• వసతిదీవెన, విద్యాదీవెన నిధులు ఎగ్గొట్టిన జగన్ నిర్వాకంతో 2లక్షల మంది విద్యార్థులు రోడ్డునపడే పరిస్థితి
• విద్యాసంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. – గతప్రభుత్వ బకాయిలు చెల్లిస్తున్నానంటూ అబద్ధాలుచెబుతున్న ముఖ్యమంత్రి అసమర్థతతో రూ.450కోట్లకోసం విద్యాసంస్థలు హైకోర్ట్ మెట్లు ఎక్కాయి
• వైసీపీ ప్రభుత్వమిచ్చిన జీవో-28, జీవో-64లను హైకోర్ట్ కొట్టేసినా లెక్కచేయకుండా నవంబర్-30, 2021న ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు తల్లులఖాతాల్లోనే వేస్తూ, జగన్ జీవో -35 ఇవ్వడం కోర్టు ధిక్కరణ కాదా?
• ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముని తల్లులఖాతాల్లో వేయడంవల్ల 40శాతం సొమ్ము సక్రమంగా వారికిచేరలేదని దాంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్న న్యాయస్థానం వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చెవికి ఎక్కకపోవడం బాధాకరం
– టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
జగన్ రెడ్డి పాలనలో విద్యార్థులపడుతున్న బాధలు, ఇక్కట్లు, వారుపడుతున్న వేదన అంతా ఇంతాకాదని, జగనన్నవసతిదీవెన, విద్యాదీవెన పథకాల అమల్లో ముఖ్యమంత్రి ఘో రంగా విఫలమయ్యాడని, పథకాలకు సంబంధించి 4విడతలసొమ్ముని నిలిపివేశాడని, దాంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“2020-21లో ఒకవిడత, 2022-23లో మూడువిడతల ఫీజురీయింబర్స్ మెంట్ సొమ్ముని జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు. ఒక్కోవిడతలో రూ.600కోట్లచొప్పున మొత్తంగా 4విడతల్లో జగ న్ రూ.2,400కోట్లు విద్యార్థుల తరుపున చెల్లించకుండా, ప్రభుత్వం విద్యాసంస్థలకు బకాయి లు పెట్టింది. దానితోపాటు వసతిదీవెన కింద ప్రతిసంవత్సరం రెండువిడతలుగా డబ్బు చెల్లిం చాల్సి ఉంది. 4ఏళ్లలో జగన్ వసతిదీవెన కిందకూడా రూ.2,400కోట్లు ఎగ్గొట్టాడు. విద్యాదీవె న, వసతిదీవెన పథకాలకింద జగన్ మొత్తంగా విద్యార్థులకు రూ.5వేలకోట్ల ఎగ్గొట్టాడు. ముఖ్యమంత్రి చేసిన తప్పుకు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చెలగా టమాడుతున్నాయి.
విద్యార్థులకు వారి విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వ కుండా యాజమాన్యాలు నిలిపివేస్తున్నాయి. దాంతో విద్యార్థులకు సర్టిఫికెట్లుఅందని దుస్థితి. విద్యార్థులు, తల్లులు వారిబాధల్ని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని కలుద్దామంటే, ఆయన చుట్టూ పోలీస్ వలయంలో ఉండి, ఎవరినీ దగ్గరకురానివ్వడు. ఉత్తుత్తి బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ, వాటికి సంబంధించి వందలకోట్ల ప్రజలసొమ్ముతో సాక్షిపత్రికలో ప్రకట నలు వేయించడంలో ముందువరుసలో ఉంటున్నాడు.
గతప్రభుత్వ బకాయిలు తాను చెల్లిస్తున్నానన్న ముఖ్యమంత్రి మాటలన్నీ పచ్చి అబద్ధాలే
తాను అమలుచేస్తున్న పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేఆలోచన లేకుండా, పథకాలపేరుతో సాక్షిమీడియాకు ఎలా ప్రకటనలు కట్టబెట్టాలన్న యావతో వ్యవ హరిస్తున్నాడు. గతప్రభుత్వాలు బకాయిలు పెట్టాయని అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి , తనప్రభుత్వ బకాయిలపై ఎందుకు నోరెత్తడు? విద్యాసంస్థలకు ప్రభుత్వంచెల్లించాల్సిన బకా యిలు చెల్లించకుంటే, సంస్థల మనుగడ ప్రశ్నార్థకంకాదా?
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవ డమే కాకుండా విద్యావ్యవస్థనే జగన్ సర్వనాశనంచేశాడు. రూ.450కోట్ల బకాయిలకోసం విద్యాసంస్థల యాజమాన్యాలు హైకోర్టు మెట్లు ఎక్కించే దుస్థితికల్పించాడు. 2లక్షల మంది విద్యార్థులు ముఖ్యమంత్రి నిర్వాకంతో నష్టపోయే పరిస్థితి. చదువులు పూర్తిచేసుకొని కూడా సర్టిఫికెట్లు చేతికి అందక తమజీవితాలు ఏమిటా అని తీవ్రంగా ఆందోళనచెందుతున్నారు.
బకాయిలు అడిగిన విద్యాసంస్థల్ని బెదిరించడం, బేరాలు ఆడటం ఈ ముఖ్యమంత్రికే చెల్లింది.
విద్యాసంస్థల యాజమాన్యాలు బకాయిలు అడిగాయని ఈప్రభుత్వం వాటిపై బెదిరింపులకు దిగుతోంది. ఇవ్వాల్సిన బకాయిల్లో 75శాతం మాత్రమేచెల్లిస్తామని, కాదంటే తనిఖీలపేరుతో అధికారుల్ని పంపిస్తామని యాజమాన్యాల్ని వేధిస్తూ బేరాలు ఆడుతోంది. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా..లేక వ్యాపారసంస్థా? జగన్ ఫీజురీయింబర్స్ మెంట్ సొమ్ముని తల్లులఖాతాల్లో వేయడంవల్ల 40శాతంసొమ్ము వారిఖాతాల్లో పడలేదని, ఈపద్ధతి మార్చుకోవాలని స్వయం గా హైకోర్టేచెప్పింది.
జగన్ ప్రభుత్వమిచ్చిన, జీవో-28, జీవో-64లను కొట్టేసింది. హైకోర్ట్ జీవోలు కొట్టేసినా కూడా లెక్కచేయకుండా జగన్ నవంబర్-30, 2021న ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు తల్లులఖాతాల్లోనే వేస్తూ జీవో-35 ఇచ్చాడు. ముఖ్యమంత్రికి కోర్టులంటే లెక్కలేదు. న్యాయమూర్తులంటే గౌరవంలేదు. హైకోర్టుఆదేశాలను బేఖాతరు చేస్తూ ముఖ్య మంత్రి అడ్డగోలుగా వ్యవహరించడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది.
జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముని తల్లులఖాతాల్లో వేయడంవల్ల వారు కుటుంబఅవసరాలకోసం ఆ సొమ్ముని వాడుకుంటూ, కళాశాలలకు చెల్లించడంలేదు. జగన్ ఓట్లరాజకీయం చేసే పనితో అంతిమంగా విద్యార్థులే నష్టపోతున్నారు. విద్యార్థుల జీవితాలను నాశనంచేసే పను లకు ముఖ్యమంత్రి ఇకనైనా స్వస్తిచెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.
రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలతో ఏపీ విద్యార్థులు ఉన్నతివిద్యాభ్యాసంకోసం పొరుగురాష్ట్రాల వైపు చూస్తున్నారు
రాష్ట్రప్రభుత్వ విద్యావ్యతిరేక నిర్ణయాలతో వందలాది విద్యార్థులు ఉన్నతవిద్యకోసం పొరుగు రాష్ట్రాల బాటపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు వెళ్తున్నారు. ఈ సంవత్సరం మన రాష్ట్రవిద్యార్థులు 60వేలమంది తెలంగాణలో ఎంసెట్ పరీక్షరాశారు. ఏపీ విద్యార్థులు తెలంగా ణలో పరీక్షరాయడం నిజంగా ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో పాటు విద్యార్థుల్నికూడా పొరుగురాష్ట్రాలబాట పట్టించేలా చేసిన ఘనుడు మనముఖ్యమంత్రి.
జీవోనెం-77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్, వసతిదీవెన లేకుం డా చేశాడు. ప్రభుత్వప్రోత్సాహం లేకపోవడంతో పీజీ చదివే విద్యార్థులసంఖ్య దారుణంగా పడి పోయింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేప్రకారం దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థుల సంఖ్యలో బీహార్ కంటే మనరాష్ట్రం వెనుకపడిందని తేల్చడం ముఖ్యమంత్రికి సిగ్గుచేటు కాదా?
చంద్రబాబునాయుడి హాయాంలో 16లక్షలమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తే, జగన్ వచ్చాక ఆ సంఖ్య 11లక్షలకు పడిపోయింది. వైసీపీప్రభుత్వంలో 5లక్షల మంది విద్యార్థులు విద్యకుదూరమయ్యారు అనిచెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు అన్నితరగతుల్లో విద్యార్థులసంఖ్య దారుణంగా తగ్గిపోయింది.
జగన్ తలతిక్క విధానాలతో అంతిమంగా విద్యార్థులే విద్యకు దూరమయ్యారు
విద్యావ్యవస్థలో పెనుమార్పులు అంటూ ముఖ్యమంత్రి ఉన్న ఇల్లుపీకి పందిరి వేశాడు. జగన్ తలతిక్క విధానాలతో అంతిమంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమయ్యారు. పాదయాత్రలో తలలునిమురుతూ ఇంట్లోఎంతమంది పిల్లలుఉన్నా, వారు ఎంతచదివినా తానే ఆ ఖర్చుమొత్తం భరిస్తానని చెప్పాడు.
ముఖ్యమంత్రి అయ్యాక ఫీజు రీ యింబర్స్ మెంట్ సొమ్ము ఎగ్గొట్టి, ఫీజుల్ని విపరీతంగా పెంచి, విద్యార్థుల్ని విద్యకు దూరం చేశాడు. నానాఅవస్థలుపడి విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికి విద్యార్హత సర్టిఫికెట్లు అందని దుస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తనరాజకీయాలు ఆపి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు వేదన, రోదన విని, వారితరుపున ఇవ్వాల్సిన బకాయిల్ని వెంటనే విద్యాసంస్థల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకు సంబంధించిన ప్రకటనలకే ముఖ్యమంత్రి ఇప్పటివరకు రూ.100కోట్లు ఖర్చుపెట్టాడు. ఆసొమ్మునే ఫీజురీయింబర్స్ మెంట్ కిందచెల్లించి ఉంటే, వందలమంది విద్యార్థులజీవితాలు బాగుపడేవి. విద్యార్థుల్ని అడ్డుపెట్టుకొని తన మీడియాను ఆర్థికంగా బాగుచేసుకునే పనులు మానుకోవాలని ముఖ్య మంత్రికి సూచిస్తున్నాం. జగన్ ఇప్పటికైనా తన ప్రచారఆర్భాటానికి స్వస్తిచెప్పి, అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థిసంఘాలతో చర్చించి, వచ్చే విద్యాసంవత్సరం నుంచైనా ఫీజురీయింబర్స్ మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
జగన్ తీసుకొచ్చిన నూతన విద్యావిధానాలను సరిచేసి, ప్రాథమికవిద్య నుంచే విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, మూతపడిన పాఠశాలలు, కళాశాలలు తెరవాలని, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల్ని నియమించాలని, మాతృభాషలోనే ప్రాథ మిక విద్యాబోధన అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నాణ్యమైన విద్యను అందించాలి” అని రఫీ తెలుగుదేశంపార్టీ తరుపున ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.