Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

యాదవ సమాజాన్ని కించ పరిచిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను యాదవ సంఘాల నేతలు ఖైరతాబాద్ చౌరస్తాలో దగ్దం చేశారు. శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా చౌరస్తా కు చేరుకొని దిష్టిబొమ్మ ను దగ్దం చేశారు. రేవంత్ అగ్రకుల దురహంకారంతో యాదవ కులాన్ని విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను విమర్శించే క్రమంలో యావత్ యాదవ్ సంఘాన్ని ఎలా దూషిస్తారని నిలదీశారు. రేవంత్ తన తప్పును గ్రహించి దేశరత్తుగా యాదవ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లోపు రేవంత్ క్షమాపణ చెప్పకపోతే నగరం తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆయనను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE