వేల కోట్ల ఫామ్ హౌస్ లు, భూములు ఎక్కడి నుండి వచ్చే?
33 జిల్లాలలో కొత్తగా విద్యాలయాలు రాలే
100 పడకల దావఖానలు రాలే
33 జిల్లాల లో పార్టీ ఆఫీస్ లు ఎట్లా వచ్చే?
ఎవ్వరో చావు నోట్లో తలకాయ పెడితే రాలేదు తెలంగాణ. పాయకానలో ఇడ్లీ తింటే రాలేదు తెలంగాణ. ప్రతి రోజు ఉద్యమానికి ఊపిరి పోయడాని ఒంటికి అగ్గి పెట్టు కోని కాగడై మండినారు విద్యార్థులు యువకులు. ఒక్క పూట అన్నం తినకుంటే వచ్చిందా తెలంగాణ? విద్యార్థులు -ఉద్యోగులు- కళాకారులు- సకల జనులు- సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే వచ్చింది తెలంగాణ! ఒక్క అమరుల కుటుంబాన్ని చట్ట సభలకు తీసుక పోయారా? ఇది అన్యాయం కాదా? వారి కుటుంబాలకు న్యాయం జరిగిందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల మందమైన ఉద్యోగాలు ఇవ్వ లేదు కదా?
రైతు బంధు అని కేవలం ఓట్లు దండు కోవడానికి ఎకరాకు 10వేలు ఇచ్చి, వందల వేల ఎకరాలు ఉన్న సంపన్నులను మేపినారు. కౌలు రైతుకు ఎలాంటి ఆదరణ లేదు. పంటకు గిట్టు బాటు ధర లేదు. ఎస్సీ ల వద్ద ఉన్న అసైన్డ్ భూమి గుంజుకునే ధరణి తెచ్చి అనుభవ దారు కాలం తీసి వేసి పేద రైతుల భూములను దొరల పాలు చేసే గ్రామ పంచాయితీ లేఅవుట్లు ఇల్లీగల్ అని, ఆంధ్ర కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలలో భాగస్వాములై, వారి సంస్థలు లాభాలలో నడిచేలా చేసి తెలంగాణ రియల్టర్స్ పొట్ట కొడితిరి.
ఫ్రీలాంచ్ ఆపర్స్ తో వారు మందిని ముంచ బట్టే. అమ్ముడు పోయే గుణం ఉన్న మీడియాను కొని, నిజాలను పాతర వేసి పదే పదే అబద్ధాలను చెప్పబట్టే. నిజాలు చెప్పే మీడియా పై కఠిన చర్యలు, అక్రమ నిర్బంధాలు సంకెళ్లు వేయబట్టే. ఉద్యమ ద్రోహులను సంకన ఎత్తుకునే . భూములు కొల్లగొట్టే ఘనులు ఇచ్చిన కాసిన్ని ఉద్యోగాలు అమ్ముడు పోయే.
కరెంటు చార్జీలు పెరిగే ఇంటి పన్ను పెరిగే నల్లా ఛార్జీలు పెరిగే.బస్ ఛార్జీలు పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే. పేద వాడు- మధ్యతరగతి వాడు -ఒక గెజిటెడ్ ఆఫీసర్ కూడా ఇల్లు కొనలేని పరిస్థితి దాపురించే. భూముల ధరలు ఇండ్ల ధరలు చుక్కల పైన ఉండే.
మరి గీ పాలించే వాళ్లకు వందల కోట్ల ప్యాలెస్ లు ఎట్లా వచ్చే? వేల కోట్ల ఫామ్ హౌస్ లు, భూములు ఎక్కడి నుండి వచ్చే? కోట్ల ఖరీదు చేసే కార్లు, ఆకాశంలో తిరిగే విమానాలు ఎక్కడ నుండి వచ్చే? 33 జిల్లాలలో కొత్తగా విద్యాలయాలు రాలేదు. 100 పడకల దావఖానలు రాలేదు. 33 జిల్లాల లో పార్టీ ఆఫీస్ లు ఎట్లా వచ్చే?
ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీ చేస్తుంటే అరి కట్టేది పోయి, కరోనాలో కూడా 10% ఫీజు లు పెంచ్చు కొమ్మని ఆనతి ఇచ్చే. ఇక ప్రైవేటు వైద్య సంస్థలు. వామ్మో వాటి పేరు వింటేనే బయ్యం . లక్షలు కోట్లు కావాలి . రోగం వస్తే,దిక్కు లేక ఎలుకలు కరిసే ప్రభుత్వ ధావఖాన కే పోవుడాయే.
అందుకే మళ్ళీ ఓట్లు వస్తున్నాయి ఓటు అమ్ము కోకుండ , నిజాయితీగా నిజాయితీపరులకు వేయండి. గండు పిల్లి కండ్లు వేసుకొని, కొందరు చెంచాలు వీడు యేం రాసిండో అని మిట మీట కండ్లు కొట్టు కుంటు చదువుతారు.