– యువనేతకు ఎస్ కె యూనివర్సిటీ విద్యార్థుల సంఘీభావం
-సమస్యలపై లోకేష్ కి ఎఐఎస్ఎఫ్ ప్రతినిధుల వినతిపత్రం
• రాప్తాడు సమీపంలోని ఎస్ కె యూనివర్సిటీ వద్ద ఎఐఎస్ఎఫ్ కు చెందిన విద్యార్థులు యువనేత లోకేష్ కు సంఘీభావం తెలిపి, తమ సమస్యలు విన్నవించారు.
• రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 5045 బోధన, బోధనేతర పోస్టులు భర్తీచేయాలి.
• విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుచేసి పాతపద్ధతిలోని ఆయా యూనివర్సిటీల పరిధిలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలి.
• పిజి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దుచేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన జిఓ నెం.77ని రద్దుచేసి పాత ఫీ రీఎంబర్స్ మెంట్ విధానాన్ని తీసుకురావాలి.
• రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.38 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. కరోనా కారణంగా 2019-21 నడుమ విద్యార్థులకు హాజరుశాతం తగ్గింది.
• ఈ సాకుతో విసి రామకృష్ణారెడ్డి 400మంది విద్యార్థులను డిటైన్ చేశారు.
• డిటైన్ చేసిన విద్యార్థులను యథావిధిగా కొనసాగించి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలి.
• అర్హతలు లేకుండా విసిగా నియమితుడై నియంతలా వ్యవహరిస్తున్న విసి రామకృష్ణారెడ్డిని రీకాల్ చేయాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ….
• రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో సొంత మనుషులను జొప్పించి ఉన్నత విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారు.
• జిఓ నెం.77తో పిజి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దుచేసి రాష్ట్రవ్యాప్తంగా 50వేలమంది పేదవిద్యార్థులకు జగన్ అన్యాయం చేశారు.
• పీజీ విద్యార్థులకు గొడ్డలిపెట్టులా మారిన జిఓ నెం.77ను రద్దుచేసి పాత ఫీ రీఎంబర్స్ మెంట్ ను పునురుద్దరిస్తాం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాలతో సంబంధం లేని ఉన్నత విద్యావంతులను విసిలుగా నియమిస్తాం.
• విద్యార్థులు వివిధ పోటీపరీక్షలకు శిక్షణ తీసుకునేందుకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తాం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం.
• కరోనా సమయంలో హాజరుశాతం లేక డిటైన్ కు గురైన విద్యార్థుల అడ్మిషన్ పునరుద్దరించి పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తాం.