– ఎమ్మెల్యే వంశీ, అనుచరులపై డిజిపి కార్యాలయంలో, స్థానికి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సాయి కల్యాణి
– నన్ను, నా కుటుంబంపై వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, ప్రాణహాని కల్గించేలా బెదిరిస్తున్నారు : సాయి కల్యాణి
హనుమాన్ జంక్షన్: కృష్ణా జిల్లా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు సామాజిక మాధ్యమాల ద్వారా తనను బెదిరిస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, ప్రాణహాని కల్గించేలా భయపెట్టడం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేతో పాటు, రాచేటి రూతమ్మ, ఓలుపల్లి రంగా, వెలగపల్లి ప్రదీప్లలు ద్వేషపూరితంగా, నేర పూర్వకంగా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి, యార్లగడ్డ సూచిత్ర, ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళ నాయకురాలు, వడ్డీ వాసవి మరియు స్థానిక నాయకులతో కలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లోనూ, వ్యక్తిగతంగా మంగలగిరిలోని డీజీపీ కార్యాలయంలోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించినట్లు కల్యాణి తెలిపారు.