-ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ లో వెళ్తున్నాడు జగన్
-సింగడు అద్దంకి వెళ్ళాడు…వచ్చాడు అన్నట్టు ఉంది జగ్గడి ఢిల్లీ యాత్ర
-సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. ఇప్పుడు అయ్యా అందరూ విడివిడి గా పోటీచేయ్యండి అని అడ్డుక్కునే పరిస్థితి
-లక్ష కోట్లు ప్రజాధనం దొబ్బి జైలుకి వెళ్ళలేదు
-బాబాయ్ ని చంపిన చరిత్ర నాకు లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి
-ఇచ్చిన ప్రతి హామీ గుర్తుచేసి రోడ్డు మీద నిలబెడతా
-వైసిపి పాలనలో దళితులను చంపడానికి స్పెషల్ లైసెన్స్
-రాప్తాడు కి 5గురు ఎమ్మెల్యేలు
-ఎన్నికల్లో సొంత ఇళ్లు లేదు అని ఏడ్చిన వాళ్లకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు?
-అభివృద్ధి లో సునీతమ్మ స్పీడ్ అందుకోవడం ఎవరి వల్లా కాదు
-రాప్తాడు నియోజకవర్గం పైదిండి బహిరంగ సభ లో నారా లోకేష్
లక్ష్మి నరసింహ స్వామి కొలువైన ప్రాంతం రాప్తాడు. పెన్నా నది రాష్ట్రంలోకి ప్రవేశించే పవిత్ర ప్రాంతం ఇది. బంగారు గనులు, బంగారం లాంటి మనుషులు ఉన్న ప్రాంతం రాప్తాడు. భూస్వాముల ఆదీనంలో ఉన్న భూముల్ని పేదలకు పంచారు పరిటాల శ్రీరాములు. ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించింది పరిటాల రవీంద్ర.పరిటాల రవీంద్రను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దింది ఈ రాప్తాడు ప్రాంతం. ఎంతో చరిత్ర ఉన్న రాప్తాడు లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం గా భావిస్తున్నాను. జగన్ ది పరదాల యాత్ర…మీ లోకేష్ ది ప్రజా యాత్ర. ఏ తప్పూ చెయ్యలేదు కాబట్టే నేను ధైర్యంగా కాలర్ ఎగరేసి తిరుగుతున్నాను. తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు కాబట్టే ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ లో వెళ్తున్నాడు జగన్.
యువగళం దెబ్బకి జగన్ వారానికో సారి ఢిల్లీ పరిగెడుతున్నాడు. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు, సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. ఇప్పుడు అయ్యా అందరూ విడివిడి గా పోటీచేయ్యండి అని అడ్డుక్కునే పరిస్థితికి వచ్చాడు. అది యూత్ పవర్. అధికారమదంతో మాట్లాడిన జగన్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుండు కొట్టారు. ప్రజలు. పాదయాత్ర అడ్డుకోవడానికి జగన్ పోలీసుల్ని పంపిన రోజే చెప్పా సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని. నేను లక్ష కోట్లు ప్రజాధనం దొబ్బి జైలుకి వెళ్ళలేదు, బాబాయ్ ని చంపిన చరిత్ర నాకు లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ చేసా.పాదయాత్ర లో ఊరికో కేసు పెట్టుకున్నారు అంతకు మించి పీకింది ఏమి లేదు.ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ గళం ఆగదు ప్రశ్నిస్తూనే ఉంటా. పాదయాత్ర లో ముద్దులు పెట్టి ఇప్పుడు పారిపోతా అంటే నేను ఊరుకుంటానా ఇచ్చిన ప్రతి హామీ గుర్తుచేసి రోడ్డు మీద నిలబెడతా.
సింగడు అద్దంకి వెళ్ళాడు…వచ్చాడు అన్నట్టు ఉంది జగ్గడి ఢిల్లీ యాత్ర. ఒక్క సారి కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. రాజ్యసభ, లోక్ సభ లో కలిపి 31 మంది ఎంపిలు ఉన్నారు. కేసుల కోసం తప్ప ప్రత్యేక హోదా గురించి జగన్, ఆయన ఎంపిలు ఏ రోజూ పోరాడలేదు. రాష్ట్ర ప్రయోజనాలు నిల్లు. సొంత ప్రయోజనాలు మాత్రం ఫుల్లు. నిన్నే చూసాం.. ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎం చేసారో. ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆయన తగ్గలేదు. రోడ్డు మీద కుర్చీ వేసుకొని దమ్ముంటే రండి తేల్చుకుందాం అంటూ జగన్ కే సవాల్ విసిరారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జగన్ పనైపోయింది అని చెప్పడానికి.ఒక్క ఛాన్స్ ఇచ్చిన అందరినీ ముంచేసాడు జగన్.
ఈయన అబద్దాలు చాలా స్వీట్ గా చెప్పేస్తాడు. అందుకే ఈయన్ని ముద్దుగా అబద్దాల మోహన్ అని పిలుస్తా. అబద్ధాల మోహన్ అని ఎందుకు అంటున్నానో ఉదాహరణలు కూడా చెబుతా. జాబ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న రాష్ట్రాన్ని అబద్దాల మోహన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది. ఆఖరికి తిరుమల వెంకన్న సన్నిధిలో గంజాయి అమ్ముతున్నారు. వైసిపి నాయకులు వ్యవసాయం మానేసి గంజాయి పొలాల్లో పండిస్తున్నారు. నిన్నే గురజాల లో వైసిపి నాయకుడి పొలంలో గంజాయి పండిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. అబద్దాల మోహన్ ఆంధ్రప్రదేశ్ ని అప్పులప్రదేశ్ గా మార్చేసాడు. అభివృద్ధి నిల్లు…అప్పులు ఫుల్లు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి కియా, టీసీఎల్, హెచ్సిఎల్ లాంటి పెద్ద సంస్థలు వచ్చాయి.అబద్దాల మోహన్ హయాంలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ వచ్చాయి. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి, ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నాడు అబద్దాల రెడ్డి.
ఆయన దగ్గర రెండు బటన్స్ ఉంటాయి. ఒక బటన్ నొక్కగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీ అకౌంట్ లో 10 రూపాయిలు పడతాయి. అదే బల్ల కింద ఇంకో బటన్ ఉంటుంది అది నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయిలు జగన్ ఖాతాలోకి వెళ్లిపోతాయి. కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్1. ఇంటి పన్ను రెట్టింపు చేసాడు, చెత్త పన్ను వేసాడు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. అబద్ధాల మోహన్ ఎవరినీ వదిలి పెట్టలేదు యువత, మహిళలు, రైతులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు అందరినీ మోసం చేశాడు. యువత భవిష్యత్తును నాశనం చేసాడు అబద్దాల మోహన్.జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.మహిళల్ని మోసం చేసాడు అబద్దాల మోహన్. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. రైతు రాజ్యం తెస్తానన్న అబద్దాల మోహన్ రైతులు లేని రాజ్యం తెచ్చాడు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3.
జగన్ పరిపాలన లో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి.రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. డ్రిప్ ఇరిగేషన్ ని నిర్వీర్యం చేసింది వైసిపి ప్రభుత్వం. టిడిపి హయాంలో ఎస్సీ,ఎస్టీ లకు ఉచితంగా, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ అందించాం. కానీ ఇప్పుడు జగన్ డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని నిర్వీర్యం చేసి రాయలసీమ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశారు. ఉద్యోగస్తులను వదిలిపెట్టలేదు అబద్దాల రెడ్డి.వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు.పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు.
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు అబద్దాల రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు.బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది.డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికి శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. అబద్ధాల మోహన్రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడు. ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. అన్నమయ్య గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు.
హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కియా కారు చూస్తే చంద్రబాబు గుర్తొస్తారు. వేసుకునే డ్రాయర్ చూస్తే జగన్ తన్ని తరిమేసిన జాకీ కంపెనీ గుర్తొస్తుంది. రాప్తాడు ఎమ్మెల్యే పేరు తోపుదుర్తి. ప్రకాష్ రెడ్డి. ఆయన అభివృద్ధి లో వీకు..అవినీతి లో తోపు.అందుకే ఆయనకు నేను ముద్దుగా దోపిడీదుర్తి. ప్రకాష్ అని పేరు పెట్టా.ఏ నియోజకవర్గానికైనా ఒక్క ఎమ్మెల్యే నే ఉంటారు. కానీ రాప్తాడు కి మాత్రం 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దోపిడీదుర్తి. ప్రకాష్ అయన తండ్రి గారు, ఇద్దరు బ్రదర్స్, ఇంకో లేడి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రాప్తాడు వీళ్లకి మంచి పేస్ట్రీ కేకులా దొరికింది. 5 ముక్కలుగా కోసుకొని తినేస్తున్నారు.
ఎన్నికల ముందు ఇళ్లు అమ్ముకొని రాజకీయం చేస్తున్నాం అన్నారు. ఈ నాలుగేళ్లలో వీళ్ల అవినీతి సంపాదన ఎంతో తెలుసా? వెయ్యి కోట్లు.దోపిడీదుర్తి కుటుంబం అధికారంలోకి రాగానే కొంత మంది పోలీసుల్ని పార్ట్నర్స్ గా చేర్చుకొని రైతులను, రియల్ ఎస్టేట్ వారిని బెదిరించి వందల ఎకరాలు దోచేసారు. రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లో ఎక్కడ ఏ లేఔట్ వేయాలన్నా ఈ దోపిడీదుర్తి కుటుంబానికి కప్పం కట్టాల్సిందే. ఎకరానికి 10 లక్షలు వసూలుచేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా ఈ కుటంబం భూకబ్జాలు చేసింది. చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ రైతు తన భూమి వీరికి భూమి అమ్మలేదని పొలంలో ఉన్న మామిడి చెట్లు మొత్తం రాత్రికి రాత్రి నరికేశారు. అంటే ఇది ఎంత దారుణమైన కుటుంబమో అర్ధం చేసుకోండి. ఎమ్మెల్యే అన్న రాజారెడ్డి అనంతపురం టౌన్ లో కోటి రూపాయలు విలువైన మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించాడు.అనంతపురం సిటీకి ఆనుకొని ఉన్న ఉప్పరపల్లి అనే గ్రామంలో పది ఎకరాల వంక పోరంబోకు భూమిని ఎమ్మెల్యే అన్న తోపుదుర్తి చందు అనుచరులు కబ్జా చేశారు. ఈ భూమి విలువ 30 కోట్లు.
రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, కంకర దందా మొత్తం దోపిడీదుర్తి కుటుంబానిదే. ఆఖరికి ట్రాన్స్ పోర్ట్ కి కూడా వాళ్ళ టిప్పర్లే వాడాలని బెదిరిస్తారు. దోపిడీదుర్తి కుటుంబానికి ఒక దోపిడీ కంపెనీ ఉంది దాని పేరు రాక్రిట్. అనంతపురంలో 9 వేలు, గుంటూరు, కృష్ణా లో వేల ఇళ్లు నిర్మించే కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఎన్నికల్లో సొంత ఇళ్లు లేదు అని ఏడ్చిన వాళ్లకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? ఇళ్ళ నిర్మాణానికి పునాది వేస్తే 70 వేల రూపాయలు బిల్లు చెల్లిస్తారు. అయితే రాక్రిట్ సంస్థ 10 వేల రూపాయల్లో అత్యంత నాసిరకంగా పునాది నిర్మించి 70 వేల రూపాయలు బిల్లు తీసుకున్నారు. రాక్రీట్ సంస్థ నిర్మిస్తున్న ఇళ్లు చిన్నపిల్లాడు బలంగా తంతే పడిపోయేంత నాసిరకంగా ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కృష్ణ, గుంటూరు జిల్లాలో రాక్రీట్ సంస్థకు అప్పగించ పనులను రద్దు చేశారు. ఇళ్ల నిర్మాణం లో దోపిడీదుర్తి కుటుంబం కొట్టేసిన సొమ్ము ఎంతో తెలుసా 280 కోట్లు.
టిడిపి హయాంలో జాకీ పరిశ్రమ రాప్తాడుకి తీసుకొచ్చాం. దోపిడీదుర్తి కుటుంబంజాకీ కంపెనీని 15 కోట్లు కప్పం కట్టాలని బెదిరించింది. ఆ దెబ్బకి జాకీ వేరే రాష్ట్రానికి పారిపోయింది.పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదు. రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలించి దోచుకుంటున్నారు.ఇక్కడ ఉన్న మహిళా ఎమ్మెల్యే గారి దోపిడి మరో రకం. తోపుదుర్తి సహకార డైరీ పేరుతో మహిళల నుండి డ్వాక్రా సొమ్ము 10 కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బుతో డైరీ ఏర్పాటు చేస్తూ సొంత సొమ్ము తో ప్రజల్ని ఉద్దరిస్తున్నట్టు చూపిస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అమ్మను వద్దనుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. అభివృద్ధి లో సునీతమ్మ స్పీడ్ అందుకోవడం ఎవరి వల్లా కాదు. ప్రతిపక్షంలో ఉన్నా సునీతమ్మ ప్రజలు, రైతులకు అండగా పోరాటం చేసారు.టిడిపి హయాంలో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం 5 వేల కోట్లు ఖర్చు చేసాం. 804 కోట్లతో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు కాలువ త్రవడంతో పాటు పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసాం.
హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి, నియోజకవర్గంలోని 45 చెరువులకు, 120 చెక్ డ్యామ్ లకు సాగునీరు ఇవ్వడం జరిగింది.రోడ్లు, ప్రభుత్వ భవనాలు, కాలేజీలు అన్నీ టిడిపి హయాంలో కట్టినవే.టిడిపి హయాంలో నియోజకవర్గంలో రోడ్లు వెయ్యడానికి కేటాయించిన 46 కోట్ల విలువైన పనులను కూడా కమిషన్ కక్కుర్తితో ఆపేసింది దోపిడీదుర్తి కుటుంబం. నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య తీర్చేందుకు ప్రతి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు చేస్తాం. పాదయాత్రలో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే జీడిపల్లి పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తాం అన్నారు. పుట్టకనుమ రిజర్వాయర్ ను క్యాన్సిల్ చేసి దానికి స్థానంలో తోపుదుర్తి, ముట్టాల, దేవరకొండ జలాశయాలకు శంకుస్థాపనకు చేశారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని.. రాప్తాడును కోనసీమలా మారుస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికాడు. శంకుస్థాపన చేసి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఒక్క ఎకరా భూ సేకరణ కూడా పూర్తి చేయలేదు.
పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేయడంతో పాటు సోమరవాండ్లపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందిస్తాం.నియోజకవర్గంలో రైతులను గాలికొదిలేసింది దోపిడీదుర్తి కుటుంబం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోలేదు. టమాటో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్కెటింగ్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమని అడిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. చీనీ, టమోటా, వేరుశనగ రైతులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఆదుకుంటాం. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన వారిని వదిలిపెట్టను. వచ్చే ఎన్నికల్లో టిడిపి ని భారీ మెజారిటీ తో గెలిపించండి. నియోజకవర్గం సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటాను.