– తీవ్ర ఆందోళనలో బిజెపి శ్రేణులు!!!
రాహుల్ గాంధీ అనర్హత వార్త చూసి నిజంగా నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను…. రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు జడ్జి పైన…. అనర్హత వేసిన సీనియర్ I A S అధికారి అయిన లోక్ సభ సెక్రటరీ జనరల్ పైన పిచ్చి కోపం వచ్చింది. భారతదేశం ఇప్పటివరకు ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని చూడలేదు. రాహుల్ గాంధీ వల్లనే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక అజేయ శక్తిగా అనుకున్న దానికంటే తక్కువ కాలంలో రూపొందింది. నా దృష్టిలో నరేంద్ర మోడీ తరువాత…. బిజెపి ఘన విజయాలకు ప్రధాన కారణం రాహుల్ గాంధీయే.
తన అపరిపక్వ వ్యక్తిత్వంతో… అర్థంపర్థం లేని ప్రసంగాలతో…. పిచ్చి బిత్తిరి చూపులతో…. అహంకారపూరితమైన చర్యలతో… బిజెపిని ఇంతగా పటిష్టం చేసిన రాహుల్ గాంధీకి జాతీయ వాదులంతా తీవ్రంగా రుణపడి ఉన్నారు అనేది నా భావన. రాహుల్ గాంధీ శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నాయకుడిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ జైల్లో ఉండడం వల్ల బిజెపికి తీవ్ర నష్టం. బిజెపి వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ భారత్ తోడో లాంటి యాత్రలతో… దేశమంతట పర్యటించి తన వెర్రి ప్రసంగాలు చేయవలసినదే.
అదేవిధంగా లోక్ సభలో నరేంద్ర మోడీని ఆకస్మాత్తుగా కౌగిలించుకోవడం లాంటి వింత చర్యలతో దేశ ప్రజలందరినీ రాహుల్ గాంధీ తప్ప మరెవరు రంజింప చేస్తారు? సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు కచ్చితంగా బిజెపి నాయకులు అప్పీల్ కు వెళ్ళవలసిందే. లోక్ సభ స్పీకర్ కూడా రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించి దేశ ప్రజలకు అద్భుతమైన వినోదాన్ని అందించవలసినదిగా రాహుల్ గాంధీ నిజమైన అభిమానిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
దేశ ప్రధాని పదవి ఆశిస్తున్న సోనియా గాంధీ కుటుంబం వారసుడు రాహుల్ గాంధీ ఇలా ఈ దేశానికి ధర్మానికి సంస్కృతి సంప్రదాయానికి భాషకు వారసుడుగా కాకపోవడం చేత భాషలో ఉన్న సున్నితత్వం మాటలు వాక్యాలు లో ఉన్న భావ ఆవేశం అర్థం కాకపోవడం చేత సంబంధ బాంధవ్యాలు అర్థం కాకపోవడం చేత పరాయి భాష భావజాలంతో పెరగడం చేత విదేశీ సంస్కారం చేత ఈ విధంగా అభాసుపాలు అవుతున్నాడు. దొంగల ఇంటి పేరు అంతా మోడీ అని ఎందుకు ఉంటుంది? అని మాట్లాడిన రాహుల్ గాంధీ ఒక్క నరేంద్ర మోదీ నీ కాకుండా ప్రధానిని కాకుండా మొత్తం మోదీ పేరుతో గల అన్నికుటుంబ వ్యక్తులను అవమానపరిచాడు. ప్రధాని మోదీ గారిని దొంగల పక్కన చేర్చి అవమానపరిచాడు. ఇంతటి భావావేశాన్ని అర్థం చేసుకోలేని సున్నిత తత్వాన్ని అర్థం చేసుకోలేని రాహుల్ గాంధీ ఎవరో రాసిన స్క్రిప్ట్ ని తనకు తానుగా చదివే ఇలా కోర్టు శిక్షకు గురి అయ్యాడు.
చట్టం దృష్టిలో దోషిగా నిలబడ్డాడు శిక్ష కు గురి అయ్యాడు. అంతటికీ మూలం స్వధర్మాన్ని అతను స్వీకరించకపోవడమే. భారతీయ మూలాలు అర్థం కాకపోవడమే! తను ఈ జాతి లో మమేకం అయితే సత్యం అర్థం అయ్యేది. ఈ దేశ ప్రజల ఆకాంక్షలు అర్థమయ్యేవి వారి సంస్కృతి సంప్రదాయాలు అర్థమయ్యేవి అప్పుడు ఇటువంటి అల్ప మాటలు అతని నోట వెలువడేది కాదు. అందరి చేత ఇలా దూషిగా నిలబడే వాడు కాదు. ఇలా కోర్టు ముందు దూషిగా శిక్షకు గురి అయ్యేవాడు కాదు. అందుకే మాతృభాష లో మాత్రమే విద్యను అందించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే స్పష్టమైన అవగాహన ఆ విద్య పట్ల విద్యార్థులకు కలుగుతుంది. దోషములు కలుగకుండా సమాజ ఉన్నతికి ఆ విద్య కృషి చేస్తుంది. ఇది రాహుల్ గాంధీ విషయంలో స్పష్టం అవుతూ ఉంది.

(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )