-మనది కియా… వాళ్ళది కోడి కత్తి
-లక్ష కోట్ల ప్రజాధనం దొబ్బిన వాడు, లక్ష రూపాయల చెప్పులు వాడేవాడు , వెయ్యి రూపాయల నీళ్ల బాటిల్ తాగేవాడు పేదవాడా?
-సొంత పేపర్, ఛానెల్, సిమెంట్ కంపెనీ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు?
-బెంగుళూరు యలహాంక ప్యాలస్, తాడేపల్లి ప్యాలస్, హైదరాబాద్ ప్యాలస్, ఇడుపులపాయ ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా?
-కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వైసిపి. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ టిడిపి
-మంత్రి డిక్షనరీ ప్రకారం వైసిపి ది ఎర్రిపప్ప ప్రభుత్వం. జగన్ ఒక ఎర్రిపప్ప సీఎం
-నేను మంత్రి డిక్షనరీ ప్రకారం అడుగుతున్నా ఎర్రిపప్ప సీఎం జగన్ గారు ధాన్యం ఎప్పటిలోగా కొంటారు? నాది అంబేద్కరిజం… జగన్ ది సైకోయిజం
-నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు బహిరంగ సభలో నారా లోకేష్
శ్రీశైలం సత్తా ఏంటో చూపించారు. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే జగన్ టివిలు పగలగొట్టడం ఖాయం. శ్రీశైలం ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం. మల్లన్న ఆలయం, భ్రమరాంబికాదేవి దేవాలయం, శ్రీ మహానందీశ్వరుడి క్షేత్రం కొలువైన పుణ్యభూమి శ్రీశైలం. వృధాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలని మొదట ఆలోచించింది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగుగంగ ప్రాజెక్టు, వెలుగోడు జలాశయం నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.యువగళం…మనగళం…ప్రజాబలం. టిడిపి కార్యకర్తల పార్టీ…జగన్ రెడ్డిది దొంగలు, డెకాయిట్ల పార్టీ. చంద్రబాబు గారు విజనరీ…జగన్ ప్రిజనరీ.
మనది కియా… వాళ్ళది కోడి కత్తి. నాలుగేళ్లలో ప్రిజనరీ పీకింది ఏమి లేదు ఇక పీకబోయేది ఏమి లేదు. జగన్ ఒక పిరికోడు అందుకే మీ లోకేష్ ని అడ్డుకోవడానికే జిఓ1 తెచ్చాడు. ఏ1 నువ్వు తెచ్చిన జిఓ1 మడిచి పెట్టుకో అని నేను ఆరోజే చెప్పా. ఏ1 తెచ్చిన జిఓ1 ని హైకోర్టు కొట్టేసింది. జిఓ1 పోయింది. 2024 ఎన్నికల్లో ఏ1 జెండా పీకేయడం పక్కా. అంబేద్కర్ గారి రాజ్యాంగం గెలిచింది. రాజారెడ్డి రాజ్యాంగం చెత్త బుట్టలో పడింది.నన్ను అడ్డుకోవడానికి ఏ1 దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు అయిపోయాయి. పోలీసులను పంపితే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి తగ్గేదేలేదు అని చెప్పాను. ఇప్పుడు గొడవలు చెయ్యమని వైసిపి కుక్కల్ని పంపుతున్నాడు.
బ్రదర్ బీ కేర్ ఫుల్ భయం మా బయోడేటాలో లేదు.సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర. ఎవడైనా అడ్డుకుంటాం అంటూ ఎగేసుకొని వస్తే తోలువలుస్తాం. రోజుకో రంగు మార్చే ఊసరవెల్లి జగన్. అందుకే పేరు మార్చి ఊసరవెల్లి జగన్ అని పెట్టా. ఊసరవెల్లి జగన్ ఈ మధ్య రెండు విషయాలు పదేపదే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటే ఊసరవెల్లి కూడా షాక్ కి గురవుతుంది.ఆ రెండు అంశాల పై నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. మొదటిది ఊసరవెల్లి జగన్ పేదవాడు అంట. ప్రపంచంలో 8వ వింత ఇదే. లక్ష కోట్ల ప్రజాధనం దొబ్బిన వాడు, లక్ష రూపాయల చెప్పులు వాడేవాడు , వెయ్యి రూపాయల నీళ్ల బాటిల్ తాగేవాడు పేదవాడా? సొంత పేపర్, ఛానెల్, సిమెంట్ కంపెనీ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు?బెంగుళూరు యలహాంక ప్యాలస్, తాడేపల్లి ప్యాలస్, హైదరాబాద్ ప్యాలస్, ఇడుపులపాయ ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా? 2024 ఎన్నికల్లో కోటీశ్వరుడు జగన్ కి కూటికి లేని పేదలకు మధ్య యుద్ధం జరగుతుంది.
రెండోవది సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు అంటూ ఊసరవెల్లి జగన్ అసత్య ప్రచారం మొదలు పెట్టాడు. కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వైసిపి. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ టిడిపి. ఊసరవెల్లి జగన్ నిక్కర్ వేసుకునే టైం లోనే దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు. రెండు రూపాయిలకే కిలో బియ్యం, రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, 65 ఏళ్లు దాటిన వారికి 30 రూపాయల పెన్షన్, జనతా వస్త్రాల పేరుతో తక్కువ ధరకే బట్టలు అందించడం, పక్కా ఇళ్ళ నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది టిడిపినే.
రూ.200 పెన్షన్ ని రూ.2 వేలు చేసింది, అన్న క్యాంటిన్, చంద్రన్న భీమా, పెళ్లి కానుక, పండుగ కానుకలు ఇచ్చింది చంద్రబాబు గారు.కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు దొబ్బేది ఊసరవెల్లి జగన్. పేదరికం, సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఊసరవెల్లి జగన్ కి లేదు. ఊసరవెల్లి జగన్ హయాం కంటే చంద్రబాబు గారి హయాంలోనే ఎక్కువ సంక్షేమం,అభివృద్ధి జరిగింది. దీని పై చర్చకు నేను రెడీ ఊసరవెల్లి జగన్ నువ్వు రెడీనా?ఊసరవెల్లి జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.తడిచిన ధాన్యం కొనమని ఒక రైతు అడిగితే ఎర్రిపప్ప అని తిట్టాడు మంత్రి కారుమూరి నాగేశ్వరావు.నోరు పారేసుకోవడమే కాకుండా ఎర్రపప్పకు కొత్త అర్ధం చెప్పాడు. ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్న అని అర్ధం అంట.
మంత్రి డిక్షనరీ ప్రకారం వైసిపి ది ఎర్రిపప్ప ప్రభుత్వం. జగన్ ఒక ఎర్రిపప్ప సీఎం. నేను మంత్రి డిక్షనరీ ప్రకారం అడుగుతున్నా ఎర్రిపప్ప సీఎం జగన్ గారు ధాన్యం ఎప్పటిలోగా కొంటారు?మంత్రి, జగన్ రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పే వరకూ మీ ప్రభుత్వాన్ని ఎర్రిపప్ప ప్రభుత్వం అని, ఎర్రిపప్ప జగన్ అని పిలుస్తాం. ఊసరవెల్లి జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. ఊసరవెల్లి జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. ఊసరవెల్లి జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.
ఊసరవెల్లి జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ ఊసరవెల్లి జగన్. ఊసరవెల్లి జగన్ యువత భవిష్యత్తును నాశనం చేసాడు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. ఊసరవెల్లి జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు.సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.
అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. ఊసరవెల్లి జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. ఊసరవెల్లి జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి.రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. ఊసరవెల్లి జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు ఊసరవెల్లి జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం.బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం.మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.
ఊసరవెల్లి జగన్ దళిత ద్రోహి.డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది.ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు.ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా?సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన అన్ని కార్యక్రమాలు దళితుల కోసం ప్రారంభిస్తాం.
మైనారిటీలను మోసం చేసాడు ఊసరవెల్లి జగన్.దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు.ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు.ఊసరవెల్లి జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు.
టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.
రెడ్డి సోదరులు 2019 ఎన్నికల్లో కోట్లు ఖర్చు బెట్టి జగన్ ని గెలిపించారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం దక్కడం లేదు. ఊసరవెల్లి జగన్ నేను రాయలసీమ బిడ్డని అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. రాయలసీమ ఎత్తిపోతల పధకం ఎత్తిపోయింది. ఎన్జిటిలో స్టే ఉంటే కనీసం లాయర్ ని పెట్టే దిక్కులేదు. బాబాయ్ హత్య కేసు నిందితులను కాపాడటానికి పెద్ద లాయర్లను పెట్టాడు. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం.
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు.రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. 2019 ఎన్నికల్లో మీరు భారీ మెజారిటీ తో శిల్పా చక్రపాణి రెడ్డి గారిని గెలిపించారు. శ్రీశైలం ఏమైనా అభివృద్ధి చెందిందా? ఎవరి జీవితాలు అయినా మారాయా? ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు కలిసి శ్రీశైలంను దోచుకుంటున్నారు. భూకబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తున్నారు.అందుకే పేరు మార్చాను ఆయన శిల్పా చక్రపాణి కాదు చీటింగ్ చక్రపాణి. 5 లక్షలు పనికి కూడా 10 శాతం తీసుకుంటున్నాడు అంటే చీటింగ్ చక్రపాణికి ఎంత డబ్బు పిచ్చి ఉందో అర్ధం చేసుకోండి.
చీటింగ్ చక్రపాణి అని ఎందుకు అంటున్నానో చెబుతా. ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే చీటింగ్ చక్రపాణి గారు వర్ధన్ బ్యాంక్ ప్రారంభించారు. ఆ రోజు ఆయన ఎం అన్నారో గుర్తుందా? వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంక్ అన్నారు. ఆ బ్యాంక్ రూ.100 కోట్లు సేకరించి దుకాణం సర్దేసింది. బ్యాంకు పెట్టిన బినామీని పార్టీ నుండి సస్పెండ్ చేయించి డబ్బు మొత్తం కొట్టేసాడు చీటింగ్ చక్రపాణి. 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తాం అని దళితుల్ని మోసం చేసాడు ఈ చీటింగ్ చక్రపాణి. డిపాజిటర్లకు నేను హామీ ఇస్తున్నా వైసిపి నాయకులు దోచుకున్న డబ్బులు కక్కిస్తాం.
దేవుడ్ని కూడా వదలలేదు చీటింగ్ చక్రపాణి. శ్రీశైలం దేవస్థానాన్ని ఏటీఎంలా మార్చుకున్నారు. శ్రీశైలం దేవస్థానంలో తన ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డుల నియమాక టెండర్లు బంధువు రాజశేఖరరెడ్డి కట్టబెట్టారు. వ్యాపారుల దగ్గర నుండి అక్రమ వసూళ్లు, అక్రమంగా షాపుల ఏర్పా టు, లడ్డు తయారీలో అక్రమాలకు పాల్పడి దేవుడి సొమ్ము కాజేస్తున్నారు వైసిపి నాయకులు. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం టికెట్ల దగ్గర నుండి ప్రసాదం వరకూ వైసిపి నేతల దోపిడీ జరుగుతుంది.
కృష్ణాపురం గ్రామంలోని లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి చెందిన 40 ఎకరాల భూమిని చీటింగ్ చక్రపాణి అనుచరుడు పుల్లారెడ్డి కబ్జా చేసి అమ్మేసుకున్నాడు. శ్రీశైలం లో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్నా చీటింగ్ చక్రపాణి తమ్ముడు శిల్పా భువనేశ్వర రెడ్డికి 10 శాతం కప్పం కట్టాల్సిందే. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో చీటింగ్ చక్రపాణి అనుచరులు వడ్డి వెంకటరెడ్డి, గుండయ్య ఇరిగేషన్ భూములు పది ఎకరాలకు పైగా కబ్జా చేశారు. లాడ్జ్ లు కూడా కట్టేసారు.
సున్నిపెంటలో డ్రైవర్ అసోషియేషన్ భూములు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేసారు చీటింగ్ చక్రపాణి అనుచరులు.ఆత్మకూరు లో చీటింగ్ చక్రపాణి అనుచరుడు అంజాద్ అలీ రూ.10 కోట్లు విలువ చేసే అసైన్డ్ భూములను కబ్జా చేసాడు. సర్వే నంబర్ 825/ఏ1 లో ఉస్సేన్ సాహెబ్ కి చెందిన భూమి ని అంజాద్ అలీ కబ్జా చేసాడు. బాధితుడు ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
ఆత్మకూరులో గుండ్లమ్మ వాగును చీటింగ్ చక్రపాణి అనుచరులు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేసారు. మహానంది మండలం అంకిరెడ్డి చెరువు ఎర్రమట్టిని వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి అక్రమంగా తవ్వేశారు. బండి ఆత్మకూరు వద్ద కుందూ నదిలో ఇసుకను చీటింగ్ చక్రపాణి అనుచరులు అక్రమంగా దోచేస్తున్నారు. ప్రభుత్వ డిపో ల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నాడు చీటింగ్ చక్రపాణి స్నేహితుడు ప్రభాకర్ రెడ్డి. చీటింగ్ చక్రపాణి అనుచరుడు రమేష్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వైసిపి వేసిన సిట్ తోనే విచారణ చేయించి వైసిపి నాయకులు దోచుకున్న డబ్బు మొత్తం రికవరీ చేస్తాం.
బండి ఆత్మకూరు మండలంలో అటవీ సమీప ప్రాంతాల్లో ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.చీటింగ్ చక్రపాణి శ్రీశైలం ప్రజలకు అనేక హామీలు ఇచ్చాడు. ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? శ్రీశైలం కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. షాపులు తక్కువ ధరకు కేటాయిస్తా అన్నాడు.ఫ్యాక్టరీలు, అటవీ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ప్రతి మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడు.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందిస్తా అన్నాడు.ఆత్మకూరులో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తా అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు చీటింగ్ చక్రపాణి.
శ్రీశైలంని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, పేదలకు ఇళ్లు, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు కట్టింది టిడిపి.ఆత్మకూరులో తాగునీటి సమస్య తీర్చడానికి రూ.116 కోట్లతో పనులు ప్రారంభిస్తే ఆ పనులు వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.టిడిపి హయాంలో సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పధకానికి రూ.116 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసాం. జగన్ ప్రభుత్వం కరెంట్ బిల్లులు, నిర్వహణ కు నిధులు ఇవ్వకపోవడంతో సాగునీరు అందని దుస్థితి.నియోజకవర్గంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తాం.అరటి, పసుపు రైతులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది.
వెలుగోడు రిజర్వాయర్ రిపేర్ వర్క్స్ కి జగన్ ప్రభుత్వంలో దిక్కులేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మరమ్మత్తులు చెయ్యడానికి నిధులు కేటాయిస్తాం.శ్రీశై లం నియోజకవర్గంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. నాది అంబేద్కరిజం… జగన్ ది సైకోయిజం.మీరు అంబేద్కర్ గారి వైపు ఉంటారా? సైకో వైపు ఉంటారా తేల్చుకోండి.సైకో జగన్ పని అయిపోయింది. రాబోయేది టిడిపి ప్రభుత్వం. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసిపి నాయకులు వడ్డీ తో సహా చెల్లిస్తాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రాష్ట్రానికి తెచ్చి శిక్షిస్తాం. శ్రీశైలం గడ్డ పై పసుపు జెండా ఎగరడం ఖాయం.