– రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ ను కేంద్రం ఆమోదించడం సంతోషకరం
– చేనేత పై విధించించిన జీఎస్టీ ను పూర్తిగా రద్దు చేయాలి
– బుంకర్ యోజనా ను పునః ప్రారంభించాలి
– పెండింగ్ లో ఉన్న చేనేత క్లస్టర్ లను వెంటనే మంజూరు చేయాలి
– రాష్ట్రానికి IIHT మంజూరు చేయాలి
– శాసనమండలి సభ్యులు ఎల్.రమణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ ను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమని శాసనమండలి సభ్యులు ఎల్.రమణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు అయిన సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనల్లో ఉన్న సమయంలో నాటి ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు చేనేత ప్రధాన కేంద్రంగా ఉన్న పోచంపల్లిలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను సందర్శించి, అక్కడి ప్రజల నుండి భిక్షాటన చేసి బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచారని రమణ తెలిపారు.
తెలంగాణా రాష్ట్రంలో లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన అజాంజాహి మిల్లు గతంలో మూత పడిందని, అక్కడ పని చేసిన కార్మికులతో పాటు, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాకు చెందిన నేత కార్మికులు రాష్ట్రంలో పని లేక భీవండి, సోలాపూర్, అహ్మదాబాద్, సూరత్ తదితర ప్రాంతాలకు వలసపోయారని, ఇవన్నీ చూసి చలించిపోయిన కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేత కళాకారుల కొరకు భారతదేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి, చేనేత మరనేత వృత్తిలో ఉన్న వారికి అనేక ప్రోత్సాహకాలు అందించారని కొనియాడారు. చేనేత జౌళి శాఖ ను స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షిండటం వల్ల వస్త్ర పరిశ్రమ కొరకు ప్రత్యేకంగా తెలంగాణ టెక్స్టైల్ అప్పారల్ (T-TAP) పాలసీ ని తీసుకువచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్నారు.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కేంద్ర జౌళి శాఖ, ఆర్ధిక శాఖ మంత్రులను కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా కలిసి, లేఖల ద్వారా అనేక పర్యాయములు తెలంగాణ రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ బాధ్యతగా మూతపడ్డ అజాంజాహి మిల్లు స్థానంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని సంకల్పించి, వరంగల్ జిల్లాలో 1200 ఎకరాలు భూమి సేకరించి శంఖుస్థాపన చేసి అంతర్జాతీయంగా పేరుగాంచిన కైటెక్స్ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టారని కొనియాడారు. ఇదే కాకుండా ఎన్నో దేశీయ పరిశ్రమలు తమ వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వస్త్ర పరిశ్రమలోని ఉపాధి అవకాశాలు చూసి గత శతాబ్ది కాలంలో వలస వెళ్లిన ఇక్కడి నేతన్నల తిరిగి రాష్ట్రానికి వస్తున్నారని, వారికి ఇక్కడే జీవనోపాది లభిస్తుండటంతో మరి ఎంతో మంది ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్టైల్ పార్క్ కు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇవ్వాలని ఎన్నో సార్లు ప్రయత్నించిన మంత్రి కేటీఆర్ కృషి ఎట్టకేలకు ఫలించి, మెగా టెక్స్టైల్ పార్క్ కొరకు నిధులు విడుదల చేస్తామని స్వయంగా ప్రధాని ప్రకటించడం సంతోషకరమని అన్నారు.
కానీ చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విడిస్తున్న 5 శాతం జీఎస్టీ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత క్లస్టర్ లను మంజూరు చేసి చేనేత కళాకారుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయాలని అన్నారు. రద్దు చేసిన హ్యాండ్లూమ్ బోర్డ్ ను పునర్డుద్దరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిరోధక చర్యలు చేపడుతున్నప్పటికి నూతన పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి వీలుగా రాష్ట్రంలో అనేక చోట్ల మినీ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తూ, వలస కార్మికులను వెనక్కు రప్పిస్తూ నేత వృత్తి ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేత వృత్తిలో ఉన్న వారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని సూచించారు.