• చంద్రబాబునాయుడు ఉంటున్న ఇల్లే అతనికి పెద్దసమస్య
• దేశంలో ఏముఖ్యమంత్రి, ఏ ప్రతిపక్షనేతపై జగన్మోహన్ రెడ్డిలా కక్ష సాధింపులకు పాల్పడలేదు
• చంద్రబాబు నివాసం ఉంటున్నఇల్లు ఒక్కటే జగన్ కు అక్రమకట్టడంలా కనిపిస్తోందా.. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న కట్టడాల సంగతేమిటి?
• చంద్రబాబు అద్దెకట్టకపోతే, ఇంటియజమాని అడగాలి. క్యాంప్ క్లర్క్ సజ్జలకు, ముఖ్యమంత్రికి వచ్చిన నొప్పేంటి?
• చంద్రబాబు తాను ఉంటున్న ఇంటిని అధికారికనివాసంగా ప్రకటించాలని 2019నుంచి ప్రభుత్వానికి లేఖలురాస్తుంటే పాలకుల్లో స్పందనలేదు
• బినామీలతో సంపాదించిన ఆస్తుల్ని అనుభవిస్తూ, బినామీభవనాల్లో ఉంటూ, బినామీ బతుకులు బతుకుతున్నవారు, బస్సులోఉన్న చంద్రబాబుని తప్పుపట్టడం హాస్యాస్పదం.
• కాగితాలకే పరిమితమైన రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంలో క్విడ్ ప్రోకో ఎలా జరిగిందో ముఖ్యమంత్రే చెప్పాలి.
• తాను ఉంటున్నతాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల పేదలులేకుండా తరిమేసిన జగన్ పేదలపక్షపాతా? ఇడుపులపాయలో వందల ఎకరాలదళితులభూములు ఆక్రమించుకున్న జగన్, రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తాడా?
• మొన్నటివరకు జీవో-1తో చంద్రబాబుని అడ్డుకున్నారు. దాన్నికోర్టు కొట్టేయడంతో ఇప్పుడు ఆయన ఇంటిపైపడ్డారు
మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే విధ్వంసంతోనే తనపాలన ఆరంభించాడని, ముఖ్య మంత్రికి చంద్రబాబు, ఆయనఇల్లు తప్ప రాష్ట్రంలోని ఇతరసమస్యలు కనిపించడంలేదని, క్యాంప్ క్లర్క్ సజ్జల చంద్రబాబునివాసం ప్రభుత్వానిదా..ప్రైవేట్ దా అనిప్రశ్నించడం విచిత్రంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
తాను ఉంటున్న ఇంటిని అధికారిక నివాసంగా ప్రకటించాలని 2019 నుంచి చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా, స్పందించని వారు ఇప్పుడు అదే ఇల్లు అక్రమకట్టడం అనడం సిగ్గుచేటు
“ చంద్రబాబు నివాసం ప్రైవేట్ ఆస్తి అని క్యాంప్ క్లర్క్ సజ్జలకు, ప్రభుత్వానికి బాగాతెలుసు. ప్రజలకోసం, ప్రభుత్వంకోసం చంద్రబాబునిర్మించిన ప్రజావేదిక ప్రభుత్వఆస్తి అనే కదా జగన్ కూల్చేశాడు. అదేవిధంగా చంద్రబాబునివాసాన్ని కూడాకూల్చడానికి ప్రయత్నిస్తే, సదరు భవనం యజమాని కోర్టుకు వెళ్లి స్టేతెచ్చుకున్నారు. అన్నీతెలిసికూడా క్యాంప్ క్లర్క్ నటిస్తు న్నాడు. చంద్రబాబు రాజధానిప్రాంతంలో ఉండాలన్నఆలోచనతో ఉండవల్లిలో అద్దెఇంట్లో ఉంటున్నారు. ప్రతిపక్షనేతగా కూడా ఆయన అక్కడేఉంటున్నారు. తానునివాసం ఉంటు న్న ఇంటిని అధికారికనివాసంగా ప్రకటించాలని 2019నుంచి ఆయనప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉన్నారు. ఏనాడూపాలకులు ప్రతిపక్షనేత లేఖలపై స్పందించిందిలేదు. ఈ విషయా లుఅన్నీతెలిసిన నయా ఆస్కార్ నటుడు, మాత్రం ఇంకా ఏమీతెలియనట్టే నటిస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షనేత హోదాలో విజయవాడ వచ్చి, తనకు ఇల్లులేదు అంటే చంద్రబాబు స్టేట్ గెస్ట్ హౌస్ ని తననివాసానికి కేటాయించింది నిజంకాదా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా విశాలథృక్పథంతో ఆలోచిస్తే, జగన్ మాత్రం సంకుచిత మనస్తత్వంతో వ్యవ హరిస్తున్నాడు. ఆ క్రమం లోనే చంద్రబాబు ఉంటున్న ఇంటిపై అటాచ్ డ్రామాలు ఆడుతు న్నాడు. చంద్రబాబు ఉండేది అద్దెఇల్లు అయితే దానికి ఎప్పుడు డబ్బులుకట్టారు అంటున్నారు. దానికి సంబంధించిన అద్దె రసీదులు తమవద్దఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు దోపిడీదారు, ఇతరఆస్తులు కబ్జాచేసే కబ్జాకోరుకాదు.
ఇడుపులపాయ, పులివెందుల, హైదరాబాద్, తాడేపల్లి, బెంగుళూరులోని జగన్ భవనాలు ఆయన పేరుతోఉన్నాయా? ఆయనభార్య భారతిపేరుతో ఉన్నాయా? బినామీలను అడ్డం పెట్టుకొని బినామీ బతుకుబతికే జగన్, చంద్రబాబు నివాసం అక్రమకట్టడం అనడం సిగ్గుచేటు
ముఖ్యమంత్రి తనగుండెకోస్తే పేదలే కనిపిస్తారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇడుపులపాయలో వందల ఎకరాల దళితుల భూములు ఆక్రమించుకున్న జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ఏనాడైనా ఒక్కఎకరం దళితులకు ఇచ్చాడా? తాడేపల్లిలో నివాసం ఉంటూ, ఆ చుట్టుపక్కల పేదలుఎవరూ తనకంటికి కనిపించకూడదని వారినిభయపెట్టి, అక్కడనుంచి తరమేసిన జగన్ పేదలపక్షపాతా? జగన్ దేశంలోనే ధనికముఖ్యమంత్రిగా ఉండి, తాడేపల్లిలో కట్టిన ప్యాలెస్, ఇడుపులపాయ, బెంగుళూరు, హైదరాబాద్ లలో కట్టిన ప్యాలెస్ లలో ఒక్కటైనా జగన్ పేరుతో, ఆయనభార్య భారతిపేరుతో ఉందని క్యాంప్ క్లర్క్ సజ్జల చెప్పగలడా?
అలాచెప్పే నైతికత సజ్జలకు, ముఖ్యమంత్రికి ఉన్నాయా? అధికారాన్ని ఉపయోగించి, కనపడినవాటిని కబ్జాచేస్తూ, బినామీలద్వారా వచ్చిన ఆస్తులతో ఆ ప్యాలెస్ లు కట్టారు తప్ప, ఒక్కటైనా జగన్ తనపేరుతో తనడబ్బుతో ఇల్లుకట్టాడా? బినామీలద్వారా సంపాదిం చి, బినామీపేర్లతో కట్టినఇళ్లల్లో ఉండే జగన్, అతని అనుచరులు బతుకులు బినామీ బతుకు లు కావా అనిప్రశ్నిస్తున్నాం. బెంగుళూరులో జగన్ దని చెబుతున్న ప్యాలెస్, ఆయనకు ఎలావచ్చింది?
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ప్రాపర్టీస్ యాజమాన్యానికి హైదరాబాద్ లో ఎస్.ఈ.జెడ్ ఇచ్చినదానికి కృతజ్ఞతగా, బెంగుళూరులోని వారి ప్యాలెస్ ను జగన్ కు ఇచ్చారు. హైదరాబాద్ లోటస్ పాండ్ భవనం కూడా జగన్ కు అలా వచ్చిందే. తాడేపల్లిలో ఇప్పుడుజగన్ ఉంటున్న భవనం సీఆర్డీఏ, ఉడా నిబంధనలకు విరుద్ధంగా కట్టిందికాదా? తానునివాసం ఉంటున్న భవనాలు ఎవరివో చెప్పుకోలేని జగన్, చంద్రబాబు అద్దెకుఉండే ఇంటిని అక్రమకట్టడం అనడం సిగ్గుచేటుకాదా?
దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి పేదవాడా?
దేశంలో అత్యంతసంపన్నుడైన ముఖ్యమంత్రి అయిన జగన్ పేదవాడా? తాను పేదలకోసం పోరాడుతున్నాడా? ఇసుక, మద్యం, ఇతర ఖనిజాల లూఠీతో వేలకోట్లు కొట్టేస్తున్న జగన్ పేదవాడినని చెప్పడం చూస్తే, నిజంగా ఊసరవెల్లికూడా సిగ్గుపడుతుంది. చంద్రబాబుగానీ, తెలుగుదేశంప్రభుత్వంగానీ ఎప్పుడూ ప్రజలఅవసరాలకోసమే పనిచేశాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 2018లో ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరించినప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నఆళ్లరామకృష్ణారెడ్డి ఆనాడు ఒక్కఅభ్యంతరంకూడా చెప్పలేదు.
6 సంవత్సరాల తర్వాత తీరుబడిగా ఇప్పుడు ఆయన కాగితాలకే పరిమితమైన ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంలో అక్రమాలుజరిగాయని ఆయనఫిర్యాదుచేయడం…దానిపై ప్రభుత్వం సీఐడీతో దర్యాప్తు చేయించడం కక్షసాధింపుకాక ఏమవుతుంది? ఎవరికైతే లబ్దికలిగిందో, వారిపేరుతో ఆస్తులుఉంటే క్విడ్ ప్రోకో అంటారని, జగన్ సరికొత్త నిర్వచనం చెబుతున్నారు.
ఎవరైనావ్యక్తులు లబ్ధిపొంది, వారికి సంబంధించిన ఆస్తులు, భూములు, భవనాల్ని లబ్దిచేకూ ర్చినావారికో, వారి బినామీలకో బదలాయిస్తే, దాన్ని క్విడ్ ప్రోకో అంటారు. జగన్ సంపాదించి న ఆస్తులన్నీ అలావచ్చినవే కదా! ఎన్నికలు దగ్గరకొస్తున్నతరుణంలో, రాష్ట్రంలోని సమస్య లనుంచి ప్రజలదృష్టి మళ్లించడానికి, చంద్రబాబుగారిపై బురదజల్లేందుకే జగన్ ఇలాంటి తప్పుడు కేసులు సృష్టిస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డిలాగా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రతిపక్షనేతపై ఇంతలా కక్షసాధింపులకు పాల్పడిందిలేదు
దేశంలోని అన్నిరాష్ట్రాల్లో ప్రతిపక్షనేతలు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏ ముఖ్యమంత్రికూడా ప్రధానప్రతిపక్షనేతపై కక్షసాధింపులకు పాల్పడింది లేదు. జగన్ ప్రభుత్వానికి విధ్వంసం, వినాశనంతప్ప మరోఆలోచనలేదు. చంద్రబాబునాయుడు ఉంటు న్నఇల్లే జగన్ కు అతిపెద్ద సమస్యా? ప్రజలు జగన్ కు అధికారమిచ్చింది ఇలాంటి చిల్లర పనులు చేయడానికేనా అని ప్రశ్నిస్తున్నాం. రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. కాగితాల్లోనే రోడ్డునిర్మాణం ఉంటే, దానిలో ఎవరికి ఎలా లబ్ధికలుగుతుంది? చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు లింగమనేని రమేశ్ ది. ఆయనది కాని ఇల్లు ఆయనకు క్విడ్ ప్రోకోలో వచ్చిందని ఎలా చెబుతారు?
రాజధానికి భూములిచ్చిన రైతుల వేదన, రోదన క్యాంప్ క్లర్క్ సజ్జలకు, ముఖ్యమంత్రికి కనిపించవు? చంద్రబాబునివాసమే వారికి ప్రధానసమస్య. ఇల్లులేకపోతే చంద్రబాబు బస్సు ఉండి పనిచేశారు. జగన్ మాదిరి ప్రజలిచ్చిన అధికారాన్ని విలాసాలకు ఉపయోగించలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏతప్పుచేయని వారిపై, గిట్టనివారిపై అనేకకేసులు పెట్టింది..ఇప్పటికీ పెడుతోంది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని, సింగపూర్ కంపెనీలకు భూములు కేటాయించారని, ఇష్టమొచ్చినట్టు ఆరోపణలుచేశారు.
ఏ ప్రభుత్వం కూడా గతంలో సీఐడీద్వారా ఇన్నికేసులు పెట్టిందిలేదు. మావద్ద ఉన్నలెక్కలప్రకారమే సీఐడీ ఇప్పటివరకు 150కిపైగా తప్పుడుకేసు లు పెట్టింది. రాజధాని నిర్మాణానికి రైతులు 33వేలఎకరాలు ఇస్తే, వారికి ఇవ్వాల్సినవి సక్రమంగా చెల్లించకుండా, వారిభూములు ఎవరికో ఇస్తామంటే అది న్యాయమా? భూములిచ్చిన రైతులు, వారి వేదన క్యాంప్ క్లర్క్ సజ్జలకు, ముఖ్యమంత్రికి కని పించవు. చంద్రబాబు ఉంటున్న ఇల్లే కనిపిస్తుంది. తెలుగుదేశందెబ్బకు జగన్ కు నిద్రపట్టడంలేదు.
అందుకే ఇలాంటివన్నీ వెతికి కోడిగుడ్డుమీద ఈకలుపీకే పనులు చేస్తున్నాడు. గతంలో రాజశేఖర్ రెడ్డికూడా తెలుగుదేశంపార్టీని లేకుండా చేయడానికి ప్రయత్నించి భంగ పడ్డాడు. ఇప్పుడు జగన్ కూడా అదేవిధంగా చేస్తూ, తనలోని భయాన్నికప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. కృష్ణానదికి ఇరువైపులా వందలాది నిర్మాణాలు ఉంటే, ముఖ్య మంత్రికి చంద్రబాబు నివాసముండే ఇల్లుమాత్రమే అక్రమకట్టడంలా కనిపిస్తుంది.
రాష్ట్ర విభజ న తర్వాత చంద్రబాబు బస్సులో ఉండే పాలనచేశారు. కానీ జగన్ విలాసవంతమైన భవనా ల్లో మాత్రమే ఉంటారు. ఆ భవనాలకు వెళ్లడానికి ప్రత్యేకవిమానాలు ఉపయోగిస్తారు. ప్రజలు ఇచ్చినఅధికారాన్ని చంద్రబాబు ప్రజలకు, రాష్ట్రానికి మేలుచేయడానికే వినియోగిస్తారు. జగన్ మాత్రం తన విలాసాలకు, దోపిడీకి, అవినీతికి మాత్రమేఉపయోగిస్తారు. చంద్రబాబు గారు ఇంటిఅద్దె కట్టకపోతే క్యాంప్ క్లర్క్ సజ్జలకు వచ్చిన నొప్పేంటి?
అద్దెకట్టకపోతే ఇంటి య జమాని అడుగుతాడు? మొన్నటివరకు జీవో-1తో చంద్రబాబుని అడ్డుకోవడానికి చేయాల్సిన దుర్మార్గాలు అన్నీచేశారు. చంద్రబాబుని అడ్డుకునేందుకు పోలీసుల్ని అడ్డుపెడితే, ఆయన అనపర్తిలో 7కిలోమీటర్లు నడిచివెళ్లి, సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో మీటింగ్ లో పాల్గొన్నారు. జీవో-1ను అడ్డంపెట్టుకొని వేసిన పాచికలు పారకపోవడంతో, ఇప్పుడు ఇంటిపై పడ్డారు. సం కుచిత మనస్తత్వంతో ఉన్నవారి ఆలోచనలు, పరిపాలన ఇలా సంకుచితంగానే ఉంటుంది.” అని ధూళిపాళ్ల తేల్చిచెప్పారు.