– నారా లోకేష్
సీఎం వైఎస్ జగన్ రెడ్డిని విపక్షాలే కాదు, సొంత పార్టీలో అసమ్మతి నేతలు సైతం సైకో అంటుంటాయి. ఎందుకంటే చేసే పనులన్నీ సైకోలా ఉంటాయని. సైకో జగన్ సైకో పనులకి ఈ ఫోటోయే సాక్ష్యం. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తీసిన సెల్ఫీ ఇది. తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్త కోట లో టిడిపి హయాంలో రూ.50 లక్షల నిధులతో మైనారిటీలకు ఉపయోగపడుతుందని షాదీ మహల్ నిర్మించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక సీఎం శాడిస్టు మెంటాలిటీని సంతృప్తి పరచడానికి ఇదిగో ఇలా బులుగు రంగులు వేసి, తాళం వేశారు. తన పార్టీ రంగు వేశారన్న పైశాచిక ఆనందం, టిడిపి హయాంలో కట్టినది ఉపయోగపడకుండా చేశానన్న శాడిజం ఇందులో కనిపిస్తోంది. రాష్ట్రమంతా ఇదే విధ్వంసం, ఇదే సైకోయిజంతో జగన్ సర్వనాశనం చేశారు.