– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
తన అవలక్షణాలను ఎదుటివారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజం. దోచుకో పంచుకో తినుకో అనే దోపిడీకి నిలువెత్తు రూపం జగన్ రెడ్డి. విశాఖలో 40వేల కోట్ల విలువైన భూములను దోచుకున్నారు. నాడు ఉచిత ఇసుక నేడు భకాసురుల్లా బొక్కేస్తున్నారు. రూ.10వేల కోట్లు దోచుకున్నారు. నాసిరకమైన మద్యాన్ని ప్రజలపై రుద్దుతూ.. రూ.41 వేల కోట్లు మింగేశాడు. గనులు దోచేస్తున్నారు.. కొండలు కొల్లగొడుతున్నారు.. భూములు స్వాహా చేస్తున్నాడు. దొరికినదంతా దోచుకుంటూ.. రాష్ట్రాన్ని గుల్ల చేస్తూ.. ప్రతిపక్షాలపై నిందలేయడం అలవాటైపోయింది. దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారు.
పోలవరం నాశనం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిర్వీర్యం చేశాడు. విశాఖ స్టీల్ స్లాంట్ అమ్మకానికి పరోక్షంగా సహకరిస్తున్నాడు. విశాఖ రైల్వే జోన్ లేదు. బోగాపురం ఎయిర్ పోర్ట్ భూముల్లో 500 ఎకరాలు కొట్టేయడానికి రిజర్వ్ చేసుకున్నాడు. రుషికొండను బోడిగుండు చేశాడు. పోర్టులను ధారాదత్తం చేస్తున్నారు. జీవో నెం.3 ద్వారా ఆదీవాసీల ప్రయోజనాలకు గండి కొట్టాడు. విద్యుత్ ప్లాంట్ల పేరుతో 75వేల ఎకరాల ఆదివాసియుల భూముల కబ్జాకు తెరలేపారు. ఈరకంగా జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర ద్రోహిగా మారారు.
పేదలకు రూ.10 ఇచ్చి.. రూ.100 కొట్టేస్తున్నాడు. రూ.6 లక్షల కోట్లు అప్పు చేసి 4 ఏళ్లల్లో రూ.2 లక్షల కోట్లే డీబీటీకి ఇచ్చారు. మిగిలిన రూ.4 లక్షల కోట్లు ఏమయ్యాయి. చంద్రబాబు నాయుడు పన్నులు, ఛార్జీలు, ధరలు పెంచకుండా తక్కువ బడ్జెట్ ఉన్నా మూడేళ్లలో సంక్షేమానికి రూ.2లక్షల కోట్లు ఖర్చు చేశారు. జగన్ రెడ్డి పన్నులు, ఛార్జీలు, భారాలు వేసి నాలుగేళ్లలో రూ.2లక్షల కోట్లు ఇచ్చాడు. అమ్మఒడి రూ.13వేలు.. నాన్న బుడ్డీ రూ.72 వేలు కోట్టేశారు. నాశిరకం మద్యంతో మహిళల మాంగళ్యాలు తెంచుతున్నారు. డ్రైవర్లకు రూ.10వేలు ఇచ్చి పోలీసులు, ఆర్టీవోల జరిమానాలు, మద్యం రేట్లు డీజిల్ రేట్లు పెంచి రూ.లక్ష కొట్టేస్తున్నారు. ప్రశ్నిస్తున్నాడని బాబాయ్ గొడ్డలివేటును గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తల్లి, చెల్లిని తరిమేసిన నీకంటే పెత్తందారుడు ఎవరుంటారు జగన్ రెడ్డి.