-ఒక్క మిషన్ ఉండాల్సిన చోట.. ప్రైవేటు మిషన్లు ఎలా వచ్చాయి?
-అధికార పార్టీ అనుచరులు మిషన్లు పెట్టీ లారీ 3వేల చొప్పున అమ్ముతున్నారు
-రోజుకు 600 లారీల బూడిద తోలకం
-ఏపీ జెన్ కో మిషన్లు మాత్రమే ఉండాలి
-దీనిపై ముఖ్యమంత్రికి లేఖలు రాస్తా
-ఏపి జన్ కో ఎండీ పై తీవ్ర ఆగ్రహం
-ఎన్‌టీటీపీఎస్ ఫ్లయాష్ అక్రమ రవాణా ప్రదేశాన్ని పరిశీలించిన ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు
ప్రజా అవసరాల కోసం ఎన్‌టీటీపీఎస్ నుండి వచ్చే బూడిద ను స్థానిక గ్రామాల ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి.ఇక్కడ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే లు మాఫియా నడుపుతున్నారు.
ఏపీ జెన్ కోను తెరవెనుక నడిపిస్తున్నవారు ఎవరో తేలాలి.గతంలొ ఉచితంగా ఇచ్చే యాష్ ను ఈ నాలుగేళ్లుగా అమ్మకాలు చేస్తున్నారు.
నవయుగ, మెగా కు ఇచ్చిన పనులను ఆసరాగా చేసుకుని అధికార పార్టీ లో కొంతమంది రాబంధులు యాష్ తోలకం మొదలు పెట్టారు. ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ యాష్ వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు.బాధితులుగా ఉన్న వీరందరికీ ఉచితంగా ఇవ్వాల్సి ఉన్నా రాబంధులు అమ్ముకుంటున్నారు.ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్ కు ఈ సమాచారం ఇచ్చినా స్పందన లేదు. ఒక్క మిషన్ ఉండాల్సిన చోట.. ప్రైవేటు మిషన్లు ఎలా వచ్చాయి. ఆరు వందల లారీలు పెట్టి యధేచ్చగా యాష్ తోలుతున్నారు.ఇంత జరిగినా జెన్ కో ఎండి ఎందుకు స్పందించరు.అధికార పార్టీ నేతలు సిఫార్సు లతో పెట్టిన మిషన్ లు తొలగించాలి.
ఈ యాష్ వల్ల ఎనిమిది గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు పై సిఎం కు లేఖ రాస్తాను.జెన్ కో ఎండి శ్రీధర్ కు కూడా మరోసారి సమాచారం ఇస్తాను.జెన్ కో వాళ్ల ది తప్ప.. మిగతా అన్ని మిషన్లు తీసేయాలి. ఎప్పటి నుంచో ఉన్న వారికి మాత్రమే యాష్ తోలుకునే అవకాశం ఇవ్వాలి. ప్రైవేటు మిషన్లు పూర్తిగా గా తొలగించాలి. లేదంటే కేసులు పెట్టాలి.లక్ష రూపాయలు డిపాజిట్ అనే విధానం తొలగించాలి.
అధికార పార్టీ నేతల ఒత్తిడి కి అధికారులు లొంగొద్దు.. ఇబ్బందులు పడొద్దు. అధికార పార్టీ అనుచరులు మిషన్లు పెట్టీ లారీ 3వేల చొప్పున అమ్ముతున్నారు.రోజుకు 600 లారీల బూడిద తోలకం జరుగుతుంది. లారీలు అధికంగా తిరగడం ద్వారా ఊరి ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు. ఏపీ జెన్ కో మిషన్లు మిషన్ మాత్రమే ఉండాలి.కానీ ఇక్కడ బయట వ్యక్తుల మిషన్లు పనులు చేస్తున్నాయి.ఏపి జెన్ కో ఎండి శ్రీధర్ నిద్రపోతున్నారు. దీనిపై జెన్ కో ముఖ్యమంత్రికి లేఖలు రాస్తాను.