-మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం
-సొంత మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుండి రుణాలు కూడా ఇవ్వడం లేదు
-చేనేతలు అధికంగా ఉన్న ధర్మవరంలో 55 మంది ఆత్మహత్య చేసుకున్నారు
-ఎమ్మిగనూరులో చేనేత కార్మికులను కలిసి ఇబ్బందులు అడిగి తెలుసుకున్న నారా లోకేష్
యువగళం పాదయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని సొసైటీ కాలనీలో చేనేత కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మగ్గాలను పరిశీలించి, ప్రభుత్వం నుండి వస్తున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికురాలు కామర్తి జయశ్రీ మాట్లాడుతూ…సొంత మగ్గం లేక కూలీకి వచ్చి చేస్తున్నా. సొంత మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుండి రుణాలు కూడా ఇవ్వడం లేదు.ఉచిత విద్యుత్ అందిస్తే బాగుంటుంది. మగ్గంతో వచ్చే కూలీతో ఇళ్లు కూడా గడవడం లేదు.అందువల్లే బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ పెట్టుకున్నా.క్లస్టర్ ఏర్పాటు చేస్తే సంక్షేమ పథకాలు మాకు నేరుగా అందుతాయి. టీడీపీ హయాంలో 300 వచ్చే విద్యుత్ బిల్లు ఇప్పుడు 800 వస్తోంది.గ్యాస్ ధర, నిత్యవసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేసింది.
దానితో స్పందించిన నారా లోకేష్… గతంలో మేము యార్న్, రంగులు, పట్టుకు సబ్సీడీ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతల కోసం ఎక్కువ మంది ఉన్నచోట వర్క్ షెడ్లు ఏర్పాటు చేస్తాం. చేనేత ను ఆదుకోవడం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తాం. మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం.
కుల వృత్తులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. చేనేతలు అధికంగా ఉన్న ధర్మవరంలో 55 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం పరిహారం రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.ఆప్కో ద్వారా గతంలో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేతలకు ఆదుకున్నాం.చేనేతలకు ఏం చేస్తే బాగుంటుందో నాకు బాగా అవగాహన ఉంది..అధికారంలోకి రాగానే చేస్తాం.అని హామీ ఇచ్చారు.