Suryaa.co.in

Andhra Pradesh

యాడ్స్ కోసం బాబు రూ.449 కోట్లు ఖర్చు చేశారు..

-ఒక్క ఈనాడుకే రూ.120 కోట్లు
–ఇప్పటివరకు రూ.128 కోట్ల ప్రకటనలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం
డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశాం
-మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్

యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు.రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారు రెండో స్థానంలో ఉన్న సాక్షి పేపర్‌కు కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారు. సర్కులేషన్ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారు. గత ప్రభుత్వం యాడ్స్ ఇవ్వటంలో పూర్తిగా పక్షపాత ధోరణి అవలంబించింది. గత ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారు. ఆ ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశాం

LEAVE A RESPONSE