఓట్లు నమోదయ్యాయి.
• ఒక్క తిరుపతి పట్టణంలోనే 7 వేలకు పైగా బోగస్ ఓట్లు నమోదయ్యాయి. దీనిపై తిరుపతి ఎన్నికల అధికారి వెంకట్రమణా రెడ్డి ఫిర్యాదులు ఇచ్చాం.
• మా అభ్యంతరాలు ఉన్నప్పటికీ బోగస్ ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకున్నారు.
• తిరుపతి పట్టణంలో విస్తృతంగా అవకతవకలు జరిగినప్పటికీ జిల్లా ఎన్నికల అధికారి వెంకటరమణారెడ్డి 229, 233 రెండు పోలింగ్ స్టేషన్లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు.
• పలు ప్రాంతాల్లో మా పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపి, చట్టవిరుద్ధంగా నిర్బంధించారు.
• వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన అనుచరులు అక్రమంగా పోలింగ్ బూత్‌ల్లోకి ప్రవేశించారు.
• దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మా పార్టీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ని అరెస్టు చేశారు.
• బోగస్ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన టీడీపీ నేత నర్సింహ యాదవ్, అతని అనుచరులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
• పోలింగ్ పూర్తయ్యే వరకు వారిని అక్రమంగా పోలీసు కస్టడీలో ఉంచారు.
• ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ ఏజెంట్ పులిగోరు మురళి ని అక్రమంగా అరెస్టు చేసి పోలింగ్ పూర్తి అయ్యేవరకు పోలీసు కస్టడీలో ఉంచారు.ఇది పూర్తిగా చట్ట విరుద్దమైన చర్య.
• పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించలేదు. దీంతో వైసిపి గూండాలు మా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ను బెదరించారు
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం సైతం ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని సీఈవో ఆంధ్రప్రదేశ్‌కి, భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
• ఆయన చెప్పినట్టుగానే పోలింగ్ రోజున సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసులు మూగ ప్రేక్షకుల్లా వ్యవహరించారు.
• ఇలాంటి అవకతవకలకు నాడు తొలిదశలో ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని ఉంటే, నేడు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఇంత అక్రమాలు జరిగేవి కావు.
• BLO లనుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
• తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తిరుపతి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలి.
• ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన తిరుపతిలో వైసీపీ నేతలు తమ అక్రమాలతో, హింసతో శాంతియుత వాతావరణాన్ని నాశనం చేశారు.
• ఈ నేపథ్యంలో 2024లో తిరుపతి పట్టణంలో జరిగే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
•ఎన్నికల విధులు నుంచి ఉపాధ్యాయులను తప్పించి వేరే వారితో వారితో ప్రయత్నాలు చేస్తోంది.
• ఇప్పటి వరకు ఎన్నికల్లో జరిగిన ఈ అక్రమాలను, ఘటనలను తీవ్రమైన అంశాలుగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
• లేకుంటే ఇది ప్రజాస్వామ్యానికి చేటు