14 ఏళ్ళ నీ పాలనలో ఒక్క పేదవాడినైనా ధనవంతుడ్ని చేశావా బాబూ..?
– ధనవంతుల్ని చేసే ఆ విజనే ఉంటే.. మరి ఎందుకు చేయలేకపోయావ్?
– చంద్రబాబే… ఒక ముసలి సైకో..
– పేదలకు రూ. 2 లక్షల కోట్లు పంచిన జగన్ అనర్హుడా.. పేదలను పట్టించుకోని నీవు అనర్హుడివా..?
– ఎవరో పార్టీ పెడితే లాక్కున్న చంద్రబాబు సమర్థుడా.. ఒంటరిగా పార్టీ పెట్టి 151 సీట్లు గెలిచిన జగన్ సమర్థుడా?
– నీ పని అయిపోయింది బూబూ… ఇక సర్ధుకో…
– ఎన్ని సోది మీటింగులు పెట్టినా.. జగన్ దరిదాపుల్లోకి కూడా రాలేవు
– దుష్టచతుష్టయం అంతా ఒక వైపు… 5 కోట్ల మంది ప్రజలు జగన్ వైపు
– చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ షో…
– కేసులు పెడితే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు కోడెల
– కోడెల ఆత్మహత్యకు కారణం నూటికి నూరుపాళ్లూ చంద్రబాబే..
: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
బాబు సభ అట్టర్ ప్లాప్..
చంద్రబాబునాయుడు రాష్ట్రమంతా తిరుగుతూ నిన్న సత్తెనపల్లి వచ్చాడు. ఆయన పచ్చ మీడియా అంతా చాలా అద్భుతంగా ప్రజలు వచ్చారని రాసున్నారు. కొన్ని చానళ్లయితే సత్తెనపల్లి గర్జించిందన్నారు. ఆడబిడ్డలు సైతం పోరాటానికి మద్దతు పలికారన్నారు. నా జన్మ ధన్యమైందని చంద్రబాబు పెద్ద ఉపన్యాసం కూడా ఇచ్చాడు. ఇదంతా ఎందుకంటే.. సభ ఫెయిల్ కావడంతో, కనీసం టీవీల్లో చూసే వారికైనా సక్సెస్ అయ్యింది అని చెప్పే ప్రయత్నం చేశారు. నిన్నటి చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ షో
ఇక్కడ ఐదారుగురు సీట్లు ఆశించే కృష్ణులు ఉన్నారు.. వాళ్లందరూ పోగు చేస్తే వచ్చిన జనం మూడు వేల మంది మాత్రమే. చంద్రబాబు సభకు అనుమతి ఇచ్చిన మైదానంలో 15 వేల నుంచి 20 వేల మంది పడతారు. దాన్ని కుదించి చుట్టూ ఫ్లెక్సీలు కట్టి…చిన్న స్థలంలోకి జనాన్ని తీసుకొచ్చారు. తోలిన జనంతో కూడా గ్రౌండ్ నిండని దౌర్భాగ్యమైన పరిస్థితి. దీన్ని బట్టి ఈ సభ సక్సెస్ అయ్యిందా లేదా అనేది ప్రజలు గమనించాలి. ఒకప్పుడు విఠలాచార్య ఉండేవాడు..ఇప్పుడు రాజమౌళి వచ్చినట్లున్నాడు.. వాళ్ల దగ్గర నేర్చుకున్నట్లున్నాడు… చిన్న ప్రదేశంలో సభ పెట్టి 50 వేల మంది వచ్చినట్లు చెప్పుకునే టెక్నాలజీని చంద్రబాబు కనుక్కున్నాడు. ఇదీ చంద్రబాబు ఖర్మ.. సత్తెనపల్లిలో జనం రాక వెలవెల బోయిన పరిస్థితి కనిపించింది.
రాజకీయాలకు బాబు అర్హుడా..?:
చంద్రబాబు తన ప్రసంగంలో ఒక్క నిజమైనా చెప్తాడేమో అని ఎదురుచూశా.. కానీ అన్నీ పచ్చి అబద్దాలే చెప్పాడు.చంద్రబాబు నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుందని ఆనాడే దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ గారు చెప్పారు.జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో అనర్హుడా..? నువ్వు అర్హుడివా..? కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి.. ఎవరో పార్టీ పెడితే ఆ పార్టీని లాక్కున్న నువ్వు రాజకీయాలకు అర్హుడివా..?. అసలు రాజకీయాలకు చంద్రబాబు, ఆయన కొడుకు అర్హులు కానేకారు. తండ్రి చనిపోయిన తర్వాత తన రెక్కల కష్టంతో పార్టీ పెట్టి.. దేశంలో యోధానుయోధులను ఎదిరించి, 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్రెడ్డి గారితో మీకు అసలు పోలిక లేదు. వయసుడిగిన, చేవ చచ్చిన చంద్రబాబును ముసలోడు అంటే వాళ్ల నాయకులకు పొడుచుకొస్తుంది. ఏం చంద్రబాబు నాయుడు ముసలివాడు కాదా.. ఆ ఫీలయ్యే జిల్లా అధ్యక్షుడు ముసలివాడు కాదా..?చంద్రబాబు, రంకెలేసే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నేనూ అందరం ముసలివాళ్లమే. ముసలివారిని ముసలివాడు అంటే ఎందుకు బాధ పడుతున్నారు
చంద్రబాబే… ఒక ముసలి సైకో..:
అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కి, ఎవడి చంక పడితే వాడి చంక నాకే రాజకీయ సైకో చంద్రబాబు.మోడీని తిడతాడు..అమిత్‌షా వస్తే రాళ్లేయిస్తాడు…బీజేపీని సర్వనాశనం చేస్తానని, ఎన్డీఏ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని.. దేశమంతా తిరిగాడు. మళ్లీ నిన్న ఓ నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో మోడీ కాళ్లు పట్టుకుంటాను అంటున్నాడు. కమ్యూనిస్టులను తిడతావు..మళ్లీ వారితోనే జత కలుస్తాడు. పవన్ కళ్యాణ్‌ని తిట్టాడు.. ఆయనతోనూ జతకట్టాడు. ఇలా, ఎవరినైనా తిడతాడు.. ఎవరితోనైనా జతకడతాడు.. ఎందుకంటే, కేవలం నీ అధికారం కోసమనేది ప్రజలకు బాగా అర్థమైంది. అందితే జుట్టు..అందకపోతే కాళ్లు అనే నైజం చంద్రబాబుది. నీకన్నా సైకో ఈ రాష్ట్రంలో ఎవరున్నారు.. నువ్వొక ముసలి సైకోవి. నువ్వు, నీ కొడుకు అధికారం లేకపోతే బతకలేరు. అధికారం కోసం ఎవరి చంకైనా నాకడానికి వెనుకాడని సైకోవి నువ్వ. రూ. 2 లక్షల కోట్లు పేదలకు ఇచ్చినందుకు జగన్ గారు అనర్హుడా..? సైకోనా..?
14ఏళ్ళు అధికారంలో ఉండి ఏ పేదవాడిని ధనవంతుడ్ని చేశావ్?:
పేదవాళ్లను ధనవంతులను చేయడానికి చంద్రబాబు వద్ద మంత్రం ఉందట. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ పేదవాడిని ధనవంతుడిని చేశాడో చెప్పాలి. చంద్రబాబు తన కొడుకును ధనవంతుడిగా చేశాడు.. ఆయనకు సంబంధించిన వ్యక్తులను ధనవంతులను చేశాడు. ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశావా.?
కోడెల ఆత్మహత్యకు కారణం నూటికి నూరుపాళ్లు చంద్రబాబే:
కోడెల శివప్రసాదరావు చంద్రబాబు కంటే టీడీపీలో సీనియర్ నాయకుడు. కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి..ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి.అనేక ఫిర్యాదులు వచ్చాయి.. చట్టప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నం చేశాము. ఇందులో దాపరికం ఏమీ లేదు.. ఇదేమన్నా అక్రమమా..అన్యాయమా..? కేసులకు భయపడి కోడెల ఆత్మహత్య చేసుకున్నాడనడం కన్నా పచ్చి ఆబద్ధం మరొకటి లేదు… కోడెల శివప్రసాద్ కేసులకు భయపడిపోయి.. చచ్చిపోయేంత పిరికివాడు మాత్రం కాదు. ఆయన ఉరి వేసుకోడానికి ప్రధాన కారణం నారా చంద్రబాబునాయుడు.కోడెలకు పార్టీ నుంచి ఆదరణ లేదు..చంద్రబాబు అపాయింట్ మెంటు కూడా ఇవ్వలేదు..కోడెల ముఖమే చూడనని చంద్రబాబు అన్నాడు. దీనికంటే ముందు కోడెల శివప్రసాద్ ఒకసారి, మత్తు మాత్రలు మింగి మరణించాలని చూసి, సేవ్ అయ్యాడు. కొంతమంది టీడీపీ నేతలు.. కోడెల ఆత్మహత్యాయత్నం చేశాడు.. మీరు పలకరిస్తే బాగుంటుంది అంటే ససేమిరా అన్నది చంద్రబాబే కదా.. నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చినా, నా పార్టీ నన్ను సపోర్టు చేయడం లేదని మరణమే శరణ్యమని కోడెల అనుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకోడానికి నూటికి నూరు పాళ్లు చంద్రబాబే కారణం. నిజంగా నీకు కోడెల కుటుంబంపై ప్రేమ, అభిమానం ఉంటే రేపు నీ నిర్ణయాలు వారికి అనుకూలంగా ఉంటాయేమో చూద్దాం.కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొక కాదు. స్వర్గస్తుడైన కోడెలపై నేను ఇతర విమర్శలు చేయదలుచుకోలేదు.
గుండెల మీద చేయివేసి చెప్తున్నా.. నీకన్నా నీతిమంతుడినే:
ఏమయ్యా ముసలోడు అంటేనే నీకు కోపం వచ్చిందే…నేను అంబోతునా..?నీ రాజకీయ జీవితం అంతా ఆంబోతులకు ఆవులను సప్లై చేయడం తప్ప మరొకటి లేదు.ఇంకా నాపై చాలా ఆరోపణలు చేశాడు.. నేను ఏం చేస్తున్నానో నా నియోజకవర్గ ప్రజలకు తెలియదా..? నేను శాసనసభ్యుడు కాకముందు సత్తెనపల్లిలో కనీసం అపార్ట్మెంటు కూడా కట్టుకోలేని పరిస్థితి నేను వచ్చిన తర్వాత అపార్ట్‌మెంటులు కట్టుకుంటున్నారు.. రియల్ ఎస్టేట్ పెరిగింది. గుండె మీద చేయివేసుకుని చెప్తున్నా… నీకన్నా, నీ కొడుకు కన్నా, కోడెల శివప్రసాద్ కన్నా నేను నీతిమంతుడిని. ఎవరికి అన్యాయం జరగకూడదని, టీడీపీ వారికి కూడా మేలు జరగాలని భావించే సంస్కార వంతమైన వ్యక్తిని నేను.
బాబు తెలివితక్కువతనం వల్లే పోలవరం ఆలస్యం:
డయాఫ్రం వాల్ అంటే ఏమిటో తెలియదని చంద్రబాబు ఆరోపించాడు. పోలవరం కుంటుపడటానికి కారణం ఎవరో ప్రజలకు తెలియాలి. వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక కుంటుపడిందా..? చంద్రబాబు చేసిన తెలివి తక్కువతనం వల్ల కుంటుపడిందా అనేది చర్చ జరగాలి. డయాఫ్రం వాల్ అనేది ప్రధాన ఆనకట్టకు పునాది లాంటిది.. టీడీపీ హయాంలో కాఫర్ డ్యాం నిర్మాణం లేకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేశారు.దానివల్ల వరద వచ్చి కాఫర్‌డ్యాం గ్యాప్ నుంచి డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దీనిపై రెండేళ్లు రీసెర్చ్ చేసి అక్కడి సమస్యను తీర్చాలంటే రూ. 2,022 కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది నీ తప్పిదం వల్ల జరిగితే దాన్ని మాపై వేయాలని చూస్తున్నాడు. పుట్టుకతోనే డయాఫ్రం వాల్ గురించి నాకు తెలియదు.. మంత్రి అయ్యాక తెలుసుకున్నాను. చంద్రబాబు ఉంటే పోలవరం పూర్తయ్యేది అంటున్నాడు.ఆయన హయాంలో 2012–13 ధరల ప్రకారం పూర్తి చేస్తానని కేంద్రంతో చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఆ ధరలతో అవుతుందా అనేది కనీస ఆలోచనలేదు.కనకపు సింహాసనం మీద శునకం మాదిరిగా.. చంద్రబాబు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. ఆయన ఎన్ని జిల్లాలు తిరిగినా.. రాష్ట్ర ప్రజలు ఆయన్ను నమ్మరు. ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి పడిపోతున్న తన గ్రాఫ్‌ను పెంచుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. నేను అన్నీ ఊడదీశానని లోకేశ్ అంటున్నాడు.. మరి ఆయన ఎప్పుడు చూశాడో..? పిచ్చి మాటలు మాట్లాడితే నేను కూడా బాబూ కొడుకులిద్దరికీ వారి భాషలోనే సమాధానం చెప్పగలను.నిన్న చంద్రబాబు పర్యటనలో మాత్రం వైన్ షాపుల ఆదాయం మాత్రం పెరిగింది.మందు, చీరెలు ఇస్తే గానీ జనం రాని నీ ఖర్మ ఏంటో తెలుసుకో చంద్రబాబూ..అదే జగన్ వస్తే జనం కిటకిటలాడతాడు..
ఇక సర్దుకో…చంద్రబాబూ…:
అయిపోయింది నీ పని…ఇక సర్దుకో చంద్రబాబూ… ఎన్నికల తర్వాత చాప సర్దుకుని హైదరాబాద్ వెళ్లాల్సిందే . ఈ రాష్ట్రంలో నిన్ను నమ్మి ప్రజలు మోసపోయారు. ఇక నిన్ను నమ్మే పరిస్థితి లేదు..అందుకే సర్దుకో చంద్రబాబూ.. అంటున్నాం. నువ్వు ఎన్ని మీటింగులు పెట్టినా జగన్ దరిదాపుల్లోకి రావడం కూడా నీవల్ల కాదు.జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో నిలిచిన వ్యక్తి. పేద ప్రజల దేవుడు డాక్టర్ వైఎస్సార్ కుమారుడు.. ఎప్పటికీ ప్రజలు మర్చిపోని విధంగా పరిపాలన చేస్తున్నాడు.ప్రజలకు ఎప్పుడూ దయ్యాలు పట్టవు…చంద్రబాబుకే దయ్యాలు పడతాయి- చంద్రబాబుకు పట్టిన దయ్యం ఎప్పటికీ వదలదు. కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణలకు కూడా వెళ్లవద్దని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు. కొండమోడు–పేరేచర్ల రోడ్డు అవ్వాలంటే చంద్రబాబు రావాలట- ఇప్పటికే ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆ రోడ్డు విషయంలో కేంద్రంతో అన్ని అనుమతులు తెచ్చారు.. ఎంపీ సహకారంతో నేడో రేపో టెండర్లు కూడా పిలవబోతున్నారు.ఆ రోడ్డు మా హయాంలోనే పూర్తవుతుంది..అన్ని అంచనాలతో పాటు కేంద్రం నుంచి అనుమతులన్నీ తెచ్చారు.
నీ తమ్ముడు ఎక్కడ బాబూ..?:
నా తమ్ముడు చంద్రబాబుకు కనిపించడం లేదట. నా తమ్ముడు, అల్లుడు, నా కూతుళ్లు ఎన్నికలప్పుడు వచ్చారు…ప్రచారం చేశారు. నేను అన్ని ఇళ్లు తిరగలేను కాబట్టి వాళ్లు సాయంగా వచ్చారు- మళ్లీ ఎన్నికలొస్తే వాళ్లందరూ వస్తారు. నా త.మ్ముడు కనిపించకపోవడం చిదంబర రహస్యమట…మరి నీ తమ్ముడికి నీకు ఉన్న చిదంబర రహస్యం ఏమిటో చెప్పు. నీ తమ్ముడు ఎక్కడా కనిపించడం లేదేమి..? ఆయన ఎమ్మెల్యేగా చేశాడు..నీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరాడుగా.ఇప్పుడు ఎందుకు కనిపించకపోవడంలో చిదంబర రహస్యం ఏమిటో చెప్పాలి. ఐదు లక్షల చెక్కు వస్తే రెండున్నర లక్షల కమిషన్ అడిగానని ఆరోపించావు. నీ మాదరిగా పేదల డబ్బుల కోసం కక్కుర్తి పడే వ్యక్తిని కాదు చంద్రబాబూ..
పవన్‌ని విమర్శిస్తే నీకు బాధ ఎందుకో..?:
నన్ను, పవన్ కళ్యాణ్‌ని ఇక్కడున్న మంత్రి తిడుతుంటాడు అని చంద్రబాబు అన్నాడు అసలు పవన్ కళ్యాణ్‌కి నీకేంటయ్యా సబంధం..? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి..? ఆయనేమో బీజేపీతో పొత్తులో ఉన్నాడు.. నువ్వేమో నేను పవన్‌ని విమర్శిస్తున్నానని నన్ను విమర్శిస్తున్నావ్ మీ వెనుక ఉన్న లోపాయికారీ ఒప్పందాలు, మీ బండారం ఏమిటో అర్ధమవుతుంది కదా. ఐదు కోట్ల మంది ప్రజలు జగన్ వైపున ఉన్నారు.. మీ దుష్ట చతుష్టయం మరోవైపు ఉన్నారు. అదే జరగబోయే ఎన్నికల యుద్ధం. ఆ ఐదుగురు చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక వైపు ఉన్నారు. పులివెందులలో గెలిచే ముఖమేనా మీది…నీ సభలకు వస్తున్న జనమే నీ దుస్థితికి నిదర్శనం.