– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
– ఏపి యువజన కాంగ్రెస్ పోస్ట్‌కార్డుల ఉద్యమం ప్రారంభం
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని, అదానీకి దోచిపెట్టడంలోనూ, రాహుల్ గాంధీ పై వేటు వేసి సస్పెన్షన్ చేయడంలోనూ పోస్ట్ కార్డ్ ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నంలో ఈ చర్య చేపట్టామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు.ఎస్.ఆర్.ఆర్ Ê సి.వి.ఆర్ కాలేజ్ వద్ద యువతీ యువకుల చేత ప్రధాని మోదీని హెచ్చరిస్తూ పోస్ట్ కార్డులు ప్రారంభించారు.
ఏఐసిసి కార్యదర్శి మరియు ఏపి వ్యవహారాల బాధ్యులు సి.డి.మెయ్యప్పన్, ఏఐసిసి కార్యదర్శి జె.డి.శీలం, ఏపిసిసి కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, వి.గురునాధం, పీటర్ జోసఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమంలో ఉపాధ్యక్షులు పవన్ తేజ, శ్రీనివాస సందీప్ పవన్, రామ్ సింగ్, సుశీల్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.